For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఐటమ్ గర్ల్‌గా మారిన బిగ్ బాస్ బ్యూటీ: ఇద్దరు కుర్ర హీరోలను మెప్పించేందుకే ఇలా.!

  |

  బిగ్గెస్ట్ రియాలిటీ షోగా పరిచయమై తెలుగులో ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది బిగ్ బాస్ షో. దీని వల్ల ఎంతో మంది చిన్న చిన్న ఆర్టిస్టులు బిజీ స్టార్లుగా మారిపోయారు. అందుకే ఈ షో అంటే ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపిస్తున్నారు. ఇలా ఈ షో ద్వారా ఎనలేని క్రేజ్‌ను సంపాదించుకుని, వరుస ఆఫర్లు దక్కించుకుంటున్న వారిలో నందినీ రాయ్ ఒకరు. బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఎన్నో ఆఫర్లు అందిపుచ్చుకున్న ఈ బ్యూటీ.. బాలీవుడ్‌లోకి సైతం అడుగుపెట్టింది. అయితే, ఊహించని విధంగా ప్రస్తుతం ఐటమ్ గర్ల్‌గా మారిపోయింది. అసలేం జరిగింది.? పూర్తి వివరాల్లోకి వెళ్తే...

  మిస్ ఆంధ్రా.... దేశ వ్యాప్తంగా గుర్తింపు

  మిస్ ఆంధ్రా.... దేశ వ్యాప్తంగా గుర్తింపు

  నందినీ రాయ్.. చదువుకుంటోన్న సమయంలోనే మోడల్‌‌గా కెరీర్‌ను ఆరంభించింది. ఆ సమయంలోనే మిస్ ఆంధ్రా పోటిల్లో పాల్గొని విజేతగా నిలిచింది. దాని తర్వాత ఎన్నో షోలలో ర్యాంప్ వాక్ చేసింది. దాని ద్వారా వచ్చిన ఫాలోయింగ్‌తో ఎన్నో ప్రపంచ స్థాయిలో సంస్థల వ్యాపార ప్రకటనల్లో నటించింది. దీని ద్వారా దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ స్థాయిలో గుర్తింపు అందుకుంది.

  బాలీవుడ్‌ నుంచే పరిచయమైన బ్యూటీ

  బాలీవుడ్‌ నుంచే పరిచయమైన బ్యూటీ

  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అమ్మాయే అయినా.. మోడల్‌గా నందినీ రాయ్‌కు ఉత్తరాదిన మంచి ఆదరణ లభించింది. దీంతో బాలీవుడ్‌లోనే అవకాశం కూడా వచ్చింది. ఈ క్రమంలోనే ‘ఫ్యామిలీ ప్యాక్' అనే హిందీ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘మాయ' అనే సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంటర్ అయింది. ఈ క్రమంలోనే ‘మోసగాళ్లకు మోసగాడు', ‘సిల్లీ ఫెలోస్' వంటి చిత్రాల్లో నటించింది.

  బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ.... పెరిగిన క్రేజ్

  బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ.... పెరిగిన క్రేజ్

  కొన్ని సినిమాలు మాత్రమే చేసిన నందినీ రాయ్.. అవకాశాల కోసం అన్వేషిస్తోన్న సమయంలో బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. రెండో సీజన్‌లో స్పెషల్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆమె.. క్యూట్‌గా కనిపిస్తూ ఆకట్టుకుంది. అదే సమయంలో మంచి ఆటతీరుతో ప్రేక్షకుల నుంచి మార్కులు పొందింది. చివరి వరకూ ఉండలేకపోయినా... క్రేజ్‌ను మాత్రం పెంచుకోగలిగింది.

  అక్కడ హల్‌చల్.. కాస్టింగ్ కౌచ్‌తో రచ్చ

  అక్కడ హల్‌చల్.. కాస్టింగ్ కౌచ్‌తో రచ్చ

  బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత నందినీ రాయ్ సోషల్ మీడియాలో యమ యాక్టివ్ అయిపోయింది. తరచూ హాట్ ఫొటోషూట్లతో హల్‌చల్ చేసింది. ఈ క్రమంలోనే బాలీవుడ్‌లో సినిమా ఛాన్స్ కూడా పట్టేసింది. ఇదిలాఉండగా... ఆ మధ్య జరిగిన ఓ ఇంటర్వ్యూలో కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ.. ఓ టాలీవుడ్ డైరెక్టర్‌పై సంచలన వ్యాఖ్యలు చేసి కలకలం రేపింది.

  ఐటమ్ గర్ల్‌గా మారిన బిగ్ బాస్ బ్యూటీ

  ఐటమ్ గర్ల్‌గా మారిన బిగ్ బాస్ బ్యూటీ

  తెలుగులో అవకాశాలు తక్కువగా వచ్చినా.. మిగిలిన భాషల్లో మాత్రం ఛాన్స్‌లు పట్టేసింది నందినీ రాయ్. ఇందులో భాగంగానే కొన్ని వెబ్ సిరీస్‌లలో సైతం నటిస్తోంది. అయితే, హీరోయిన్‌గా అవకాశాలు సన్నగిల్లడంతో సపోర్టింగ్ క్యారెక్టర్లు సైతం చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఈ హైదరాబాదీ హీరోయిన్.. ఓ మల్టీస్టారర్ మూవీ కోసం ఐటమ్ గర్ల్‌గా మారిపోయింది.

  #Watch : Hero Simbu New Look In ATMAN Movie
  కుర్ర హీరోలను మెప్పించేందుకే ఇలా.!

  కుర్ర హీరోలను మెప్పించేందుకే ఇలా.!

  నేషనల్ అవార్డు గ్రహీత సతీష్ వేగేశ్న తెరకెక్కిస్తోన్న తాజా చిత్రం ‘కోతి కొమ్మచ్చి'. ఈ సినిమా ద్వారా తన కొడుకు సమీర్‌ను హీరోగా పరిచయం చేస్తున్నాడు. ఇందులో మరో హీరోగా శ్రీహరి కుమారుడు మేఘాంశ్ కూడా నటిస్తున్నాడు. పల్లెటూరి బ్యాగ్‌డ్రాప్‌తో రాబోతున్న ఈ మూవీలో నందినీ స్పెషల్ సాంగ్ చేయబోతుంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది.

  English summary
  Nandini Rai, formerly known as Neelam Gouhrani, is a Tollywood film actress, model and the winner of the Miss Andhra Pradesh title of 2010. After modelling, she went to pursue a career in acting.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X