For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పెళ్లి కూతురి గెటప్‌లో బిగ్ బాస్ కంటెస్టెంట్: అలాంటి ఫొటో షేర్ చేయడంతో అంతా షాక్.!

  By Manoj
  |

  సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత దాన్ని క్యాష్ చేసుకోడానికి చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో సినీ ప్రముఖులు ముందే ఉంటున్నారు. తమ సినిమా ప్రమోషన్ల కోసమో.. ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లో ఉండడం కోసమో.. హైలైట్ అవడం కోసమో తరచూ ఏదో ఒక పోస్టును పెడుతూనే ఉంటున్నారు. ఇందులో భాగంగానే బిగ్ బాస్‌ షో ద్వారా బాగా పాపులర్ అయిన ఓ సినీ నటి హిమజ.. తాజాగా ఓ ఫొటోను షేర్ చేసింది. అందులో ఆమె పెళ్లి కూతురి గెటప్‌లో కనిపించడంతో అందరూ షాక్‌కు గురవుతున్నారు. ఆ సంగతులేంటో చూద్దాం పదండి.!

  స్వయంవరంతో ఎంట్రీ.... ఫుల్ బిజీగా బ్యూటీ

  స్వయంవరంతో ఎంట్రీ.... ఫుల్ బిజీగా బ్యూటీ

  నటన మీద ఉన్న ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది హిమజ. కెరీర్ ఆరంభంలో సీరియళ్లలో నటించే అవకాశాన్ని అందుకుంది. ‘స్వయంవరం' అనే సీరియల్ ద్వారా ఇండస్ట్రీలోకి పరిచయం అయిన ఆమె.. ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం' అనే సీరియల్‌తో నటిగా మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఈ క్రమంలోనే ఎన్నో ఆఫర్లను దక్కించుకుని సత్తా చాటిందీ బ్యూటీ.

  సినిమాల్లో సత్తా చాటుతోన్న తెలుగమ్మాయి

  సినిమాల్లో సత్తా చాటుతోన్న తెలుగమ్మాయి


  తెలుగు అమ్మాయిలకు అవకాశాలు దొరకడం కష్టం అన్న టాక్ ఇండస్ట్రీలో ఉంది. అయినా సరే తనలోని అద్భుతమైన టాలెంట్‌తో ఎన్నో అవకాశాలను అందుకుంది నటి హిమజ. తన కెరీర్‌లో ‘శివమ్', ‘నేను శైలజ', ‘ధృవ', ‘శతమానంభవతి', ‘స్పైడర్', ‘ఉన్నది ఒకటే జిందగీ', ‘వినయ విధేయ రామ', ‘చిత్రలహరి' సహా ఎన్నో చిత్రాల్లో నటించింది. ఇప్పుడు ‘ఆచార్య'లోనూ చేస్తోంది.

  హౌస్‌లోకి ఎంట్రీ... అలాంటి తీరుతో హైలైట్

  హౌస్‌లోకి ఎంట్రీ... అలాంటి తీరుతో హైలైట్

  కెరీర్ సాఫీగా సాగిపోతోన్న సమయంలో బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది హిమజ. మూడో సీజన్‌కు కంటెస్టెంట్‌గా వచ్చిన ఆమె... తనదైన మార్కు చూపించి పాపులారిటీని సొంతం చేసుకుంది. నిజాయితీగా ఆడుతూ.. ఉన్నది ఉన్నట్లు చెబుతూ ప్రేక్షకుల నుంచి ఓట్లను రాబట్టింది. కానీ, కొన్ని గొడవల కారణంగా ఎన్నో రోజులు హౌస్‌లో ఉండలేకపోయింది.

  అక్కడ యమ యాక్టివ్.. టూర్లలో ఎంజాయ్

  హిమజ సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తనకు సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. మరోవైపు, తన స్నేహితులతో కలిసి తరచూ ఏదో ఒక ట్రిప్ వేస్తోందీ బ్యూటీ. ఈ నేపథ్యంలోనే ఇటీవల తోటి నటీమణులతో కలిసి ఉత్తరాదికి వెళ్లింది. వీటికి సంబంధించిన ఫొటోలు, వీడియాలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

  పెళ్లి కూతురి గెటప్‌లో బిగ్ బాస్ కంటెస్టెంట్


  బిగ్ బాస్ షో తర్వాత హిమజ కెరీర్ ఊపందుకుంది. ఈ క్రమంలోనే ఆమె వరుసగా ఆఫర్లు అందుకుంటోంది. ఈ నేపథ్యంలోనే ఈ తెలుగమ్మాయి తాజాగా సోషల్ మీడియాలో ఓ ఫొటోను షేర్ చేసింది. అందులో ఆమె పెళ్లి కూతురి గెటప్‌లో కనిపిస్తోంది. ఈ ఫొటోను చూసిన వారందరూ షాక్‌కు గురవుతున్నారు. ఆ తర్వాత అసలు విషయం తెలిసి నోరెళ్లబెడుతున్నారు.

  Teja Launches Vikram Movie First Look
  హిమజ గెటప్ వెనుక ఉన్న కథ ఏమిటంటే

  హిమజ గెటప్ వెనుక ఉన్న కథ ఏమిటంటే

  ప్రస్తుతం హిమజ హీరోయిన్‌గా ‘జ' అనే సినిమాను చేస్తోంది. ప్రతాప్ రాజ్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాను సైదిరెడ్డి చిట్టెపు తెరకెక్కిస్తున్నాడు. జై దుర్గా ఆర్ట్స్ ప‌తాకంపై గోవ‌ర్థన్ రెడ్డి కందుకూరి నిర్మిస్తోన్న ఈ చిత్రం హర్రర్ థ్రిల్లర్ జోనర్‌లో రాబోతుంది. ఇప్పటికే ఈ చిత్రం ఫస్ట్ లుక్ రిలీజ్ అవగా, తాజాగా ఇందులోని పాట విడుదలైంది. హిమజ పెళ్లి కూతురి గెటప్ ఆ పాటలోనిదే.

  English summary
  Himaja is an Indian film actor who works primarily in Telugu cinema. She is noted actress by acting in movies like Nenu Sailaja, Unnadi Okate Jindagi, Mahanubhavudu, Shatamanam Bhavathi, Next Nuvve, Vinaya Videya Rama, Dhruva and Chitra Lahari.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X