Ananya Panday అర్యన్ ఖాన్‌కు డ్రగ్స్ సప్లై.. లైగర్ బ్యూటీ రియాక్షన్ ఏమిటంటే?
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ అరెస్ట్ తర్వాత సినీ తారలతో డ్రగ్స్ లింక్ కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో భాగంగా వాట్సాప్ ఛాట్స్‌పై దృష్టిపెట్టిన ఎన్సీబీకి యువ హీరోయిన్ అనన్య పాండే వ్యవహారం బయటపడింది. వాట్సప్ ఛాట్‌లో ఆర్యన్ ఖాన్, అనన్య పాండే డ్రగ్స్ సమకూర్పు, కోనుగోలు గురించి చర్చించుకొన్నట్టు ఎన్సీబీ అధికారులు ఆరోపించారు. తమ ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను ముంబై కోర్టుకు సమర్పించడం తెలిసిందే.
ఈ క్రమంలో అనన్య పాండే నివాసంలో తనిఖీలు, సోదాలతోపాటు ఆమెకు సమన్లు కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలో అర్యన్ ఖాన్‌కు గంజాయి సమకూర్చిందని వచ్చిన ఆరోపణలపై అనన్య పాండే ఇచ్చిన సమాధానం ఏమిటంటే..

రెండు గంటలపాటు విచారణ
బాలీవుడ్ డ్రగ్స్ కేసులో అనన్య పాండే గురువారం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. ఆర్యన్ ఖాన్ చాటింగ్‌కు సంబంధించి దాదాపు రెండు గంటలపాటు ఆమెను ప్రశ్నించారు. అనంతరం శుక్రవారం విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేశారు. దాంతో శుక్రవారం తన తండ్రి, నటుడు చంకీ పాండేతో కలిసి దక్షిణ ముంబైలోని విచారణకు హాజరయ్యారు.

ఆర్యన్ ఖాన్‌కు డ్రగ్స్ సప్లై చేశావా?
అయితే విచారణ సందర్భంగా ఆర్యన్ ఖాన్‌కు డ్రగ్స్ ఏమైనా సప్లై చేశావా? అంటూ అడిగిన ప్రశ్నకు అనన్య పాండే మౌనంగా ఉండిపోయింది. మొబైల్ ఛాటింగ్‌కు సంబంధించిన వివరాలను ముందు పెట్టి అనేక కోణాల్లో ప్రశ్నలు సంధించినట్టు సమాచారం. అయితే ఎన్సీబీ అధికారుల ప్రశ్నలకు అనన్య పాండే తెలియదు, నాకు సంబంధం లేదు అంటూ జవాబు ఇచ్చినట్టు తెలిసింది.

ఆర్యన్ ఖాన్‌తో అనన్య వాట్సప్ ఛాట్
అనన్య పాండేతో ఆర్యన్ ఖాన్ చాటింగ్ చేస్తూ.. నాకు డ్రగ్స్ పంపించగలవా అని అడిగితే.. అందుకు సరే.. నేను పంపిస్తాను అంటూ చెప్పిన విషయం గురించి ఎన్సీబీ అధికారులు గుచ్చి గుచ్చి ప్రశ్నించినట్టు సమాచారం. అయితే వాట్సాప్ ఛాటింగ్‌లో తప్పితే డ్రగ్స్ పంపించినట్టు ఎక్కడా ఆధారాలు లేకపోవడం గమనార్హం. అయితే ఎన్సీబీ అధికారుల ప్రశ్నలను అనన్య పాండే ఖండించినట్టు తెలిసింది.

డ్రగ్స్ ఎప్పుడూ తీసుకోలేదు అంటూ
ఆర్యన్ ఖాన్‌కు గంజాయి సప్లై చేసినట్టు వచ్చిన వార్తలను అనన్య పాండే ఖండించారు. అంతేకాకుండా తాను ఎప్పుడూ డ్రగ్స్ తీసుకోలేదు. వాటి గురించి తెలియదని అనన్య పాండే అధికారులు వెల్లడించినట్టు సమాచారం. ఈ విచారణలో భాగంగా తాము అడిగిన ప్రశ్నలకు అనన్య పాండే ఇచ్చిన సమాధానాలను రికార్డ్ చేసి పలు కోణాల్లో ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం.
Recommended Video

షూటింగులు రీ షెడ్యూల్ చేయండి...
ఇదిలా ఉండగా, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారుల విచారణ నేపథ్యంలో అనన్య పాండే షూటింగులకు దూరంగా ఉంటున్నారు. తనకు సంబంధించిన షూటింగ్ డేట్స్‌ను రీ షెడ్యూల్ చేయాలని నిర్మాత, దర్శకులకు అనన్య పాండే చెప్పినట్టు తెలిసింది. ఇక అనన్య పాండే సినిమాల విషయానికి వస్తే.. విజయ్ దేవరకొండతో కలిసి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దర్శకుడు శకున్ బాత్రా రూపొందించిన హిందీ చిత్రం రిలీజ్‌కు సిద్ధంగా ఉంది.


Click it and Unblock the Notifications











