For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బిగ్ సర్‌ప్రైజ్: బోల్డ్ అవతారంలో అనసూయ.. హాట్ యాంకర్‌ను అలా మార్చేసిన విజయ్ దేవరకొండ.!

  By Manoj Kumar P
  |

  తెలుగు బుల్లితెర చరిత్రలోనే అత్యంత భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్న యాంకర్లలో అనసూయ భరద్వాజ్ పేరు ప్రముఖంగా చెప్పుకోవచ్చు. ప్రముఖ చానెల్‌లో ప్రసారం అవుతోన్న 'జబర్ధస్త్' ద్వారా టీవీ రంగానికి పరిచయం అయిన ఈ అమ్మడు.. ఈ ఒక్క షోతోనే ఎంతో పాపులర్ అయిపోయింది. ఈ క్రమంలోనే భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదింకుంది. అంతేకాదు, టాలీవుడ్‌లోకి సైతం అడుగు పెట్టిన అనసూయ.. ఎన్నో కీలక పాత్రలు చేసింది. తాజాగా ఈమెకు విజయ్ దేవరకొండ సర్‌ప్రైజ్ ఇచ్చాడట. ఆ వివరాలు మీకోసం.!

  ఇక్కడా అక్కడా.. అనసూయకు అదే పాపులారిటీ

  ఇక్కడా అక్కడా.. అనసూయకు అదే పాపులారిటీ

  ప్రస్తుతం తెలుగులో ప్రసారం అవుతున్న పలు షోలకు హోస్ట్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తోంది అనసూయ. ఒకవైపు ఎన్నో షోలలో బిజీగా ఉంటూనే.. మరోవైపు సినిమాల్లోనూ నటిస్తోంది. ఈ క్రమంలోనే బడా ప్రాజెక్టుల్లో సైతం ఆఫర్లు దక్కించుకుంటోంది. కొన్నేళ్ల క్రితం రామ్ చరణ్ నటించిన ‘రంగస్థలం' అనే సినిమా చేసిన ‘రంగమ్మత్త' పాత్రతో ఆమెకు భారీ స్థాయిలో క్రేజ్ వచ్చింది.

  టీవీ షోలు.. సినిమాలు.. ఖాళీగా ఉంటే అక్కడే

  టీవీ షోలు.. సినిమాలు.. ఖాళీగా ఉంటే అక్కడే

  అనసూయ ప్రస్తుతం టీవీ షోలు.. సినిమాలు.. షాప్ ఓపెనింగ్స్ సహా ఎన్నో కార్యక్రమాలతో బిజీ బిజీగా గడుపుతోంది. దీంతో ఆమె డేట్స్ కోసం చాలా మంది వేచి చూస్తున్నారు. ఇలాంటి సమయంలోనూ ఆమె.. సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ బిజీగా ఉంటోంది. ఖాళీగా ఉన్న సమయంలోనే కాదు.. బిజీ షెడ్యూల్‌లో కూడా తన ఖాతాల ద్వారా ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటోంది.

  గ్లామర్ ట్రీట్‌తో రచ్చ.. వాళ్ల నుంచి విమర్శల వర్షం

  గ్లామర్ ట్రీట్‌తో రచ్చ.. వాళ్ల నుంచి విమర్శల వర్షం

  అనసూయ టీవీ షోలతో పాటు సినిమాల్లో గ్లామర్‌గా కనిపిస్తోంది. అయితే, ఎక్కడా హద్దు మీరిన డ్రెస్‌లు వేసుకోవడం లేదు. కానీ, ఆమె తన పర్సనల్ లైఫ్‌లో మాత్రం పొట్టి పొట్టి దుస్తులు వేస్తూ కనిపిస్తోంది. వీటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది. దీంతో ఆమెపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతూ విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

  స్పైసీ రోల్‌తో వస్తున్న అనసూయ.. డైరెక్టర్ పోస్ట్

  స్పైసీ రోల్‌తో వస్తున్న అనసూయ.. డైరెక్టర్ పోస్ట్

  ప్రస్తుతం అనసూయ తెలుగులో పలు సినిమాల్లో నటించడానికి సిద్ధం అయింది. ఈ క్రమంలోనే ఆమె క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కిస్తోన్న ‘రంగమార్తండ' అనే మూవీకి సైతం సంతకం చేసేసింది. ఇందులో అనసూయ స్పైసీ రోల్ చేస్తున్నట్లు దర్శకుడు ఇటీవల ప్రకటించాడు. ఈ మూవీలో రమ్యకృష్ణ, ప్రకాశ్ రాజ్, రాహుల్ సిప్లీగంజ్, శివాత్మిక, అలీ రేజా తదితరులు నటిస్తున్నారు.

  అనసూయకు విజయ్ దేవరకొడ బిగ్ సర్‌ప్రైజ్

  అనసూయకు విజయ్ దేవరకొడ బిగ్ సర్‌ప్రైజ్

  తెలుగులో స్టార్ హీరోగా వెలుగొందుతోన్న విజయ్ దేవరకొండ.. నిర్మాతగానూ వ్యవహరించిన విషయం తెలిసిందే. గత ఏడాది అతడు తన బ్యానర్‌లో ‘మీకు మాత్రమే చెబుతా' అనే సినిమా చేశాడు. ఇప్పుడు మరోసారి నిర్మాతగా మారాలని డిసైడ్ అయ్యాడు. ఇందులో భాగంగానే త్వరలోనే ప్రారంభం కానున్న సినిమాలో అనసూయకు అవకాశం ఇచ్చాడని తాజాగా ఓ లీక్ వైరల్ అవుతోంది.

  Anchor Anasuya Bharadwaj Strong Warning || మర్యాదగా కామెంట్స్ డిలీట్ చెయ్యండి..! | Filmibeat Telugu
  విజయ్ ప్లాన్.. బోల్డ్ అవతారంలో అనసూయ

  విజయ్ ప్లాన్.. బోల్డ్ అవతారంలో అనసూయ

  ఈ సినిమాలో అనసూయ చేసేది కీలక పాత్ర అని ప్రచారం జరుగుతోంది. ఆ పాత్రను బట్టి ఆమె కొంచెం బోల్డుగా కనిపించబోతుందని అంటున్నారు. అంతేకాదు, అనసూయ చేసే పాత్రకు నెగెటివ్ షేడ్స్ కూడా ఉంటాయని సమాచారం. ఎంతో క్లిష్టమైన పాత్ర కాబట్టే ఆమె దీనికి విజయ్ అడిగిన వెంటనే ఓకే చెప్పేసిందని టాక్. ‘మీకు మాత్రమే చెబుతా'లోనూ ఆమె నటించిన విషయం తెలిసిందే.

  English summary
  A few days before Rakesh's wedding, a scandalous video of him gets leaked onto a porn site. With his marriage, reputation and career at stake, Rakesh and his friend Kamesh seek out a hacker to help them remove the video before it becomes viral.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X