For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పెళ్లి పేరుతో అలాంటి మోసం.. బిజినెస్‌మెన్‌తో మ్యారేజ్‌కు ముందు పూర్ణ షాకింగ్‌గా!

  |

  దక్షిణాదిలో యాక్టింగ్, డ్యాన్స్ ప్రతిభతో సత్తా చాటుకొంటున్న హీరోయిన్ పూర్ణ అలియాస్ షామ్నా ఖాసీం పెళ్లికి సంబంధించిన కొన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఎంగేజ్‌మెంట్‌తో నిఖా లాంటి వేడుకలు సంప్రదాయబద్దంగా ముగిసాయి. అయితే తన పెళ్లి గురించి వస్తున్న వివాదాస్పద కథనాలపై పూర్ణ స్పందించింది. పెళ్లిచూపులు, పెళ్లికి సంబంధించిన మధ్యవర్తిత్వం, ఆన్‌లైన్ అలియెన్స్ పేరుతో తనను మోసగించే ప్రయత్నాలు చేశారనే విషయాన్ని పూర్ణ వెల్లడిస్తూ..

  గతంలో మ్యారేజ్ కన్సల్టెంట్‌తో

  గతంలో మ్యారేజ్ కన్సల్టెంట్‌తో


  నాకు గతంలో చాలా పెళ్లి ప్రపోజల్స్ వచ్చాయి. అందులో కొన్ని మా ఇంట్లో వారికి నచ్చాయి. వాటి గురించి ఒక మ్యారేజ్ కన్సల్టెన్సీ గ్రూపుతో మాట్లాడగా.. భారీగా డబ్బు డిమాండ్ చేశారు. పెళ్లికి సంబంధించిన వ్యవహారాల్లో డబ్బు లాగే ఒక ముఠా మమల్ని మోసానికి గురిచేసేందుకు ప్లాన్ చేసింది. దాంతో మేము వారిపై పోలీసులకు కంప్లయింట్ చేశాం అని పూర్ణ చెప్పింది.

   నా పెళ్లి గురించి కథనాలు..

  నా పెళ్లి గురించి కథనాలు..


  అయితే తన మ్యారేజ్ అలయెన్స్‌కు సంబంధించిన వివాదం అప్పుడే ముగిసిపోయింది. కానీ మీడియాలో పూర్ణ పెళ్లి విషయంలో ఇలా జరిగింది? పూర్ణ పెళ్లికి సంబంధించి గొడవలు ఇలా జరిగాయి అంటూ మీడియాలో కథనాలు రాస్తుండటం కొంత మనస్తాపానికి గురిచేసింది. ఇలాంటి కథనాలు కేవలం మలయాళం మీడియాకు పరిమితం కాలేదు. ఇతర భాషల మీడియాలో కూడా ఈ అంశం గోరంతలు కొండతలు చేసి రాశారు అని పూర్ణ అన్నారు.

   చాలా మంది అమ్మాయిలు ఫోన్ చేసి

  చాలా మంది అమ్మాయిలు ఫోన్ చేసి


  పెళ్లి పేరుతో ఓ మ్యారేజ్ కన్సల్టెన్సీ మోసం చేయడానికి ప్రయత్నించడంపై నేను ఫిర్యాదు చేయడం వల్ల చాలా మందికి మేలు జరిగింది. చాలా మంది అమ్మాయిల ఫ్యామిలీలు మోసాలకు గురికాకుండా ఉన్నారు. నా ఫిర్యాదు తర్వాత చాలా మంది అమ్మాయిలు నాకు కాల్ చేసి బాధపడ్డారు. ఆ తర్వాత ఇలాంటి మోసాలు తగ్గిపోయాయని చెప్పడం నాకు చాలా హ్యాపీగా ఉంది అని అన్నారు.

   దుబాయ్‌ బిజినెస్‌మ్యాన్‌తో పెళ్లి

  దుబాయ్‌ బిజినెస్‌మ్యాన్‌తో పెళ్లి


  ఇక హీరోయిన్ పూర్ణ తన భర్త గురించి వెల్లడిస్తూ.. ఆయన పేరు షానిద్ ఆసీఫ్ ఆలీ. చాల సంవత్సరాల నుంచి పరిచయం ఉంది. ఆ పరిచయం ప్రేమగా మారింది. కెరీర్ పరంగా బిజీగా ఉండటం వల్ల మేమిద్దరం నిర్ణయం తీసుకోలేకపోయాం. నా భర్త షానిద్ ఆసీఫ్ ఆలీ దుబాయ్‌లో స్థిరపడ్డారు. జేబీఎస్ గ్రూప్ కంపెనీలో సీఈవోగా పనిచేస్తున్నారు. మా కుటుంబంలోని అందరికి షానిద్ నచ్చడంతో మా పెళ్లికి మార్గం సుగమమైంది అని తెలిపారు.

  పూర్ణ కెరీర్ ఇలా..

  పూర్ణ కెరీర్ ఇలా..


  ఇక పూర్ణ కెరీర్ విషయానికి వస్తే.. ఇటీవల అఖండలో ఓ కీలక పాత్రను పోషించింది. ప్రస్తుతం నాని, కీర్తీ సురేష్ నటిస్తున్న దసరా సినిమాలో ఓ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. అలాగే మిస్కిన్ దర్శకత్వంలో రూపొందే.. అస్లమ్ సినిమాలో నటిస్తున్నారు. తమిళంలో డెవిల్ అనే సినిమా, అలాగే మలయాళంలో తమిళ రీమేక్ చిత్రం ఇష్క్‌లో నటిస్తు్నారు. పెళ్లి కోసం రెండు నెలలు బ్రేక్ తీసుకొన్నాను. ఆ తర్వాత కొత్త ప్రాజెక్టులపై దృష్టిపెడుతాను అని పూర్ణ చెప్పారు.

  English summary
  Actress Poorna reveals Marriage consultancy fraud before Weddding with Shanid Asif Ali. She said, On group has demanded the huge money.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X