జాన్వీ కపూర్ పై ట్రోలింగ్.. స్పందించిన శ్రీదేవి తనయ.. ఏమైందంటే?
యంగ్ అండ్ బ్యూటీఫుల్ హీరోయిన్ జాన్వీ కపూర్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గ్లోబల్ స్టార్, జూనియర్ ఎన్టీఆర్ సరసన భారీ బడ్జెట్ ఫిల్మ్ దేవర : పార్ట్ 1తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జాన్వీ కపూర్ అటు బాలీవుడ్ ఇటు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బ్యాక్ టు బ్యాక్ ఫిల్స్మ్ తో అలరిస్తూ వస్తోంది. అయితే తాజాగా జాన్వీ కపూర్ పరమ్ సుందరి అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా తన పాత్ర ద్వారా జాన్వీ పూర్ ట్రోల్స్ కు గురైంది. దానిపై తాజాగా స్పందించింది. ఆ వివరాల్లోకి వెళితే..
బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో రూపుదిద్దుకున్న రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ పరమ్ సుందరి ప్రస్తుతం రిలీజ్ కు సిద్ధంగా ఉంది. బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ ఛావా సినిమాను రూపొందించిన మ్యాడాక్ ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. తుషర్ జలోట దర్శకత్వం వహించారు. ఈ రొమాంటిక్ ఫిల్మ్స్ లో బాలీవుడ్ స్టార్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా, జాన్వీ కపూర్ జంటగా నటించారు. దినేష్ విజన్ నిర్మాతగా వ్యవహరించారు. కాగా ఈ చిత్రం జూలై 25నే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రం ఆగస్టు 29కి వాయిదా పడింది. ఇక ఈ చిత్రం 5 రోజుల్లో గ్రాండ్ గా విడుదల కాబోతోంది.

అయితే, ప్రస్తుతం పరదా మూవీ టీమ్ జోరుగా ప్రమోషన్స్ ను నిర్వహిస్తోంది. ఈ క్రమంలో సిదార్థ్ మల్హోత్రా, జాన్వీ కపూర్ కూడా ప్రచార కార్యక్రమాల్లో యాక్టివ్ గా కనిపిస్తున్నారు. కాగా పరమ్ సుందరి చిత్రంలో తను నటించిన పాత్రపై కాస్తా ట్రోల్స్ వచ్చాయి. ఆమె నటించిన పరమ్ సుందరి చిత్రంలో తన భాష, స్టైల్ పై ట్రోల్ జరిగింది. ఆమె కట్టుబొట్టు మలయాళీలాగా లేదని, ఆమె మాండలికం కూడా వేరేలా ఉందని, కానీ మలయాళీ అమ్మాయి పాత్రను పోషించారని చెప్పడంతో కాస్తా ట్రోల్ కు గురైంది. దీంతో తాజాగా ప్రచార కార్యక్రమంలో ఇలా స్పందించింది.
నేను నటించిన పాత్ర సగం మలయాళీ, సగం తమిళియన్ గా ఉంటుందని చెప్పుకొచ్చింది. ఇక తన తల్లి కేరళకు చెందిందని గుర్తు చేసింది. దీంతో ఆమెకు మలయాళం, తమిళ సంప్రదాయాలు తెలుసని చెప్పుకొచ్చింది. ఇటీవల జాన్వీ కపూర్ లుక్ పై మలయాళీ సింగర్ పవిత్రా మీనన్ విమర్శలు చేసింది. మలయాళీ పాత్రను, భాషను సరిగా చూపించడం లేదంటూ ఆమె ఆరోపణలు చేసింది. ఇన్ స్టా గ్రామ్ లో ఒక వీడియోను పంచుకుంది. కానీ తర్వాత డిటేట్ చేసింది.
ఇక జాన్వీ కపూర్ తెలుగులో భారీ చిత్రాల్లో అవకాశాలను అందుకుంటోంది. ఇప్పటికే దేవర చిత్రంలో నటించగా.. నెక్ట్స్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సరసన పెద్ది చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రానికి బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తుండటం విశేషం. 2026 మార్చిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక దేవర 2, అల్లు అర్జున్ - అట్లీ చిత్రంలోనూ నటిస్తుండటం విశేషం. రాబోయే రోజుల్లో జాన్వీ కపూర్ ఇండియాలో సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమని అంటున్నారు.


Click it and Unblock the Notifications











