‘దుబాయ్‌‌లో బంగ్లా రాసిస్తానంటూ బలవంతం.. ఆ బిజినెస్‌మెన్స్‌కి మా మీదే కన్ను’

సినీ పరిశ్రమలో వెలిగిపోవాలని ఎన్నో ఆశలతో వచ్చే యువతులను ఆఫర్ల పేరుతో ట్రాప్ చేసే క్యాస్టింగ్ కౌచ్ దందాకు ఎందరో అమ్మాయిలు బలయ్యారు. సినిమాల్లోకి రాకముందే కాదు.. వచ్చాక స్టార్ హీరోయిన్ అయిన తర్వాత కూడా క్యాస్టింగ్ కౌచ్‌ కారణంగా నలిగిపోతున్నారు. కమిట్‌మెంట్ ఇస్తేనే అవకాశాలు ఇస్తారని ఎందరో తారలు బహిరంగంగా చెప్పుకొచ్చారు. ఇక మీటూ ఉద్యమం, మలయాళ చిత్ర పరిశ్రమలో వెలుగు చూసిన జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్.. సినీ పరిశ్రమలో కంటికి కనిపించని దారుణాలను, పైకి పెద్ద మనుషుల్లా కనిపించే వారి బాగోతాలను బయటపెట్టాయి.

క్యాస్టింగ్ కౌచ్ గురించి టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఎందరో హీరోయిన్లు, మహిళా నటులు నిత్యం ఏదో ఒక ఇంటర్వ్యూలో చెబుతూనే ఉన్నారు. తమ కెరీర్‌లో తాము ఇలా వేధింపులకు గురయ్యామని, ఇలా తప్పించుకున్నామని, అవకాశాలు చేజారిపోయాయని చెప్పుకొస్తూనే ఉన్నారు. తాజాగా తెలుగు నటి రేఖా భోజ్.. మరోసారి క్యాస్టింగ్ కౌచ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ వివరాల్లోకి వెళితే..

Actress Rekha Boj Make sensational comments on Casting Couch in Film Industry

టీమిండియా కోసం విప్పేస్తానని
ఏపీలోని విశాఖపట్నానికి చెందిన రేఖా భోజ్ అసలు పేరు శ్రీసుష్మ. బోల్డ్ కామెంట్స్‌కు, వివాదాలకు కేరాఫ్‌గా నిలుస్తోంది. మాంగళ్యం, దామినీ విల్లా, కలాయ తస్మై నమ, కాత్సాయని, స్వాతి చినుకు, రంగీలా తదితర సినిమాలలో నటించింది రేఖా భోజ్. టాలెంట్, అందం ఉన్నప్పటికీ తెలుగు అమ్మాయిలకు తెలుగు చిత్ర పరిశ్రమలో అవకాశాలు రావడం లేదని రేఖ పలుమార్లు బహిరంగంగానే వ్యాఖ్యానించారు. మా ఎన్నికల సమయంలో తనకు కూడా సభ్యత్వం ఇస్తే ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుంటానని హల్‌చల్ చేసింది. అయితే ప్రపంచకప్ సమయంలో టీమిండియా వరల్డ్ కప్ గెలిస్తే.. విశాఖ బీచ్‌లో బట్టలిప్పుతానని పోస్ట్ పెట్టడంతో ఒక్కసారిగా నేషనల్ వైడ్ పాపులారిటీ సంపాదించింది రేఖ.

కమిట్‌మెంట్ అడుగుతూ కాల్స్
సినిమాలలో అవకాశాల కోసమే తన పేరును శ్రీసుష్మ నుంచి రేఖ భోజ్‌గా మార్చుకున్నానని పలుమార్లు తెలిపింది కూడా. ఎంత హడావుడి చేసినా టాలీవుడ్ నుంచి పిలుపు రాకపోవడంతో విశాఖపట్నంలో సొంతంగా స్టూడియో పెట్టుకుని కవర్స్ సాంగ్స్ చేస్తూ యూట్యూబర్‌గా స్థిరపడింది. తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్యాస్టింగ్ కౌచ్, చిత్ర పరిశ్రమలోని పరిస్ధితులపై సంచలన వ్యాఖ్యలు చేసింది. నా కెరీర్‌లో నేనెప్పుడూ హైదరాబాద్‌లో అడుగుపెట్టలేదు, అంతా వైజాగ్‌లో ఉండే చేసుకుంటున్నా. చాలా కాల్స్ అయితే వచ్చాయి అవి నిజమా? అబద్ధమా? అనేది నాకు తెలియదు. ఒక అవకాశం ఉంది మీరు చేస్తారా? అని అడుగుతారు.. వెంటనే ఇలా ఉంటుంది, అలా ఉంటుంది మీకు ఓకేనా అని అంటారు అని రేఖ తెలిపారు.

నా ప్యాషన్‌ని వాడుకోవాలని
ఫస్ట్ ప్రాబ్లమ్ ఎక్కడ వచ్చిందంటే.. మనకి ఫోర్ట్‌ఫోలియో పంపిస్తారు, అందులో కమిట్‌మెంట్స్‌కి ఓకేనా? లేదా? అని ఉంటుంది. ఒకట్రెండు సార్లు నేను సేమ్ అదే పంపించి... ఇదే గానీ పట్టుకెళ్లి కంప్లయంట్ ఇస్తే నీ బతుకు ఎక్కడుంటుందో చూస్కో అని చెప్పిన రోజులు కూడా ఉన్నాయి. నా బ్యాక్‌గ్రౌండ్ చూడటం లేదు, నా ప్యాషన్‌ని యూజ్ చేసుకోవాలి, క్యాష్ చేసుకోవాలని చాలామంది ఉన్నారు. ఇక్కడ నేను ఏ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చానన్నది ఎవరికీ ఇంపార్టెంట్ కాదు, ఈవిడకి సినిమా అంటే ప్యాషన్ ఎలా క్యాష్ చేసుకోవాలని చూస్తారని రేఖ వెల్లడించారు.

బిజినెస్‌మెన్స్ నుంచి ఆఫర్లు
ఇండస్ట్రీలోని పెద్ద పెద్ద వాళ్ల పేర్లేం చెప్పేవారు కాదు.. కొంతమందైతే బంగ్లా రాసిస్తాను, నువ్వు నాతో ఉండు అని అడుగుతారు 8 ఏళ్ల నుంచి నేను చాలా చూశా. దుబాయ్‌లో బంగ్లా ఉంటదని చాలా చెప్పేవారు.. బిగ్ నేమ్స్ అయితే ఎవ్వరూ యూజ్ చేయలేదు.. సినిమా వాళ్లే కాదు, సినీరంగానికి చెందిన వాళ్లు కూడా అడిగేవారు. నేను పలానా బిజినెస్‌మెన్‌ని అని చెప్పేవారు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కొందరు ... కొందరికీ మన నెంబర్లు ఎలా పాస్ అవుతాయో తెలియదు. పీఆర్స్, మేనేజర్స్ వీళ్లందరికీ నెంబర్లు ఇస్తాం. కమిట్‌మెంట్‌లు అడిగేవారికి ఫోన్‌లోనే పడిపోతాయి.. ఇలాంటివి చేసుంటే నేను ఎప్పుడో సంపాదించుకునే దానిని, కార్లు, బంగ్లాలు ఉండేవి. దయచేసి ఇలాంటి కాల్స్ చేయొద్దు, నా దగ్గర ఉన్నదంతా అమ్ముకుని నిలబడ్డానని చెప్పేదానిని అని రేఖ తేల్చిచెప్పారు. ప్రస్తుతం రేఖ భోజ్ వ్యాఖ్యలు చిత్ర పరిశ్రమలో కలకల రేపుతున్నాయి.

More from Filmibeat

Read more about: rekha boj casting couch
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X