Anushka Shetty: డిజాస్టర్‌గా ఘాటి.. ఇక సెలవు అంటూ అనుష్క శెట్టి షాకింగ్ డెసిషన్

అనుష్క శెట్టి.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లేడీ ఓరియెంటెడ్ సినిమాకు కేరాఫ్ అడ్రస్‌గా, లేడీ సూపర్‌స్టార్‌గా వెలుగొందుతున్నారు. కొన్ని కారణాలతో ఆమె సినిమాలు చేయకున్నప్పటికీ స్వీటీ శెట్టి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. లాంగ్ గ్యాప్ తర్వాత అనుష్క నటించిన మూవీ ఘాటి. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అనుష్క కెరీర్‌లోనే భారీ డిజాస్టర్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో స్వీటీ శెట్టి సంచలన నిర్ణయం తీసుకున్నారు.

ఘాటి బడ్జెట్ ఎంత?
అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు జంటగా క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ఘాటి. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో నిర్మాతలు రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడిలు ఈ చిత్రాన్ని నిర్మించారు. జగపతి బాబు, చైతన్యరావు, జిషుసేన్ గుప్తా, జాన్ విజయ్, వీటీవీ గణేష్, రాజు సుందరం తదితరులు ఘాటిలో కీలకపాత్ర పోషించారు. సెప్టెంబర్ 5న ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నటీనటులు, టెక్నీషియన్ల రెమ్యునరేషన్లు, ప్రచార ఖర్చులను కలుపుకొని ఘాటి సినిమాకు రూ.50 కోట్ల వరకు బడ్జెట్ అయ్యిందని ఫిలింనగర్ వర్గాలు తెలిపాయి.

Anushka Shetty Announces Break From Social Media after Ghaati Result

ఘాటి ప్రీ రిలీజ్ బిజినెస్
చాలా కాలం తర్వాత అనుష్క శెట్టి నటించడంతో ఘాటిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దాంతో ఈ మూవీకి ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్‌లో జరిగింది. నైజాంలో రూ.8 కోట్లు, ఆంధ్రా నుంచి రూ.10 కోట్లు, సీడెడ్‌లో రూ.5 కోట్లు, తమిళనాడులో రూ.9 కోట్లు, కర్ణాటక + కేరళలో రూ.5 కోట్లు, హిందీ బెల్ట్ లో రూ.5 కోట్లు చొప్పున ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అటు ఓవర్సీస్ రైట్స్‌ ద్వారా రూ.10 కోట్ల వ్యాపారమైందని ట్రేడ్ నిపుణులు వెల్లడిస్తున్నారు. దాంతో కలిపి వరల్డ్ వైడ్ గా ఘాటికి రూ.52 కోట్లు మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని కోలీవుడ్ వర్గాలు వెల్లడించాయి. ఘాటి లాభాల్లోకి రావాలంటే రూ.55 కోట్ల డిస్ట్రిబ్యూషన్ షేర్, రూ.110 కోట్ల గ్రాస్ వసూల్ చేయాలని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు.

ఘాటి కలెక్షన్స్
ఎన్నో అంచనాల మధ్య రిలీజైన ఘాటి.. కలెక్షన్ల వేటలో మాత్రం వెనుకబడింది. క్రమం తప్పకుండా కలెక్షన్స్ కోల్పోతూ.. దారుణ పరాజయాన్ని మూటకట్టుకుంది. తొలి రోజున 2 కోట్ల రూపాయలు, రెండో రోజున 1.74 కోట్లు, మూడో రోజున 1.15 కోట్లు, నాలుగో రోజున 65 లక్షలు, ఐదో రోజున 58 లక్షలు, ఆరో రోజున 27 లక్షల రూపాయలు మాత్రమే రాబట్టింది. మొత్తంగా ఇండియా వైడ్ 6.39 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 2 కోట్ల రూపాయలు చొప్పున 8.50 కోట్ల రూపాయలు మాత్రమే రాబట్టింది. కనీసం 10 కోట్ల రూపాయలు కూడా వసూలు చేయలేక చేతులెత్తేసి భారీ నష్టాలను మిగిల్చింది.

ఇక గుడ్‌బై అంటూ పోస్ట్
ఒకప్పుడు అరుంధతి, భాగమతి, బాహుబలి వంటి సినిమాలతో కలెక్షన్ల వర్షం కురిపించిన అనుష్క శెట్టికి ఇటీవల కలిసి రావడం లేదు. నిశ్శబ్ధం, సైజ్ జీరో, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి తదితర చిత్రాలు డిజాస్టర్లుగా నిలిచాయి. ఇప్పుడు అనుష్క ఎన్నో ఆశలు పెట్టుకున్న ఘాటి చిత్రం కూడా అట్టర్ ఫ్లాప్ అవ్వడంతో జేజేమ్మ బాగా మనస్తాపానికి గురయ్యారు. అనుష్క ప్రాణం పెట్టి నటించినా ఘాటి మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో అనుష్క సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ఓ లెటర్ రాసి పోస్ట్ పెట్టారు.

అందులో ఏముందంటే.. నేను కొంతకాలం సోషల్ మీడియాకు దూరంగా ఉండాలనుకుంటున్నా, స్కోలింగ్‌కు విరామం ప్రకటించి లోకంతో కనెక్ట్ కావాలని అనుకుంటున్నాను, ఎందుకంటే మన నిజమైన ప్రపంచం అదే.. త్వరలోనే మీతో మరిన్ని విషయాలు పంచుకుంటానని అనుష్క రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఇప్పటికే సినిమాలకు, సినిమా ప్రమోషన్లకు దూరంగా ఉంటున్న అనుష్క, ఇకపై సోషల్ మీడియాకు కూడా దూరంగా ఉంటే ఎలా? అని ఆమె అభిమానులు నిరుత్సాహపడుతున్నారు.

More from Filmibeat

Read more about: anushka shetty ghaati prabhas
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X