‘బంధువులే ఓర్వలేక చేతబడి చేయించి.. భర్తతో విడాకులు, నా జీవితం ఇలా’

ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా వెండితెరను ఏలినవారు ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయారు. వాళ్లని ఇప్పుడు చూస్తే ఇలా అయిపోయారేంటీ అనిపిస్తుంది. ఆస్తుల్ని, సంపదని పోగొట్టుకుని జీవితంలో ఒంటరిగా మిగిలిపోయిన నటీనటులు ఎందరో. ఈ కోవలోకే వస్తారు సీనియర్ నటి మోహిని. ఒకప్పుడు తన అందం, నటనతో దక్షిణాదిలో టాప్ హీరోయిన్‌గా వెలుగొందిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు తెరకు దూరమయ్యారు. తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు.

బాలనటిగా ఎంట్రీ
మోహని అసలు పేరు మహాలక్ష్మీ శ్రీనివాసన్. తమిళనాడులోని తంజావూరుకు చెందిన మోహిని.. తొలుత బాలనటిగా తమిళ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటించిన ఆదిత్య 369 ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించారు హేమ. ఆ తర్వాత టాప్ హీరోయిన్‌గా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 100కు పైగా చిత్రాల్లో నటించారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన హిట్లర్‌లో ఆయనకు చెల్లెలిగా చివరిసారిగా తెలుగువారిని పలకరించారు మోహిని.

Actress Mohini revealed how she was affected by Black Magic

క్రైస్తవంలోకి మారిన మోహిని
కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే భరత్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్న మోహిని అనంతరం భర్తతో కలిసి అమెరికాలో స్థిరపడ్డారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. అయితే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడంతో మోహిని - భరత్‌లు విడాకులు తీసుకున్నారు. అనంతరం హిందూ మతం నుంచి క్రైస్తవ మతం స్వీకరించిన మోహిని.. మత ప్రచారకురాలిగా పూర్తి ఆధ్యాత్మిక జీవితం గడుపుతున్నారు. అమెరికా నుంచి తిరిగొచ్చిన తర్వాత ఒకటి రెండు సినిమాలలో మోహిని నటించారు. 2011లో మలయాళంలో సురేష్ గోపీ హీరోగా వచ్చిన కలెక్టర్ అనే సినిమాలో చివరిసారిగా కనిపించారు.

స్విమ్ సూట్‌లో బలవంతంగా
తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్, వ్యక్తిగత జీవితంపై కీలక వ్యాఖ్యలు చేశారు మోహిని. తమిళంలో కన్మణి అనే సినిమాలో తాను, ప్రశాంత్ జంటగా నటించామని ఓ పాట చిత్రీకరణలో భాగంగా దర్శకుడు ఆర్కే సెల్వమణి దానిని ఓ స్విమ్మింగ్ పూల్‌లో ప్లాన్ చేశారు. నేను స్విమ్ సూట్ ధరించాలని కూడా చెప్పారు. అయితే నాకు ఈత రాదు, పైగా అందరి ముందు స్విమ్ సూట్ ధరించడం ఇబ్బందిగా అనిపించింది. దాంతో నా వల్ల కాదని డైరెక్టర్‌గా చెప్పగా.. సెల్వమణి ససేమిరా అని బలవంతంగా సాంగ్ చేయించడంతో ఏడ్చేశానని మోహిని తెలిపింది.

నాపై చేతబడి చేశారు
కెరీర్‌లో కొన్ని సినిమాల విషయంలో నాకు నిరాశ ఎదురైందని.. ముత్తు సినిమాలో తొలుత నన్నే హీరోయిన్‌గా అనుకున్నారని, అయితే మీనా కూడా రేసులోకి రావడంతో డైరెక్టర్‌కు ఏం చేయాలో తెలియలేదని పేర్కొంది. కొందరు వెళ్లి ఈ చిత్ర దర్శకుడిని కలవమన్నారని.. దానికి నేను అంగీకరించలేదని మోహని తెలిపారు. అలాగే సూర్య సన్నాఫ్ కృష్ణన్‌లో సిమ్రన్ పాత్ర కూడా తానే చేయాల్సిందని, అనుకోకుండా అది చేజారిపోయినట్లు ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు నా ఎదుగుదల చూసి తట్టుకోలేక నేను నాశనమైపోవాలని చేతబడి చేయించారని మోహిని తెలిపారు. నా భర్త కజినే ఇలా చేయించారని తర్వాత తెలిసిందని.. వీటి నుంచి ఆ దేవుడే నన్ను కాపాడాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం మోహిని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Read more about: mohini movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X