డైరెక్టర్ నన్ను అలా టార్చర్ పెట్టాడు.. అనుపమ పరమేశ్వరన్
యువ హీరో బెల్లంకొండ శ్రీనివాస్, గ్లామర్ క్వీన్ అనుపమ పరమేశ్వరన్ జంటగా యువ దర్శకుడు కౌశిక్ పెగళ్లపాటి రూపొందించిన చిత్రం కిష్కింధపురి. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై యువ నిర్మాత సాహు గారపాటి నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 12వ తేదీన రిలీజ్ అవుతున్నది. శ్రీమతి అర్చన సమర్పణలో రూపొందిన ఈ సినిమాలో హైపర్ ఆది, నెల్లూరు సుదర్శన్, తనికెళ్ల భరణి తదితరులు నటిస్తున్నారు.
హారర్ థ్రిల్లర్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాకు చైతన్ భరద్వాజ్ సంగీతం, చిన్మయ్ సలాస్కర్ సినిమాటోగ్రఫిని, మనీషా ఏ దత్ ప్రొడక్షన్ డిజైనర్‌గా, డీ శివ కామేష్ ఆర్ట్ డైరెక్టర్‌గా, నిరంజన్ దేవరమనే ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సెప్టెంబర్ 3వ తేదీన హైదరాబాద్ ఐమాక్స్ థియేటర్‌లో భారీగా ట్రైలర్‌ను ఆవిష్కరించారు. ఈ వేడుకలో హీరో సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్, సాహు గారపాటి, దర్శకుడు కౌశిక్, మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ..

నాకు చాలా ఇష్టం ఉన్న జానర్ హరర్. అలాంటి జానర్‌తో కథ చెప్పినప్పుడు చాలా ఎక్సైట్ అయ్యాను. నేను 3 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచి హారర్ సినిమాలు చూస్తున్నాను. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత చాలా సంవత్సరాల నుంచి హారర్ జానర్ కథ కోసం వేచి ఉన్నాను. చివరకు కౌశిక్ చెప్పిన కథ నాకు చాలా ఎక్సైట్ అయింది. ఆయన చెప్పిన కథ నాకు అర్ధం కాలేదు. కథ చెప్పిన విధానం బాగా నచ్చింది. మీకు వీలైతే డైలాగ్స్ అర్ధం చేసుకోవడానికి డిక్షనరీ తీసుకెళ్లండి అని అనుపమ అన్నారు.
దర్శకుడు కౌశిక్‌తో పనిచేయడం చాలా నైస్ అనిపించింది. క్లైమాక్స్‌లో నా పాత్రను డిజైన్ చేసిన విధానం బాగుంది. ఆయనకు కథపై, తీయబోయే సినిమాపై ఫుల్ క్లారిటీ ఉంది. ప్రేక్షకుడికి ఏం కావాలో ఆ విషయాన్ని సినిమా ద్వారా అందిస్తున్నాం. డైలాగ్స్ చెప్పే విషయంలో డబ్బింగ్ థియేటర్‌లో టార్చర్ పెట్టాడు. సరైన రీతిలో డైలాగ్స్ నాతో కష్టపడి చెప్పించాడు. నిర్మాత సాహు గారితో ఇంతకు ముందు ఒక సినిమా చేశాను. మళ్లీ రెండో సినిమా చేయడం హ్యాపీగా ఉంది అని అనుపమ అన్నారు.
కిష్కింధపురి సినిమాలో నేను దెయ్యంగా కనిపించబోతున్నాను. ఆ విషయం దర్శకుడు రివీల్ చేసినప్పుడు.. చాలా ఎక్సైట్ అయ్యాను. నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అవకాశం నా ముందుకు వచ్చిందా? అనే ఫీలింగ్ కలిగింది. ఉదయం లేవగానే.. మా అమ్మ నన్ను దెయ్యంలా ఉన్నావని తిట్టేది. అది ఈ పాత్రకు రిలేట్ అయింది. దెయ్యం పాత్రకు చాలా కరెక్ట్‌గా సరిపోతాను. నాకు ఇలాంటి పాత్రలు ఎందుకు రావడం లేదోనని అన్నారు.
అనుపమ పరమేశ్వరన్ సినిమా కెరీర్ విషయానికి వస్తే.. ఇటీవల జానకీ వెడ్స్ కేరళ స్టేట్, పరదా చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తాజాగా కిష్కింద పురి సినిమాలో ఓ డిఫరెంట్ క్యారెక్టర్‌ను పోషిస్తున్నారు. ఈ చిత్రంలోని పాత్ర అందరికి నచ్చుతుంది అని అనుపమ పరమేశ్వరన్ తెలిపారు.


Click it and Unblock the Notifications











