‘సహజీవనం చేస్తే తప్పేంటి? పెళ్లి చేసుకోకుండా శృంగారం అలా..’
TikTok star Bhanu: యంగ్, ఎనర్జిటిక్ అండ్ టాలెంటెడ్ భాను. సోషల్ మీడియా ప్రపంచంలో స్టార్‌డమ్ అందుకున్న పేరు. టిక్‌టాక్ ద్వారా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించిన ఈ ముద్దుగుమ్మ, తన స్పెషల్ ఎక్స్ప్రెషన్స్, ఫన్నీ వీడియోలతో నెట్టింటిని ఏలేస్తుంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లలో భారీ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్న భాను.. ఇప్పుడు చిన్న తెరపై కూడా తన మార్క్ వేసింది. టిక్‌టాక్ స్టార్‌గా వెలుగొందిన భాను, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా దూసుకెళ్లింది. ఆ క్రేజ్‌నే పునాదిగా చేసుకొని, తెలుగు టీవీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. జబర్దస్త్ వంటి పాపులర్ కామెడీ షోలో హైపర్ ఆది టీమ్‌తో కలిసి పలు స్కిట్లలో మెరిసింది.
సోషల్ మీడియా నుంచి టీవీ దాకా భాను జర్నీ ఇప్పుడు యువతలో ఇన్‌స్పిరేషన్‌గా నిలుస్తోంది. తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్, సరదా టైమింగ్, డాన్స్ మూవ్స్‌తో భాను టీవీ ప్రేక్షకుల్లో కూడా పాపులర్ అయింది. రీల్స్‌తోనే పాపులారిటీ పేరు తెచ్చుకున్న ఈ యంగ్ ఇన్‌ఫ్లుయెన్సర్ ఇప్పుడు సినిమా అవకాశాలతో కూడా బిజీగా ఉన్నారు. తాజాగా భాను, ప్రముఖ యూట్యూబ్ షో 'బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్'(Big TV Kissik Talks) కార్యక్రమానికి హాజరైంది. తన జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలతో పాటు సహజీవనంపై భాను షాకింగ్ కామెంట్స్ చేసింది.

కిస్సిక్ టాక్స్ కార్యక్రమంలో యాంకర్ వర్ష అడిగిన "లివింగ్ రిలేషన్‌పై నీ అభిప్రాయం ఏంటి?" అనే ప్రశ్నకు భాను ఇచ్చిన సమాధానం అందరినీ ఆకట్టుకుంది. "లివింగ్ రిలేషన్షిప్ అనేది ఎవరి ఇష్టం వారిది. నేను దాన్ని తప్పు అని అనను. ఇద్దరూ స్ట్రాంగ్‌గా, మేచ్యూర్‌గా ఉండి బాగుంటే ఎలాంటి సమస్యా ఉండదు. కానీ దాన్ని లైట్‌గా తీసుకుంటే మాత్రం డేంజర్," అని చెప్పింది. ఆమె ఇంకా మాట్లాడుతూ "అలా ఉండాలనుకునేవారి ఇష్టం. కానీ నాకు మాత్రం అలా ఉండటం ఇష్టం లేదు. లివింగ్ రిలేషన్ తప్పు కాదు... కానీ ఇద్దరూ 'ఇప్పటికైనా ఈ అమ్మాయినే పెళ్లి చేసుకుంటా', 'ఈ అబ్బాయినే పెళ్లి చేసుకుంటా' అనే క్లారిటీతో సహజీవనం చేస్తే బాగుంటుంది," అని తన స్పష్టమైన అభిప్రాయాన్ని వెల్లడించింది.
ప్రతి మనిషికి తోడు కావాలి
ఇక భాను తన వ్యక్తిగత జీవితంపై కూడా బహిరంగంగా మాట్లాడారు. "ఈ రోజుల్లో చాలా మంది సింగిల్‌గా బ్రతకాలని ఫీలవుతున్నారు. కానీ నాకు మాత్రం ప్రతి మనిషికి తోడు కావాలని అనిపిస్తుంది. పెళ్లి తర్వాత చిన్న చిన్న గొడవలు వస్తాయి, కానీ వాటిని మర్చిపోతేనే రిలేషన్ నిలుస్తుంది" అని తెలిపారు. తానూ గత పది సంవత్సరాలుగా ఒక వ్యక్తితో రిలేషన్‌లో ఉన్నట్లు వెల్లడించారు. "మా మధ్య కూడా గొడవలు వస్తాయి, కానీ మరుసటి రోజు వాటిని మర్చిపోతాం. అదే మా బలమైన బంధానికి కారణం" అని భాను చెప్పిన మాటలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
భాను చేసిన ఈ వ్యాఖ్యలు ముఖ్యంగా 'సహజీవనం 'పై సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. "భాను స్పీడ్ చూసి వర్ష కూడా షాక్ అయింది!" అంటూ అభిమానులు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ఇక భాను లుక్, మాటతీరు, సింపుల్‌గా కానీ స్ట్రైట్‌గా చెప్పే స్టైల్ ఇవన్నీ ఆమె అభిమానులను మరింత ఆకర్షిస్తున్నాయి. ఈ కిసిక్ టాక్స్ ఎపిసోడ్ ప్రస్తుతం యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్‌తో దూసుకుపోతోంది.


Click it and Unblock the Notifications











