Sri Reddy : అస్వస్థతతో హుటాహుటిన హాస్పిటల్ కి.. అసలు ఏమైంది అంటే?
సినిమాల కంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ముందు చేసిన నగ్న ప్రదర్శనతో ఎక్కువ పాపులర్ అయింది శ్రీ రెడ్డి.. దగ్గుబాటి వారసుడు రానా తమ్ముడు అభిరామ్ తనను లైంగికంగా వాడుకున్నాడు అంటూ ఆమె చేసిన సంచలన వ్యాఖ్యలు అప్పట్లో టాలీవుడ్ లో సంచలనంగా మారింది. చెన్నైకి మకాం మార్చేసిన ఈ బ్యూటీ గత రెండు మూడు నెలల నుంచి ఫేస్ బుక్ లో యాక్టివ్ గా లేదు. ఆమె ఆరోగ్యం గురించి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉండగా ఆమె ఆరోగ్యం గురించి కీలక వివరాలు వెల్లడయ్యాయి. ఆ వివరాల్లోకి వెళితే

సోషల్ మీడియాలో సైలెన్స్
టాలీవుడ్ మీటూ అంశం తర్వాత చెన్నై మకాం మార్చిన శ్రీరెడ్డి అక్కడే ఉంటూ యూట్యూబ్ ఛానల్ మొదలు పెట్టి వంటలు చేస్తూ ఏదేదో చేయాలని ప్రయత్నిస్తోంది. ఎప్పటికప్పుడు ఫేస్ బుక్ వేదికగా రాజకీయ అంశాల మీద ఎవర్నో ఒకర్ని టార్గెట్ చేస్తూ బూతులతో విరుచుకు పడుతున్న శ్రీ రెడ్డి చాలా రోజుల నుంచి సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు పెట్టకపోవడం, సంచలనంగా మారింది.

అసలు ఏమైంది?
ఆమె యూట్యూబ్ ఛానల్ లో కూడా పెద్దగా అప్డేట్లు లేవు, ఈ క్రమంలో అసలు శ్రీరెడ్డి ఏమైపోయింది ? అనే అనుమానం అందరికి మొదలైంది. కత్తి మహేష్ మరణించినప్పుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన శ్రీరెడ్డి అందరం ఏదో ఒక రోజున పోవాల్సిన వాళ్ళమే కదా అంటూ చెప్పుకొచ్చింది.. అంతకు ముందే తన స్నేహితులు ఇద్దరు సూసైడ్ చేసుకుని చనిపోయారని తాను చాలా డిప్రెషన్లో ఉన్నానని కూడా ఆమె కామెంట్ చేయడం తో అసలు ఆమెకు ఏమైంది ? అనే అంశం మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

డిప్రెషన్ లోకి
అయితే ఆ మధ్య కొన్ని చానెళ్లకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె అసలు తనకు ఏం జరిగింది అనే విషయం మీద క్లారిటీ ఇచ్చింది. తాను సోషల్ మీడియాకు దూరంగా ఉండడానికి కారణం కరోనా అని ప్రచారం జరుగుతుండగా తనకు డిప్రెషన్ ఎక్కువ కావడంతో డాక్టర్ను సంప్రదించానని డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటే త టాబ్లెట్లు ఇచ్చారని ఆ టాబ్లెట్ లు వాడుతూ ఉండడం వల్ల ఫేస్బుక్ వాడటం లేదని చెప్పుకొచ్చారు. అయితే తాజాగా మరో విషయం బయటకు వచ్చింది.

వైద్యం కోసం అక్కడికి
హైదరాబాద్ వచ్చి ఇంటర్వ్యూలు ఇచ్చిన వెళ్ళిన తర్వాత మళ్లీ చెన్నై వెళ్లిన శ్రీరెడ్డి అనారోగ్యానికి గురి కావడంతో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండగా డిప్రెషన్ ఎక్కువైపోవడంతో ఆమె హార్ట్ బీట్ వేగంగా కొట్టుకుంటూ కంట్రోల్ కావడం లేదని, దానికి ఇంగ్లీష్ మందులు ఎన్ని వాడినా ఉపయోగం లేక పోవడంతో ఆయుర్వేద శ్రీరెడ్డి వైద్యం పొందుతోందని అంటున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నా డిప్రెషన్ తగ్గించుకోవడం కోసం నార్త్ ఇండియాలో ప్రముఖ యోగా కేంద్రానికి వెళ్తున్నట్టు తెలుస్తున్నది.
Recommended Video

పొలిటికల్ ఎంట్రీ
శ్రీరెడ్డి ఎక్కువగా వైసీపీ తరపున వకాల్తా పుచ్చుకుని మాట్లాడడమే కాక వైసీపీ కి తలనొప్పిగా మారిన కొంత మంది రాజకీయ నాయకుల గురించి కూడా ఆమె అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉండేవారు, జగన్మోహన్ రెడ్డిని తనకు రాజకీయ రంగ ప్రవేశం చేసే అవకాశం ఇవ్వాలని కూడా సోషల్ మీడియా వేదికగా ఆమె విజ్ఞప్తి చేయడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది.


Click it and Unblock the Notifications











