బిగ్ బాస్ లోకి పవన్ హీరోయిన్.. క్లారిటీ ఇచ్చేసిందిగా!
బుల్లితెర ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిన బిగ్ బాస్ షో ప్రారంభించడానికి అన్ని భాషల నిర్వాహకులు ఇప్పటి నుంచే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇప్పటికే తెలుగు బిగ్ బాస్ ఇంటర్వ్యూలు జరుగుతున్నాయనే ప్రచారం జరుగుతున్న సంగతి కూడా తెలిసిందే. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు సల్మాన్ హోస్ట్ గా నిర్వహిస్తున్న హిందీ బిగ్ బాస్ తదుపరి సీజన్ కోసం పవన్ కళ్యాణ్ సరసన ఖుషి సినిమాలో నటించి తర్వాత స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగిన భూమిక చావ్లాను సంప్రదించారని ప్రచారం మొదలయింది. దానికి ఆమె ఒప్పుకుందని కూడా ప్రచారం సాగింది.
అయితే గత రెండు, మూడు రోజుల నుంచి జరుగుతున్న ఈ ప్రచారానికి ఆమె తన సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు. తనకు బిగ్ బాస్ లో ఆఫర్ ఇచ్చారు అన్న సంగతి నిజం కాదని ఆమె చెప్పుకొచ్చారు, ఒకవేళ ఆఫర్ ఇచ్చినా తాను చేయనని ఆమె పేర్కొన్నారు. బిగ్ బాస్ సీజన్ వన్ మొదలు 2,3 సీజన్ లు సహా మరికొన్ని సార్లు తనను బిగ్ బాస్ వాళ్ళు సంప్రదించారని, అయితే ఎన్నిసార్లు సంప్రదించినా తాను దానికి ఒప్పుకోలేదు అని చెప్పుకొచ్చింది. అయితే ప్రచారం జరుగుతున్నట్లు ఈసారి మాత్రం తనను వాళ్లు సంప్రదించలేదని ఒకవేళ సంప్రదించినా చేయనని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.

తాను సెలబ్రిటీ నే కానీ 24 గంటలు తన మీద కెమెరాలు ఉంటే తాను తట్టుకోలేనని, తాను చాలా ప్రైవేట్ పర్సన్ అని ఆమె చెప్పుకొచ్చింది. ఇక ఈ భామ ప్రస్తుతం 2 తెలుగు సినిమాలో కీలక పాత్రలలో నటిస్తోంది. గోపీచంద్ హీరోగా తమన్నా హీరోయిన్ గా తెరకెక్కుతున్న సీటి మార్ అనే సినిమాలో గోపీచంద్ అక్క పాత్రలో ఆమె నటిస్తోంది. అలాగే బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న అఖండ అనే సినిమాలో కూడా ఆమె కీలక పాత్రలో నటిస్తోంది. ఈ రెండు సినిమాలు కరోనా కారణంగా లేటుగా రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











