»   » 2.0 : అమీ జాక్సన్ పాత్ర ఇదే, మైండ్ బ్లోయింగ్ స్టంట్ (వీడియో)

2.0 : అమీ జాక్సన్ పాత్ర ఇదే, మైండ్ బ్లోయింగ్ స్టంట్ (వీడియో)

Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  2.0 : అమీ జాక్సన్ పాత్ర ఇదే, మైండ్ బ్లోయింగ్ స్టంట్ (వీడియో)

  'మద్రాసిపట్టణం' అనే తమిళ సినిమా ద్వారా ఇండియన్ ఎంటర్టెన్మెంట్ రంగంలోకి అడుగు పెట్టిన అమీ జాక్స్ అప్పటి నుంచి వరుస అవకాశాలతో దూసుకెళుతూనే ఉంది. ఇంతకు ముందు శంకర్ దర్శకత్వంలో వచ్చిన 'ఐ' హీరోయిన్‌గా చేసిన అమీ... తాజాగా రజనీకాంత్ మూవీ 2.0 చిత్రంలోనూ హీరోయిన్ పాత్రలో నటించింది. ఆమీ కెరీర్లోనే బిగ్గెస్ట్ మూవీ అయిన ఈ చిత్రం మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

  ఇందులో అమీ జాక్సన్ లేడీ రోబోట్ పాత్రలో కనిపించబోతోంది. ఉత్కంఠ రేపే యాక్షన్ సన్నివేశాల్లో ఈ బ్రిటన్ బ్యూటీ ప్రేక్షకులను మంత్రముగ్దులను చేయబోతోంది. అయితే షూటింగ్ మొదలవ్వడానికి ముందే స్టంట్స్ చేయడంలో అమీ శిక్షణ తీసుకుందట. ఆ ప్రిపరేషన్స్‌కు సంబంధించిన వీడియోను సోషల్ మీడియా ద్వారా ఆమె అభిమానులతో పంచుకున్నారు.

  షూటింగుకు ముందే స్టంట్స్ ప్రాక్టీస్

  షూటింగ్ మొదలవ్వడానికి ముందే చెన్నైలో స్టంట్స్ ప్రాక్టీస్ చేశాను. ఇది నా ఫస్ట్ ప్రాక్టీస్ సెషన్‌కు సంబంధించిన వీడియో. స్లో మోషన్లో వీడియో రికార్డ్ చేసి చూసుకుని ఏదైనా మిస్టేక్స్ ఉంటే సరి దిద్దుకునేవాళ్లం. టైమింగ్ కూడా పర్ఫెక్టుగా ఉండేలా చూసుకుని షూటింగ్ సమయానికి సిద్దమయ్యేవారమని తెలిపారు.

   కీలకంగా అమీ జాక్సన్ పాత్ర

  కీలకంగా అమీ జాక్సన్ పాత్ర

  ఈ చిత్రంలో అమీ జాక్సన్ పాత్ర ఆసక్తికరంగా ఉంటుందట. ఫస్ట్ పార్ట్ ‘యంతిరన్'లో మ్యూజియంకు పరిమితం చేసిన చిట్టి రోబోను బయటకు తీసుకురావడంలో అజీ జాక్సన్ పోషించే రోబో పాత్ర కీలకంగా ఉంటుందట. దీంతో పాటు చిట్టికి సపోర్టుగా కొన్ని సంట్స్ కూడా చేస్తుందని తెలుస్తోంది.

  తుడిచి పెట్టుకుపోయిన బాహుబలి 2 రికార్డ్.. రజని 2.0మానియా!

   చిట్టిలో ప్రేమ పుట్టించి బయటకు రప్పించి....

  చిట్టిలో ప్రేమ పుట్టించి బయటకు రప్పించి....

  మొదటి భాగం యంతిరన్‌(రోబో)లో సైంటిస్ట్ వశీకరణ్(రజనీ) చిట్టికి మనసుకు సంబంధించి చిప్ అమర్చడం, దాంతో చిట్టి ఐశ్వర్యరాయ్‌తో ప్రేమలో పడటం తెలిసిందే. అదే కాన్సెప్టుతో ఇపుడు మ్యూజియంలో నిద్రావస్థలో ఉన్న చిట్టి రోబోపై ఈ లేడీ రోబోను ప్రయోగిస్తారని, అలా మ్యూజియం నుంచి బయటకు వచ్చిన చిట్టి రోబో కౌమ్యాన్ భరతం పడతాని టాక్.

   కౌమ్యాన్ పాత్రలో అక్షయ్ కుమార్

  కౌమ్యాన్ పాత్రలో అక్షయ్ కుమార్

  2.0 చిత్రంలో ప్రతి నాయకుడి పాత్రను అక్షయ్ కుమార్ పోషిస్తున్న సంగతి తెలిసిందే. అక్షయ్ ఇందులో కౌమ్యాన్ (కాకి మనిషి) రూపంలో ప్రేక్షకులను భయబ్రాంతులకు గురిచేయబోతున్నాడు. అయితే అక్షయ్ కుమార్ కేవలం విలన్ రోల్ మాత్రమే కాదని.... అతడి పాత్రలో ఎన్నో షేడ్స్ ఉంటాయని అన్నారు దర్శకుడు శంకర్. ఒక పెద్ద హీరో అయుండి ఇలాంటి విలన్ రోల్ ఒప్పుకోవడానికి కారణం కూడా అదేనంట.

  English summary
  Amy Jackson plays the female lead in 2.0 and appears as a robot as well. On November 26, she took to Instagram to share a video of how she perfected a stunt sequence for Shankar's 2.0. "Before we started filming for 2.0, some of the best action choreographers flew into to Chennai to begin stunt prep. This is from our first practice session! We shot everything in slo-mo so we could see my mistakes and work out the timings for the ropes before we shot the real thing. (sic)" Amy said.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more