twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    MAA elections 2021: బ్యాలెట్ పేపర్లు ఇంటికి తీసుకెళ్లి.. అందుకే ఓటమి.. అనసూయ సంచలన ఆరోపణలు

    |

    మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ (మా) ఎన్నికలు ముగిసినా ఇంకా వివాదాలు మాత్రం తగ్గుముఖం పట్టలేదు. మీడియా ముందు, అలాగే సోషల్ మీడియా వేదికగా కొందరు సినీ ప్రముఖులు తమ అక్కసును వెళ్లగక్కుతున్నారు. అయితే మా ఎన్నికల వివాదం ఇప్పట్లో చల్లారే పరిస్థితి కనిపించడం లేదు. ఇండస్ట్రీలో వాతావరణం నివురు గప్పిన నిప్పులా ఎదో క్షణంలో భగ్గుమనే పరిస్థితి కనిపిస్తున్నది. తాజాగా మా ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ యాంకర్, యాక్టర్ అనసూయ భరద్వాజ్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. అనసూయ చేసిన ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన కామెంట్లు ఏమిటంటే..

    మా సభ్యత్వానికి రాజీనామా

    మా సభ్యత్వానికి రాజీనామా

    మా ఎన్నికల్లో విష్ణు మంచు వర్గం విజయం సాధించిన తర్వాత మెగా బ్రదర్ నాగబాబు, అలాగే అధ్యక్ష పోటీలో నిలిచిన ప్రకాశ్ రాజ్ తన మా సభ్యత్వానికి రాజీనామా చేశారు. అయితే మా ఎన్నికల గొడవ ముగిసి పోలేదు. ఇప్పుడే మొదలైంది అంటూ ప్రకాశ్ రాజ్ ఏదో కామెంట్ చేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది.

    600 ఓట్ల లెక్కింపు రెండు రోజులా?

    600 ఓట్ల లెక్కింపు రెండు రోజులా?

    ఇలాంటి పరిస్థితుల్లో యాంకర్ అనసూయ ట్విట్టర్‌లో సంచలన విషయాలు ప్రస్తావించారు. మా సంస్థలో మొత్తం 900 మంది సభ్యులు ఉన్నారు. వాళ్లలో సుమారు 600 మంది ఓటర్లు ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఆ ఓట్ల లెక్కింపు రెండో రోజు కి వాయిదా వేయాల్సినంత టైమ్ ఎందుకు పట్టిందంటారు. ఆహా ఏదో అర్ధం కావడం లేదు అని అనసూయ భరద్వాజ్ పేర్కొన్నారు.

    మొదటి రోజు భారీ మెజారిటీ అని

    మొదటి రోజు భారీ మెజారిటీ అని

    అనసూయ మరో ట్వీట్ చేస్తూ.. క్షమించాలి. ఒక్క విషయం గురించి తెగ నవ్వొచ్చింది. మీతో పంచుకోవాల్సిందే. ఆ విషయాన్ని మీతో పంచుకొంటున్నా. మీరు ఏమనుకోవద్దు. నిన్న అనసూయ అత్యధిక మెజారిటీ, భారీ మెజారిటీతో గెలుపు అని, ఈ రోజు ఓటమి పాలు అని అంటున్నారు. రాత్రికి రాత్రే ఏం జరిగి ఉంటుందబ్బా అని అనసూయ భరద్వాజ్ అన్నారు.

     బ్యాలెట్ పేపర్లు ఇంటికి తీసుకెళ్లి

    బ్యాలెట్ పేపర్లు ఇంటికి తీసుకెళ్లి

    అనసూయ భరద్వాజ్‌కు ఓ నెటిజన్ ప్రశ్న వేస్తూ.. నిన్న ఈసీ మెంబర్స్‌లో అనసూయకి ఎక్కువ మెజారిటీతో గెలిచారని అని రాశారు. ఈ రోజు రిజల్ట్ రివర్స్ అయిందని వేశారు అని అంటే.. అంటే మరి నిన్న ఎవరో ఎలక్షన్స్ రూల్స్‌కి భిన్నంగా బ్యాలెట్ పేపర్స్‌ని ఇంటికి కూడా తీసుకెళ్లారని గుసగుసలాడుతున్నారు. నేను ఈ విషయం బయటకు నేను అనట్లేదు అని మరో ట్వీట్ చేశారు.

    గుణపాఠం నేర్చుకొన్నాను అంటూ

    గుణపాఠం నేర్చుకొన్నాను అంటూ

    మా ఎన్నికల నుంచి నేను ఓ గుణపాఠం నేర్చుకొన్నాను అంటూ అనసూయ భరద్వాజ్ ఘాటుగా స్పందించారు. రాజకీయాల్లో నేను ఎప్పుడూ జోక్యం చేసుకోలేదు. రాజకీయాల్లో ఎప్పుడూ మీరు నిజాయితీగా ఉండలేరు. అలాంటి వాటిని నేను పట్టించుకోలేను. నీతి మాలిన రాజకీయాల కంటే పిల్లలతో పనిచేయడం మంచిది అంటూ అనసూయ భరద్వాజ్ ట్వీట్ చేశారు.

    Recommended Video

    Raviteja Released Venuvu lo Song From Natyam Movie
     అనసూయ భరద్వాజ్ కెరీర్ ఇలా

    అనసూయ భరద్వాజ్ కెరీర్ ఇలా

    అనసూయ భరద్వాజ్ కెరీర్ విషయానికి వస్తే.. ఇటీవల థ్యాంక్యూ బ్రదర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆమె... పుష్ప, ఆచార్య, ఖిలాడి, భీష్మ పర్వం , రంగ మార్తాండ చిత్రాల్లో నటించారు. త్వరలోనే ఆమె కీలక పాత్ర పోషిస్తున్న పుష్ప, ఆచార్య చిత్రాలు రిలీజ్‌కు సిద్దమవుతున్నాయి. సినిమాలు పక్కన పెడితే.. పలు రియాలిటీ షోలతో అనసూయ బిజీగా ఉన్నారు.

    English summary
    Actor and Anchor Anasuya Bharadwaj alleges that fraud in the MAA elections 2021. She tweeted that Asalu unna sumaru 900 voters lo sumaru 600 chillara voters lekkimpuki rendo roju ki vaayida veyalsinanta time eduku pattindantaru?? Aha edu ardhamkaka adugutunnanu
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X