ఒక్కసారి వెళ్లి చెడిపోయినా.. వందసార్లు వెళ్లి చెడిపోయినా తేడా లేదు.. వాళ్ల కోసమే అలా చేశా..
Actress Jayalalitha: కొంతమంది నటీమణులు హీరోయిన్స్‌గా తమ కెరీర్ ను ప్రారంభించినా.. సక్సెస్ కాలేక క్యారెక్టర్ ఆర్టిస్టులుగా సెటిల్ అవుతారు. అలాంటి వారిలో సీనియర్ నటి జయలలిత (Actress Jayalalitha)కూడా ఒకరు. తొలుత హీరోయిన్‌గా నటించినా.. తర్వాత ఆఫర్ రాకపోవడంతో బోల్డ్ క్యారెక్టర్లు చేయాల్సి వచ్చింది. దాని వల్ల తను పర్సనల్ లైఫ్‌లో కూడా కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చిందని ఓపెన్‌గా చెప్పేశారు జయలలిత. అంతే కాకుండా ఇండస్ట్రీ క్యాస్టింగ్ కౌచ్ గురించి, తన కెరీర్ లో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి కూడా వెల్లడించారు. అవకాశాల కోసం క్యాస్టింగ్ కౌచ్ ఎదురవుతున్న ఏ రోజుకు ప్రశ్నించకుండా కెరీర్ లో సాగానని వెల్లడించారు.
తెలుగు సినీ పరిశ్రమలో ఎంతో కాలంగా తన ప్రత్యేకమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సీనియర్ నటి జయలలిత. ఇటీవల ఓ ఇంటర్య్వూలో తన కెరీర్ గురించి మనసు విప్పి మాట్లాడారు. జీవితంలో ఎదుర్కొన్న అవమానాలు, చేదు అనుభవాలు, మరియు సినిమా రంగంలో ఆడవారి దయనీయ పరిస్థితులను వివరించారు. ఆమె చెప్పిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తన జీవితంలోని అనుభవాలను ఓపెన్‌గా చెప్పిన జయలలిత వ్యాఖ్యలు చాలామందిని షాక్‌కి గురి చేస్తున్నాయి.

జయలలిత ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ "నేను హీరోయిన్‌గా నా కెరీర్‌ను ప్రారంభించాను. కొన్ని సినిమాలు చేశాను కానీ నేను అనుకున్నంత సక్సెస్ రాలేదు. తర్వాత ఎక్కువగా బోల్డ్ క్యారెక్టర్లే వచ్చాయి. దాంతో ప్రేక్షకులు నన్ను అదే రకం పాత్రల్లో చూసి అలా ఫిక్స్ చేసుకున్నారు. నేను చేసే పాత్రలు బోల్డ్‌గా ఉన్నాయే గానీ, అంతర్గతంగా నేను కూడా ఒక స్త్రీనే. నాకు భావాలు, నాకు గౌరవం ఉంది. కానీ ఆ కాలంలో పరిస్థితులు అలా ఉండేవి. అవకాశాల కోసం ఎంత కష్టపడినా, కొందరు వ్యక్తులు అమ్మాయిలను వాడుకునే ప్రయత్నం చేసేవారు" అంటూ చెప్పుకొచ్చారు.
జయలలిత తన కెరీర్‌లో ఎదుర్కొన్న క్యాస్టింగ్ కౌచ్ అనుభవాల గురించి కూడా మాట్లాడారు. "సినిమా ఇండస్ట్రీ మొత్తం మగవారి ఆధిపత్యంలోనే నడుస్తుంది. ఆడవాళ్లు తమ స్థానాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టం. నేను కూడా ఎన్నో చేదు అనుభవాలను ఎదుర్కొన్నాను. కొన్ని సార్లు పేరున్న పెద్ద నటులు కూడా రాత్రి వేళల్లో ఇంటికి వచ్చి తలుపులు కొట్టేవారు. అలాగే ఒక్కసారి ఒక పెద్ద ఆర్టిస్ట్ అయితే.. 'తలుపు తెరిస్తావా? లేక ఇక్కడే ఉరివేసుకుని చనిపోతావా?' అంటూ బెదిరించాడు. ఆ పరిస్థితుల్లో ఏమి చేయలేకపోయాను. ఆ సమయంలో భయంతో కన్నా ఇలా ఎలా తప్పించుకోవాలో ఆలోచించేదాన్ని" అంటూ ఆమె గుర్తుచేసుకున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో మిమ్మల్నీ మీరు ఎలా రక్షించుకున్నారు? అని యాంకర్ ప్రశ్నించగా.. జయలలిత చెప్పిన సమాధానం చాలా హృదయ విదారకం. "ఈ ప్రపంచంలో నన్ను నేను కాపాడుకోలేనని అంగీకరిస్తున్నాను. పరిస్థితులు అలా ఉన్నాయి. అందుకే నేను అందరితో ఫ్రెండ్లీగా ఉండేదాన్ని. కొన్ని సందర్భాల్లో తప్పించుకోగలిగాను. కానీ అన్ని సందర్భాలు మనం అనుకున్నట్టుగా ఉండవు కదా. కొన్నిసార్లు తప్పించుకోలేకపోయాను. అలాంటి సమయంలో తప్పక తప్పు చేయాల్సి వచ్చింది. ఇది సిగ్గు కాదు, అది వాస్తవం" అంటూ కన్నీరు పెట్టుకున్నారు.
ఇండస్ట్రీలో కొన్ని అవకాశాలు కోల్పోయిన సంఘటనల గురించి కూడా ఆమె ప్రస్తావించారు. "ఒక దర్శకుడు తన ప్రపోజల్ రిజెక్ట్ చేశానని నన్ను సినిమా నుండి తీసేశాడు. ఆ సమయంలో బాధగా అనిపించింది కానీ నేను సైలెంట్‌గా ఉండిపోయాను. ఎందుకంటే పోరాడితే మరిన్ని తలుపులు మూసుకుపోతాయని తెలుసు. అలా ఎన్నో సందర్భాలు ఎదుర్కొన్నాను" అంటూ ఆమె చెప్పారు.
జయలలిత చెప్పిన మరో అంశం చాలా మందికి గుండె పిండేసేలా ఉంది. "అవుట్ డోర్ షూటింగ్ వెళ్లినప్పడు కొంతమంది నటులు అర్ధరాత్రి వచ్చి.. నా గది తలుపులు కొట్టి బెదిరించేవారు. కానీ నేను తలుపులు మాత్రం తెరిసేదాన్ని. మరుసటి రోజు ఆ విషయాన్ని ప్రస్తావిస్తే .. 'నిన్న ఫోన్ చూసుకోలేదు, నిద్రలో ఉన్నాను, శబ్దం వినిపించలేదు' అని సర్దేసేదాన్ని. ఇలా మేనేజ్ చేసుకునే ప్రయత్నం చేసేదాన్ని. అయితే, ప్రతి సందర్భం మన చేతుల్లో ఉండదు. కొన్నిసార్లు తప్పించుకోలేకపోయాను" అంటూ వేదనను వ్యక్తం చేసింది.
వారు మీ బంధం కోరుకున్నారా అని యాంకర్ ప్రశ్నించగా.. నటి జయలలిత స్పందిస్తూ "బంధం లేదు. ప్రేమ లేదు. వ్యామోహం లేదు. ఆ సమయంలో నేను బాగుండేదాని. వయసులో ఉన్నాను. మంచి పర్సనాలిటీ. ర్యాంప్ క్యారెక్టర్లు చేసేదాన్ని. పర్సనల్ గా కూడా అదే క్యారెక్టర్ అయి ఉండొచ్చని చాలామంది అపోహ పడ్డారు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. కొన్ని సందర్భాలలో తప్పించుకోగలిగాను. అన్ని సందర్భాలు మనం అనుకున్నట్లు ఉండలేవు కదా కొన్నిసార్లు అంతే. తప్పించుకోలేకపోయాను. అలాంటి పరిస్థితులలో తప్పలేదు. వారి అవసరమని నేను వెళ్లాను అంతే. ఆ సమయంలో పరిస్థితులు అలా ఉన్నాయి. అందమైన ఆడవారు ఇండస్ట్రీలో ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొవడం చాలా సర్వసాధారణం. దురదృష్టవశాత్తు ప్రతి హీరోయిన్ కూడా ఈ దశను ఒకప్పుడు ఎదుర్కోవాల్సిందే"అని అన్నారు.
ఇండస్ట్రీలో మహిళల జీవితాలు దారుణమని చెప్పిన జయలలిత "నాకు ఒక్క ఆలోచనే ఉండేది. నేను చెడిపోతే చెడిపోయాను, నా వాళ్లు మాత్రం బాగుండాలి. ఒకసారి పోయిన.. వందసార్లు పోయినా పోయింది పోయిందే. అలాంటి సమయంలో ఇలాంటి ఫీలింగ్స్ ఉండవు. ఆ సమయంలో ప్రాక్టికల్ గా నన్ను నేను ఓదార్చుకున్నాను. నా లక్ష్యం ఒకటే.. ఎలాగూ ఇండస్ట్రీ లోకి వచ్చాను. నేను చెడిపోతే చెడిపోయాను. నా వాళ్లు బాగుండాలి. ఆ ఉద్దేశంతోనే సినీ రంగంలో అడుగుపెట్టాను. ఇప్పుడు కూడా నేను నటిస్తూనే ఉన్నాను. 40 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో అవమానాలు, చేదు అనుభవాలు ఎదుర్కొన్నా కానీ, ఎప్పుడూ చనిపోవాలనే ఆలోచన రాలేదు. ధైర్యంగా ముందుకు వెళ్లాను" అంటూ ఆమె అన్నారు.
ప్రస్తుతం జయలలిత చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. "ఇండస్ట్రీలో ఆడవారి పరిస్థితి ఇంత దారుణంగా ఉందా?" అంటూ నెటిజన్లు స్పందిస్తున్నారు. కొందరు ఆమె ధైర్యాన్ని ప్రశంసిస్తుండగా, మరికొందరు ఈ విషయాన్ని వాస్తవం అని అంగీకరిస్తున్నారు. జయలలిత చెప్పిన ఈ నిజాలు మరోసారి సినీ రంగంలో ఆడవారికి ఎదురవుతున్న అసమానతలు వెలుగులోకి వచ్చాయి.


Click it and Unblock the Notifications











