Don't Miss!
- News
అమెరికా-చైనా మధ్య యుద్ధం?
- Sports
అందుకే ఉమ్రాన్‌ను పక్కనపెట్టి చాహల్‌ను తీసుకున్నాం: హార్దిక్ పాండ్యా
- Lifestyle
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
Rashi Khanna: ఎద అందాలతో పిచ్చెక్కిస్తున్న రాశి.. ఇంతకంటే హీటెక్కించే పోజ్ ఉంటుందా?
చూడగానే అందమైన చిరునవ్వుతో ఎంతగానో ఆకర్షించే రాశి ఖన్నా తెలుగు తమిళ్ అని తేడా లేకుండా దాదాపు అన్ని సౌత్ ఇండస్ట్రీలో కూడా మంచి సినిమాలు చేసింది. ఎక్కడ ఏ సినిమా చేసినా కూడా ఆమె స్థానికంగా తనకంటూ ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంటుంది. ఇక అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఈ బ్యూటీ పోస్ట్ చేసే గ్లామరస్ ఫోటోలు కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి. రీసెంట్ గా రాశి ఖన్నా గతంలో ఎప్పుడో లేనంత ఘాటుగా దర్శనమిచ్చింది. ఆ ఫోటోల వివరాల్లోకి వెళితే..

తొందరపడకుండా..
ఢిల్లీలో పుట్టి పెరిగిన రాశి కన్నా చిన్నతనం నుంచే నటనపై ఎంతో ఆసక్తిని పెంచుకుంది. ఇక మోడల్ గా గుర్తింపు అందుకున్న తర్వాత నార్త్ ఇండస్ట్రీలో సినిమా అవకాశాలు రావడం ప్రారంభమయ్యాయి. అయితే మొదట్లో ఆమె తొందర పడకుండా మంచి కంటెంట్ ఉన్న సినిమాలను సెలెక్ట్ చేసుకోవాలని అనుకుంది. ఇక హిందీలో మొదట మద్రాస్ కేవ్ అనే సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైంది. ఆ సినిమాలో నటనకు మంచి గుర్తింపు రావడంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఆఫర్స్ వచ్చాయి.

ఆ సినిమా సక్సెస్ కావడంతో
రాశి ఖన్నా తెలుగులో మొదటగా మనం సినిమాలో ఒక చిన్న పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. ఇక తర్వాత ఊహలు గుసగుసలాడే సినిమాతో మెయిన్ హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. ఆ సినిమా సక్సెస్ కావడంతో వెంట వెంటనే అనకు మరిన్ని ఆఫర్స్ వచ్చాయి.
ఆ తర్వాత జోరు, జిల్ అనే సినిమాలు కూడా కమర్షియల్ గా బాగానే ఆడాయి. ఇక తర్వాత రాశి వెనక్కి తిరిగి చూడకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్ గా మారిపోయింది.

ఎన్నో ఆశలు పెట్టుకున్నా
అయితే మధ్య మధ్యలో రాశి కొన్ని డిజాస్టర్స్ కూడా చూసింది. ఎన్నో ఆశలు పెట్టుకున్నా కొన్ని పెద్ద సినిమాలు ఆమె కోరుకున్నంత స్థాయిలో గుర్తింపు తీసుకురాలేకపోయాయి. ఆ మధ్యలో జూనియర్ ఎన్టీఆర్ తో జై లవకుశ అనే సినిమా చేసింది. కానీ ఆ సినిమా అగ్ర హీరోలతో అవకాశాలు అయితే ఇచ్చేంత హిట్ అవ్వలేదు. ఇక తర్వాత ఏడాదికు రెండు మూడు మిడియం రేంజ్ సినిమాలు చేసుకుంటూ ఈ బ్యూటీ ఆదాయాన్ని పెంచుకుంది.

ఏడాదికి నాలుగు
అయితే రాశి ఖన్నాకు సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా ఏడాదికి మూడు నాలుగు సినిమాల్లో అయితే చేస్తోంది. ఇక ఈ ఏడాది ఆమె మొత్తం నాలుగు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదట గోపీచంద్ తో పక్క కమర్షియల్ అనే సినిమా చేసింది. ఆ తర్వాత థాంక్యూ అనే సినిమాతో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ ఆ రెండు సినిమాలో నిరాశపరచగా తమిళంలో వచ్చిన తిరు, సర్దార్ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి.

స్టన్ అయ్యేలా..
అయితే సోషల్ మీడియాలో రాశి ఖన్నా పోస్ట్ చేసే ఫోటోలు మామూలుగా ఉండడం లేదు. రీసెంట్ గా ఆమె ఎద అందాలతో స్టన్ అయ్యేలా చేసింది. గతంలో కూడా ఆమె గ్లామరస్ స్టిల్స్ తో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కానీ ఈ రేంజ్ లో అయితే షాక్ ఇవ్వలేదు అని ఫాలోవర్స్ కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా కూడా రాశి ఖన్నా గ్లామర్ డోస్ పెంచితే మాత్రం ఆ ఫోటోలు ఊహించిన విధంగా వైరల్ అవుతాయని మరోసారి రుజువు చేసింది. ఇక ప్రస్తుతం అయితే ఈ బ్యూటీ కి తెలుగులో పెద్దగా అవకాశాలు అయితే లేవు. యోధ అనే ఒక హిందీ సినిమాలో మాత్రమే నటిస్తోంది.