For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నా భార్త ఎంత బోల్డ్‌ అంటే.. మహేష్‌బాబుతో లింకు పెట్టి షాకిచ్చాడు.. శ్రీయా సరన్

  |

  అందాల తార శ్రియా సరన్ గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి చేసుకోవడం అప్పట్లో సినీ పరిశ్రమలో చర్చనీయాంశమైంది. రష్యాకు చెందిన అండ్రీ కొశ్చీవ్‌ను 2018లో రాజస్థాన్‌లో వివాహం చేసుకొన్న సంగతి తెలిసిందే. తన పెళ్లికి అతికొద్ది మంది స్నేహితులు, సన్నిహితులను ఆహ్వానించారు. అయితే ఇప్పటి వరకు తన వైవాహిక జీవితాన్ని సీక్రెట్‌గా పెట్టిన శ్రీయ ఇప్పుడిప్పుడే అభిమానులతో పంచుకొంటున్నారు. తాజాగా తన పెళ్లి జీవితం, భర్త గురించి ఆసక్తికరమైన అంశాలను వెల్లడించారు. శ్రీయ చెప్పిన విషయాలు ఏమిటంటే..

  ఎప్పుడూ నా కష్ట:సుఖాల్లో

  ఎప్పుడూ నా కష్ట:సుఖాల్లో

  కష్ట:సుఖాల్లో నా భర్త అండ్రూ ఎప్పుడూ తోడుగా ఉంటారు. ఇలాంటి జీవిత భాగస్వామిని ఇచ్చిన భగవంతుడికి రుణపడి ఉంటాను. నాకు భర్త కంటే మంచి పార్ట్‌నర్‌గానే కనిపిస్తాడు. మంచైనా లేదా చెడైనా విషయాల్లో గొప్ప భాగస్వామిగా భావిస్తాను. ఏ జన్మలో చేసుకొన్న పుణ్యం నాకు ఇలాంటి భర్త లభించాడు అని శ్రీయా సరన్ అన్నారు.

  ఆయనతో ప్రతీ క్షణాన్ని ఆస్వాదిస్తున్నా

  ఆయనతో ప్రతీ క్షణాన్ని ఆస్వాదిస్తున్నా

  నేనంటే అండ్రూకి చాలా ఇష్టం. అంతకంటే నా నటన, నా ప్రొఫెషన్ అంటే ఇంకా ఇష్టం. నేనేదైనా విషయంలో ఒత్తిడికి గురైనా లేదా హ్యాపీగా ఉన్నా దానిలో భాగం పంచుకొంటాడు. ఇప్పటి వరకు నేను అతడితో అనుభవించిన ప్రతీ క్షణాన్ని ఆస్వాదించాను. నా జీవితంలో అంతకంటే గొప్పగా చెప్పుకోవడానికి అవకాశం లేదు అని శ్రీయ సరన్ తెలిపారు.

   మాల్దివుల్లో తొలిసారి కలిశాను

  మాల్దివుల్లో తొలిసారి కలిశాను

  అండ్రూను నేను తొలిసారి మాల్దీవుల్లో కలిశాను. నేను తొలిసారి పరిచయం అయినప్పుడు శ్రీయా ఓ యాక్టర్ అనే విషయం తెలియదు. తెలిసిన తర్వాత టెలివిజన్‌గానీ, ఇతర మాధ్యమాల్లో సినిమా వస్తే తప్పకుండా చూస్తుంటాడు. నా ప్రొఫెషన్‌ను ఇష్టపడే వ్యక్తిని ప్రేమించడంలో అంతకంటే ఏముంటుంది అని శ్రీయ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

  మహేష్‌తో షూటింగ్ చేసిన ప్రదేశంలో

  మహేష్‌తో షూటింగ్ చేసిన ప్రదేశంలో

  ఓసారి నన్ను సెయింట్ పీటర్‌బర్గ్‌కు తీసుకెళ్లడం నా జీవితంలో బాగా గుర్తుంచుకొనే అంశం. ఎందుకంటే అంతకుముందాు నేను 2004లో మహేష్ బాబు నటించిన అర్జున్ సినిమా కోసం అక్కడ షూటింగ్ చేశాను. మహేష్‌తో నేను చూసిన షూటింగ్ ప్రదేశాలకు తీసుకెళ్లి ఈ ప్లేస్ గుర్తు ఉందా? అని అడగడం చాలా హ్యాపీగా అనిపించింది అని శ్రీయ చెప్పారు.

  అలా ఆటపట్టించారు..

  అలా ఆటపట్టించారు..

  మహేష్‌బాబుతో నేను షూట్ చేసిన ప్రాంతాలు నాకు గుర్తులేవని చెబితే నమ్మలేదు. అబద్దం ఆడుతున్నావని ఆటపట్టించారు. మా మధ్య అలాంటి సన్నిహిత సంబంధాలు ఉంటాయి. నా గురించి తీసుకునే శ్రద్ధ చూస్తే ప్రతీసారి ఆశ్చర్యం వేస్తుంది. ఇలాంటి భర్తను ఇచ్చిన భగవంతుడు చాలా గొప్పవాడనే ఫీలింగ్ ఉంటుంది అని శ్రీయ అన్నారు.

  RRRలో శ్రీయా సరన్

  RRRలో శ్రీయా సరన్

  ఇక తెలుగు సినిమాల్లో అరుదుగా కనిపిస్తున్న శ్రీయ సరన్.. ప్రస్తుతం ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న RRR మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ చిత్రంలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్, అజయ్ దేవగన్ నటిస్తున్న ఈ చిత్రం జనవరి 2021లో రిలీజ్ కానున్నది.

  English summary
  Actress Shriya Saran reveals about marriage husband Andrei Koscheev and her personal life.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X