For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  థాంక్యూ బ్రదర్‌కి గట్టిగా ఛార్జ్ చేసిన అనసూయ... రోజుకు ఎంతంటే?

  |

  టీవీ యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టి అనతి కాలంలోనే సూపర్ క్రేజ్ తెచ్చుకుంది అనసూయ. మొదట్లో సాక్షి టీవీలో న్యూస్ యాంకరింగ్ చేసిన ఆమె తర్వాత మా మ్యూజిక్ ఛానల్ లో యాంకరింగ్ చేయడం మొదలు పెట్టింది. అయితే ఇవేవీ తెచ్చిపెట్టని క్రేజ్ ఆమె జబర్దస్త్ లో ఎంట్రీ ఇవ్వగానే ఆ షో తెచ్చిపెట్టింది. టెలివిజన్ యాంకర్లు అంటే పద్ధతిగానే ఉండక్కర్లేదు హాట్ అండ్ క్యూట్ లుక్స్ తో కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవచ్చని చాటి చెప్పిన యాంకర్లలో ఒకరిగా నిలిచిన అనసూయకి అనతి కాలంలోనే మంచి క్రేజ్ లభించింది. బుల్లితెరలో ఆమెకు వచ్చిన క్రేజ్ తో సినిమా ఆఫర్స్ సైతం పట్టేసింది. తాజాగా ఆమె లీడ్ రోల్ లో నటించిన థాంక్యూ బ్రదర్ అనే సినిమా రిలీజ్కు సిద్ధమవుతోంది. అయితే ఆ సినిమా కోసం భారీగా రెమ్యూనరేషన్ చార్జి చేసినట్లు తెలుస్తోంది వివరాల్లోకి వెళితే.

  స్టైలిష్ లుక్ తో కవ్విస్తున్న లేటెస్ట్ మహేశ్వరి

  న్యూస్ యాంకర్ గా మొదలు పెట్టి

  న్యూస్ యాంకర్ గా మొదలు పెట్టి

  యాంకర్ అనసూయ అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరేమో.. తనదైన హాట్ లుక్స్ తో డాన్స్ చేస్తూ జబర్దస్త్ షో కి సపరేట్ క్రేజ్ తెచ్చిపెట్టింది. కెరీర్ మొదట్లో ఒకటి రెండు సినిమాల్లో నటించిన ఆమె తర్వాత ఎందుకో పెద్దగా నటన వైపు ఆసక్తి చూపించలేదు. అప్పట్లో కొత్తగా లాంచ్ అయిన సాక్షి టీవీలో ఆమె న్యూస్ యాంకర్ గా చేరింది. అక్కడ కొన్నాళ్ళు పని చేసిన తరువాత ఆమె మా మ్యూజిక్ ఛానల్ లో ప్రోగ్రామ్స్ చేయడం మొదలు పెట్టింది.

  జబర్దస్త్ అనిపిస్తూ

  జబర్దస్త్ అనిపిస్తూ

  అయితే అప్పుడే కొత్తగా లాంచ్ చేస్తున్న జబర్దస్త్ ప్రోగ్రాం వాళ్లు కొత్త యాంకర్ కోసం వెతుకుతుండగా అనసూయ కనబడింది.. అలా అనసూయకు జబర్దస్త్ యాంకరింగ్ అవకాశం దక్కింది. నిజానికి అప్పటి వరకు ఈ టీవీలో యాంకరింగ్ అంటే పద్ధతిగా చీర కట్టుతో ఒక డ్రెస్ కోడ్ లాంటిది ఉండేది. కానీ మొట్టమొదటిసారి అనసూయ పొట్టి పొట్టి డ్రెస్సులతో కనిపిస్తూ ఎంట్రీ సాంగ్స్ తో అదరగొట్టింది. దెబ్బకు టిఆర్పి రేటింగ్స్ తారాస్థాయికి చేరిపోయాయి.. ఆ దెబ్బకు అనసూయ దాదాపు ఏడెనిమిది ఏళ్లుగా జబర్దస్త్ కి యాంకరింగ్ చేస్తూనే ఉంది.

   రంగమ్మత్త క్రేజ్ తో

  రంగమ్మత్త క్రేజ్ తో

  జబర్దస్త్ లో ఆమెకు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఆమెకు సినిమా అవకాశాలు కూడా దండిగానే వచ్చాయి. ముందుగా సోగ్గాడే చిన్నినాయన సినిమాలో నాగార్జున కు మరదలు పాత్రలో నటించింది.. చూడ్డానికి చిన్న పాత్ర అయినా ఆమెకు ఈ పాత్రకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత అడవి శేష్ హీరోగా వచ్చిన క్షణం సినిమాలో కూడా అనసూయ నెగిటివ్ పాత్ర పోషించి మెప్పించింది. ఇక ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్ర దక్కడంతో ఆమె క్రేజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది.

  త్వరలో ప్రేక్షకుల ముందుకు

  త్వరలో ప్రేక్షకుల ముందుకు

  ఆ సినిమా తర్వాత ఆమెకు 'కథనం' లాంటి మెయిన్ లీడ్ సబ్జెక్ట్స్ వచ్చాయి కూడా కానీ ఆ సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేదు. తాజాగా ఆమె థాంక్యూ బ్రదర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. విరాజ్ అశ్విన్, అనసూయ భరద్వాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 30న థియేటర్లలో విడుదల కావాల్సి ఉంది. కానీ కోవిడ్ -19 సెకండ్ వేవ్ కారణంగా ఈ సినిమాను ఓటిటి ప్లాట్ ఫామ్ లో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ఆహా లో మే 7న ప్రసారం కానుంది. రమేష్ రాపర్తి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనసూయ ప్రెగ్నెంట్ లేడీ పాత్రలో నటించారు.

  #VakeelSaab : Vakeel Saab Movie Team Ugadi Special Interview Part 4 | Pawan Kalyan | Venu Sriram
  రోజుకు లక్షన్నర

  రోజుకు లక్షన్నర

  బాధ్యత తెలియని యువకుడయిన విరాజ్ అశ్విన్ తో లిఫ్ట్‌లో చిక్కుకుంటుంది అనసూయ. ఆ తరువాత ఏం జరిగింది ? వీరిద్దరూ లిఫ్ట్ నుండి ఎలా బయట పడ్డారు అనేదే సినిమా ప్రధానాంశం. అయితే ఈ సినిమాకు గాను అనసూయ పారితోషికంగా ఎంత తీసుకుందనే విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. జరుగుతున్న ప్రచారం మేరకు ఈ సినిమా కోసం అనసూయ రోజుకు రూ .1.5 లక్షలు ఛార్జ్ చేసిందట. 17 రోజుల షెడ్యూల్‌లో షూటింగ్ పూర్తి చేసిన సినిమా కోసం 25 లక్షలు రెమ్యూనరేషన్ ఛార్జ్ చేసిందని అంటున్నారు.

  English summary
  Anasuya Bharadwaj-starrer Thank You Brother is headed for a direct-to-digital release. The film premiere on May 7 on Aha. Directed by Ramesh Raparthi, Thank You Brother is set in the backdrop of the lockdown. The thriller revolves around a fiery youngster and a pregnant woman, who are stuck in an elevator. some rumours came about remuneration of anasuya in this film.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X