twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హీరోలు పై నుంచి ఊడిపడ్డారా? సెట్లో నాతో దారుణంగా.. శృతిహాసన్ ఫైర్

    |

    మ్యాటర్ ఏదైనా గానీ ముక్కుసూటిగా మాట్లాడే మనస్తత్వం శృతిహాసన్‌ది అనే మాట ఇండస్ట్రీలో ఓ టాక్ ఉంది. ఆమె మాట తీరు, ప్రవర్తన కారణంగానే పలు సినిమాలు ఆమెకు దూరమయ్యాయని చెప్పుకొంటారు. ప్రవర్తన ఎలా ఉన్నా ఆమె ప్రతిభ తమిళ, తెలుగు, హిందీ భాషల్లో గుర్తించేలా చేసింది. ప్రస్తుతం తన మనోధైర్యమే ఆమెకు రక్షణ వలయంగా నిలిచిందని చెప్పుకొంటారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో హీరోల తీరుపై శృతి హాసన్ చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి. ఇంతకు ఆమె చేసిన వ్యాఖ్యలు ఏమిటంటే..

    Recommended Video

    Shruti Haasan Serious On Male Dominance In Industry | హీరోలు పై నుంచి ఊడిపడ్డారా? | Filmibeat Telugu
     సినీ పరిశ్రమలో వివక్ష అంటూ

    సినీ పరిశ్రమలో వివక్ష అంటూ

    సినీ పరిశ్రమలో మగ వాళ్లతో పోల్చుకుంటే ఆడవాళ్లకు ప్రధాన్యత తక్కువ. ఇది కొత్తగా వస్తున్న సమస్య కాదు. కాలం మారినా గానీ ఈ తీరు మారడం లేదు. షూటింగ్ సెట్లో హీరోలకు ఒకరకంగా ప్రిఫరెన్స్.. హీరోయిన్లకు ఓ రకమైన ట్రీట్ మెంట్ ఉంటున్నది. మహిళలు ఈ విషయంలో ఆత్మరక్షణలో పడుతున్నారు. నా ఇంటి పేరు కూడా నాకు ఎలాంటి సపోర్ట్ ఇవ్వలేదు అని శృతి హాసన్ అన్నారు.

     నాకు వారసత్వం ఉన్నా..

    నాకు వారసత్వం ఉన్నా..

    నా తండ్రి వారసత్వాన్ని, నా ప్రవర్తనను కొందరు దుష్ఫ్రచారం చేయాలని చూశారు. కానీ నేను ఎప్పుడూ బెదిరిపోలేదు. నేను చాలా కంఫర్ట్‌గా ఉన్నాను. ఇలాంటి విషయాలు గానీ.. మహిళలపై జరుగుతున్న అన్యాయాలను గానీ మాట్లాడటానికి నేను వెనుకాడను. కొన్ని విషయాలు నాకు చాలా మనస్తాపానికి గురిచేశాయి అని శృతిహాసన్ పేర్కొన్నారు.

    సెట్లో దారుణంగా ట్రీట్ చేసేవారు

    సెట్లో దారుణంగా ట్రీట్ చేసేవారు

    పలు సినిమాల సెట్లో నన్ను సూటి పోటీ మాటలతో బాధించారు. పుస్తకాలు చదువొద్దు అంటూ ముఖం మీదే చాలా దురుసుగా అనేవారు. అందుకే నేను కార్‌వ్యాన్‌లోకి వెళ్లి నా పనేంటో నేను చూసుకొనే దానిని. నేను ఎవరితో మాట్లాడుతున్నానే విషయాన్ని, అలాగే నా విషయాలపై పలు రకాలుగా దృష్టిపెట్టే వారు అని శృతిహాసన్ చెప్పారు.

    హీరోలకే ఫస్ట్ ప్రిఫరెన్స్

    హీరోలకే ఫస్ట్ ప్రిఫరెన్స్

    హీరోలు పైనుంచి ఊడిపడ్డారనే ఫీలింగ్‌లో యూనిట్ ఉండేది. హీరో రాగానే ముందుగా కుర్చీ తీసుకొచ్చి వేసేవారు. కనీసం నేను సెట్లోకి వెళ్తే కుర్చీ కూడా తెచ్చి ఇచ్చేవారు కాదు. మాములు స్థాయి హీరో వచ్చినా వారికే ప్రాధాన్యం ఉండేది. మానిటర్ వద్దకు హీరో వెళ్తే ముందు కుర్చీలో కూర్చొమనే వారు. మాకు మాత్రం ఎలాంటి గౌరవం దక్కేది కాదు అని శృతి హాసన్ అన్నారు.

    English summary
    Actress Shruti Haasan reacted over Male dominance, Discrimination in film industry. She said, So the chair will be first kept for the hero. In my first few films, I was never offered a chair first, or on any other set.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X