Don't Miss!
- News
హైదరాబాద్: దళిత నేత ఇంట్లో యూపీ డిప్యూటీ సీఎం భోజనం, హారతులు పట్టారు
- Finance
Medicines Prices: బీపీ, షుగర్ రోగులకు చేదు వార్త.. పెరిగిన మందుల ధరలు.. ఎక్కడంటే..
- Sports
ఆ వార్త తెలిసి మా అత్తయ్య తెగ ఉప్పొంగిపోయింది : బుమ్రా భార్య సంజనా గణేషన్
- Technology
భారత విద్యార్థులకు ఆకర్షణీయమైన ఆఫర్లు ప్రకటించిన Samsung!
- Automobiles
టొయోట నుంచి 'అర్బన్ క్రూయిజర్ హైరైడర్' వచ్చేసింది: బుకింగ్స్ ప్రైస్ ఎంతంటే?
- Lifestyle
Heartburn and Acid Reflux: హార్ట్ బర్న్ మరియు యాసిడ్ రిఫ్లక్స్ ఒకటే అని పొరబడకండి, ఇదే తేడా..
- Travel
సీనియర్ సిటిజన్స్‌తో ట్రావెల్ చేస్తే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
ఊహించని ప్రశ్నతో అనసూయకు నెటిజన్ షాక్: మనిద్దరి మధ్య ఏం లేదంటూ యాంకర్ షాకింగ్ రిప్లై
ఒకటి కాదు.. రెండు కాదు.. దాదాపు ఏడెనిమిదేళ్లుగా తెలుగు బుల్లితెరపై అందంతో పాటు హోస్టింగ్‌తో హవాను చూపిస్తూ దూసుకుపోతోంది హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్. హోస్టుగా ఎంట్రీ ఇచ్చిన చాలా తక్కువ సమయంలోనే ఊహించని రీతిలో పాపులర్ అయిన ఈ భామ.. వరుసగా ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతోంది. అదే సమయంలో సినిమాల్లోకి సైతం ఎంట్రీ ఇచ్చింది.
అక్కడ కూడా సినిమాల మీద సినిమాలను చేస్తూ హవాను చూపిస్తూ సత్తా చాటుతోంది. ఇక, తాజాగా అనసూయ సోషల్ మీడియాలో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ నిర్వహించింది. ఇందులో ఓ నెటిజన్ ఆమెను ఊహించని ప్రశ్న అడిగాడు. దీంతో ఈ యాంకర్ స్ట్రాంగ్ రిప్లైలు ఇచ్చింది. ఆ సంగతులు మీకోసం!

జబర్ధస్త్‌గా మారిన అనసూయ కెరీర్
సినిమాల్లో కనిపించిన చాలా గ్యాప్ తర్వాత యాంకర్‌గా తన కెరీర్‌ను ఆరంభించింది అనసూయ భరద్వాజ్. జబర్ధస్త్ షో ద్వారా తన ప్రయాణాన్ని మొదలు పెట్టిన ఈ బ్యూటీ.. చాలా తక్కువ సమయంలోనే ఊహించని రీతిలో పాపులర్ అయింది. అదే సమయంలో వరుసగా ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతోంది. ఫలితంగా తన కెరీర్‌ను జబర్ధస్త్‌గా ముందుకు నడుపుకుంటోంది.
Bigg Boss OTT: షోలోకి టాలీవుడ్ కాంట్రవర్శీ కింగ్.. వామ్మో ఇక హౌస్‌లో కూడా రచ్చ రచ్చే

అక్కడ కూడా అనసూయ సందడి
చాలా కాలంగా బుల్లితెరపై యాంకర్‌గా సత్తా చాటిన అనసూయ భరద్వాజ్.. సినిమాల్లోనూ తనదైన శైలి నటనతో మెస్మరైజ్ చేస్తోంది. 'సోగ్గాడే చిన్ని నాయన'తో ఎంట్రీ ఇచ్చిన ఆమె.. ఆ తర్వాత 'క్షణం', 'రంగస్థలం', 'యాత్ర', 'కథనం', 'పుష్ప' సహా ఎన్నో చిత్రాల్లో అద్భుతమైన పాత్రలు చేసింది. ఈ క్రమంలోనే కొన్ని స్పెషల్ సాంగ్స్ కూడా చేసి అలరించింది.

అందరి ఫస్ట్ ఛాయిస్ అనసూయనే
అనసూయ భరద్వాజ్ గతంలో మాదిరిగా బుల్లితెరపై పెద్దగా కనిపించడం లేదు. అయితే, ఆమె ఇప్పుడు ఎక్కువగా సినిమాలపై ఫోకస్ చేసింది. ఈ క్రమంలోనే గత ఏడాది 'థ్యాంక్యూ బ్రదర్', 'పుష్ప'లో సందడి చేసింది. అలాగే, 'రంగమార్తాండ', 'వేదాంతం రాఘవయ్య', 'ఖిలాడీ', 'హరిహర వీరమల్లు', 'పుష్ప 2' వంటి భారీ చిత్రాల్లో కీలక పాత్రలను పోషిస్తోంది.
హాట్ డోస్ మరింత పెంచేసిన పూజా హెగ్డే: ఆమెను ఇంత ఘాటుగా ఎప్పుడూ చూసుండరు

అందులో మాత్రం ఎప్పుడూ బిజీగా
వరుసగా షోలు, సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాలో అనసూయ ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తరచూ తన ఫొటోలు, వీడియోల తన ఖాతాల్లో షేర్ చేస్తుంటోంది. అదే సమయంలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలతో పాటు కెరీర్ సంబంధిత విశేషాలను పంచుకుంటోంది. దీంతో ఆమె ఫాలోవర్ల సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది.

యాంకరమ్మకు షాకిచ్చిన నెటిజన్
సోషల్ మీడియాలో ఎప్పుడూ బిజీగా ఉండే అనసూయ.. అప్పుడప్పుడూ పలు సామాజిక మాధ్యమాల ద్వారా ఫ్యాన్స్‌తో ముచ్చటిస్తుందన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ నిర్వహించింది. ఇందులో ఓ నెటిజన్ ఆమెను 'మిమ్మల్ని అక్కా అని పిలవాలా? లేదా ఆంటీ అని పిలవాలా' అని ప్రశ్నించి షాకిచ్చాడు.
హాట్ వీడియోలో రెచ్చిపోయిన పాయల్ రాజ్‌పుత్: బాడీ పార్టులు మొత్తం చూపిస్తూ దారుణంగా!

మనిద్దరి మధ్య ఏం లేదు కదా అని
నెటిజన్ అడిగిన ప్రశ్నకు యాంకర్ అనసూయ భరద్వాజ్ తనదైన శైలిలో స్పందించింది. 'దయచేసి నన్ను ఏమీ పిలవొద్దు. అలా పిలిచే అంత స్నేహం లేదా బంధం మన ఇద్దరి మధ్య లేదు. ఇలా పిలుస్తామని అనడం మీ పెంపకాన్ని ప్రశ్నిస్తుంది. ఇది ఏజ్ షేమింగ్ చేసినట్లే అవుతుంది. దయచేసి గౌరవం ఇవ్వడం నేర్చుకోండి' అంటూ సదరు నెటిజన్‌కు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది.

ప్రశంసలు కూడా తీసుకోవద్దంటూ
సదరు నెటిజన్ మరోసారి 'ఎవరినైనా అక్కా అని పిలిచినంత మాత్రానా ఏజ్ షేమింగ్ అవ్వదు. అలాంటప్పుడు ప్రశంసలు కూడా తీసుకోవద్దు' అంటూ మరో పోస్ట్ చేశాడు. దీనికి అనసూయ 'నిజమే కావొచ్చు. కానీ ఏ ఉద్దేశంతో పిలుస్తున్నారన్నది ముఖ్యం. అయినా ప్రశంసలు తీసుకోవాలా వద్దా? అన్నది వాళ్ల ఇష్టం కదా' అంటూ రిప్లై ఇచ్చింది. ఇది ప్రస్తుతం హైలైట్ అవుతోంది.