సారీ తప్పయింది అంటూ పవన్ ఫ్యాన్స్ కి అనుపమ క్షమాపణలు.... అసలు ఏమైందంటే ?

అనుపమ పరమేశ్వరన్ మలయాళ 'ప్రేమమ్' సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో మేరీ జార్జ్ పాత్రలో నటించి ఆమె మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఆ సినిమాలో ఆమె నటన నచ్చిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తన దర్శకత్వంలో నితిన్ హీరోగా తెరకెక్కిన 'అ..ఆ' సినిమాలో మంచి పాత్ర ఇచ్చాడు. ఆ తర్వాత ఈ భామ నాగ చైతన్య హీరోగా నటించిన 'ప్రేమమ్' సినిమాతో పలకరించింది. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది.

ఆ తర్వాత శర్వానంద్ హీరోగా 'శతమానం భవతి' సినిమాతో హ్యాట్రిక్ హిట్ అందుకుంది. అలా మూడు సినిమాలతో హాట్రిక్ హిట్స్ నమోదు చేసిన ఈ భామ.. ఆ తర్వాత మాత్రం పెద్దగా హిట్స్ సాధించలేకపోయింది. ప్రస్తుతం నిఖిల్ సరసన 18 పేజెస్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న ఆమె పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి సారీ చెప్పింది ఆ వివరాల్లోకి వెళితే

హ్యాట్రిక్ హిట్స్ తో

హ్యాట్రిక్ హిట్స్ తో

తెలుగులో వరుస విజయాలతో ఎంట్రీ ఇచ్చిన అనుపమ పరమేశ్వరన్ నటించిన తొలి మూడు సినిమాలు విజయం సాధించాయి. ప్రేమమ్, అ..ఆ.., శతమానం భవతి లాంటి సూపర్ హిట్స్‌తో తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన అనుపమకి ఆ తర్వాత మాత్రం పెద్దగా కలిసి రాలేదు. ఆ తర్వాత ఆమె చేసిన హలో గురు ప్రేమకోసమే, రాక్షసుడు లాంటి సినిమాలు పర్లేదు అనిపించాయి కానీ అనుపమ కెరీర్‌ కి ఉపయోగ పడే సినిమాలు అయితే కాదు. మార్చేసే సినిమాలు మాత్రం కాదు.

గ్లామర్ మీద ఫోకస్

గ్లామర్ మీద ఫోకస్

ఈ మధ్య అవకాశాలు తగ్గడంతో పాటు కాస్త ఇంటి పట్టునే ఉండడంతో గ్లామర్ పెంచడం మీద శ్రద్ధ పెట్టడంతో ఆ గ్లామర్ ను జనానికి చూపించాలని ఆశ పడుతోంది. అందులో భాగంగానే హాట్ ఫోటో షూట్లు చేస్తూ.. అందాలతో రెచ్చిపోతోంది. తాజాగా తమ ఇంటి పక్కన ఉన్న పొలంలో వ్యవసాయం చేస్తున్నానని చెప్పిన ఆమె తానే స్వయంగా తపియోక అనే దుంపల్ని పండించానని చెబుతూ వాటితో ఫోటోలకు పోజులు కూడా ఇచ్చింది ఈ మలయాళీ భామ.

పవన్ ఫ్యాన్స్ కి టార్గెట్

పవన్ ఫ్యాన్స్ కి టార్గెట్

ఆ సంగతులు పక్కన ఈ భామ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి తాజా టార్గెట్ గా మారింది. పెద్ద ఎత్తున వాళ్ళు ట్రోల్ చేస్తుండటంతో దెబ్బకు తప్పు తెలుసుకుని వాళ్ళని క్షమించమని కోరింది. అసలు విషయం ఏమిటంటే ఈ భామ తాజాగా అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయిన వకీల్ సాబ్ సినిమా చూసింది. ఈ సినిమా చూశానని చెబుతూ సినిమా బాగా నచ్చిందని ట్వీట్ చేసింది. పవన్ కళ్యాణ్ చాలా బాగా నటించారు అని అలాగే ముగ్గురు లేడీస్ కూడా బాగా నటించారు అని చెప్పుకొచ్చింది. అంతేకాక ప్రకాష్ రాజ్ లేకపోతే ఈ సినిమా అసంపూర్తిగా ఉంటుందని చెప్పుకొచ్చింది.

సారీ క్షమించండి

సారీ క్షమించండి

అంతా బాగానే ఉంది కానీ ప్రకాష్ రాజ్ ని సార్ అని సంబోధించిన ఆమె పవన్ కళ్యాణ్ ను సార్ అని సంబోధించక పోవడంతో పవన్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. దీంతో ఈ విషయాన్ని గుర్తు చేస్తూ ఆమెకు పెద్ద ఎత్తున కామెంట్స్ పెట్టారు. ఎప్పటికో తప్పు తెలుసుకున్న అనుపమ సారీ చెబుతూ పోస్టులు పెట్టింది. తనకు ఇప్పుడు తప్పు తెలిసిందని క్షమించాలని కోరింది. అలాగే పవన్ కళ్యాణ్ గారు అంటూ కామెంట్ చేసింది. దీంతో పవన్ ఫ్యాన్స్ కూడా పరవాలేదని పెద్దవాళ్ళ గురించి మాట్లాడేప్పుడు గౌరవించి మాట్లాడడం నేర్చుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X