ఈ ఇండస్ట్రీలో ఉండలేను.. స్టార్ హీరో వేధింపులతో హీరోయిన్ ఎమోషనల్

భారత్‌లోని ఏ ఇండస్ట్రీ చూసుకున్నా సినీ పరిశ్రమ హీరో కేంద్రంగానే నడుస్తోంది. హీరో కారణంగా సినిమాలు ఆడతాయి.. హీరో కేంద్రంగానే లాభాలు వస్తాయనే కారణంతో ఎవరూ కథానాయకుడిని ఎదిరించే పరిస్థితులు ఉండవు. కథను, దర్శకుడిని, నటీనటులను అవసరమైతే నిర్మాతనైనా మార్చేయగల పవర్ హీరో సొంతం. అలాంటి పరిశ్రమలో హీరోయిన్ల పరిస్ధితి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. హీరోల ఆధిపత్యం, వేధింపుల గురించి గతం నుంచి నేటి వరకు ఎందరో హీరోయిన్లు, నటీనటులు, దర్శకులు సంచలన వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా ఓ సూపర్‌స్టార్‌పై హీరోయిన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

మల్టీటాలెంటెడ్

హర్యాన్వీ, భోజ్‌పురి ఇండస్ట్రీలో హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు అంజలి రాఘవ్. ఢిల్లీలో పుట్టి పెరిగిన ఈ ముద్దుగుమ్మ.. హర్వాన్వీ సినిమాలు, మ్యూజిక్ వీడియోలతో సంచలనం సృష్టించారు. సహజమైన నటనతో పాటు ఆకట్టుకునే అందం, డ్యాన్స్‌లతో యువతకు రోల్ మోడల్‌గా నిలిచారు అంజలి. నటిగానే కాకుండా మోడల్‌గానూ ఆమె పలు టాప్ బ్రాండ్స్‌కు ప్రచారకర్తగా వ్యవహరించారు. చిన్నప్పటి నుంచే డ్యాన్స్, నటనలో ఆసక్తితో కల్చరల్ కార్యక్రమాల్లో స్టేజ్‌పై అద్భుతంగా ప్రదర్శనలు ఇచ్చేశారు. ఈ ఇష్టమే ఆమెను సినీ రంగం వైపు నడిపించింది.

Anjali Raghav Quits Bhojpuri Industry After Super Star Pawan Singh misbehave with her

సోషల్ మీడియాలో ఫాలోయింగ్
రాపర్‌గా హర్యాన్వీ భాషల్లో అంజలి రాఘవ్ చేసిన వీడియోలు, మ్యూజిక్ ఆల్బమ్స్ చార్ట్‌బస్టర్స్‌గా నిలిచాయి. ఈ కారణంగా హర్యానాతో పాటు ఉత్తరాదిలో ఆమె స్టార్‌డమ్ సంపాదించారు. సాలీడ్ బాడీ, మోర్నీ, ఫౌజీ, మేరా బలమ్ థానేదర్, గోలి సాంగ్స్‌తో అంజలి రాఘవ్‌ గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక సోషల్ మీడియాలో ఆమెకు భారీ ఫాలోయింగ్ ఉంది. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో అంజలి రాఘవ్‌కు మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. క్వీన్ ఆఫ్ హర్యాన్వీ మ్యూజిక్ వీడియోస్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు.

అంజలి నడుమును తాకిన పవన్ సింగ్
కాగా.. రెండ్రోజుల క్రితం లక్నోలో సైయా సేవా కరే పాట ప్రమోషన్ కోసం జరిగిన ఓ కార్యక్రమంలో భోజ్‌పురి సూపర్‌స్టార్ పవన్ సింగ్ ఆమెను అనుచితంగా తాకిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ పాట పాడుతుండగా.. అంజలి రాఘవన్ నడుమును పవన్ సింగ్ పదే పదే అసభ్యంగా తాకారు. ఆమె ఇబ్బంది పడుతున్నా పట్టించుకోకుండా తన దారిలో తాను వెళ్లిపోయాడు పవన్ సింగ్. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. పవన్ సింగ్‌పై సినీ ప్రముఖులు, నెటిజన్లు మండిపడ్డారు.

Take a Poll

ఆ ఇండస్ట్రీని వదిలేస్తున్నా
తాజాగా ఈ వివాదంపై అంజలి రాఘవ్ స్పందించారు. పవన్ సింగ్ నా నడుము తాకుతుంటే నేను ఎంజాయ్ చేసినట్లుగా కొందరు కామెంట్స్ పెడుతున్నారని.. నా అనుమతి లేకుండా ఓ పరాయి వ్యక్తి ఇష్టమొచ్చినట్లుగా టచ్ చేస్తే నేను ఆనందిస్తానా? అని అంజలి ప్రశ్నించారు. పవన్ సింగ్ నా నడుమును శుభ్రం చేస్తున్నట్లుగా నటించారని.. తీరా కార్యక్రమం ముగిసిన తర్వాత నా అసిస్టెంట్స్‌ని చూడమని చెప్పగా అక్కడ ఏం లేదని చెప్పారు. దాంతో నాలో నేను కుమలిపోయా.. అనుమతి లేకుండా ఏ ఆడపిల్లను తాకకూడదు, అందుకే ఇకపై భోజ్‌పురి సినిమాల్లో పనిచేయనని అంజలి రాఘవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ పరిణామాలతో అంజలికి పవన్ సింగ్ క్షమాపణలు చెప్పారు.

More from Filmibeat

Read more about: Anjali Raghav Pawan Singh
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X