Don't Miss!
- News
ఆ ఉద్యోగ నేతపై జగన్ సర్కార్ ఆరా ? గవర్నర్ అపాయింట్ మెంట్ వెనుక ఎవరు ?
- Automobiles
స్టీరింగ్ వీల్ కలిగిన మోడిఫైడ్ స్కూటర్: ఇది సృజనాత్మకత అవునో, కాదో.. మీరే చెప్పాలి
- Sports
పట్టువీడని రెజ్లర్లు.. డబ్ల్యూఎఫ్ఐ పదవికి బ్రిజ్ భూషణ్ సింగ్ రాజీనామా!
- Finance
FD Maturity Rules: మారిన ఫిక్స్డ్ డిపాజిట్ రూల్స్.. తెలుసుకోకపోతే నష్టపోతారు.. RBI ప్రకారం
- Lifestyle
బుద్ధుడి విగ్రహాన్ని ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు, వాస్తు ప్రకారం ఎక్కడ ఉంచాలంటే
- Technology
Apple ఫోన్లు ,ల్యాప్ టాప్ లు ,ఇతర గాడ్జెట్లపై భారీ ఆఫర్లు! ఆఫర్ల వివరాలు!
- Travel
జ్ఞానోదయ యాత్రకు కేంద్రాలు.. ఏపీలోని ఈ నాలుగు బౌద్ధ క్షేత్రాలు!
Inaya Sulthana పడక గదిలోకి వస్తే ఆఫర్.. ఆ స్టార్ హీరో మూవీలో వేషం వదులుకొన్నా.. ఇనయా సుల్తానా
తెలుగు మీడియాలోను, సోషల్ మీడియాలోను బాగా పాపులర్ అయిన సెలబ్రిటీ ఎవరైనా ఉన్నారంటే అది ఇనయా సుల్తానా గురించి చెప్పుకోవాల్సిందే. బిగ్‌బాస్ తెలుగు 6 రియాలిటీ షోలో గత 13 వారాలపాటు ఫైర్ బ్రాండ్‌గా నిలిచిన ఇనయా చివరి వారంలో షో నుంచి ఎలిమినేట్ అయింది. అయితే ఆమెను అన్యాయంగా ఎలిమినేట్ చేశారనే విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే బిగ్‌బాస్ తెలుగు 6 నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇనయా సుల్తానా మీడియాతో టాలీవుడ్‌లో తనకు జరిగిన చేదు అనుభవాలను వెల్లడిస్తూ..

ఆర్జీవి పార్టీలో డ్యాన్స్‌తో
ఇక ఇనయా సుల్తానా పేరు బిగ్‌బాస్‌కు పెద్దగా తెలియదనేది అందరికి తెలిసిందే. రాంగోపాల్ వర్మతో ఓ పార్టీలో వేసిన డ్యాన్స్‌తో ఇనయా పేరు సోషల్ మీడియాలో మార్మోగింది. ఇనయాను ముద్దు పెడుతూ వర్మ చేసిన అసభ్యకరమైన డ్యాన్స్ సోషల్ మీడియా, యూట్యూబ్‌లో వైరల్ అయింది. దాంతో ఇనయా ఓవర్‌నైట్ సెలబ్రిటీగా మారిపోయింది. దాంతో బిగ్‌బాస్ తెలుగు 6 అవకాశాన్ని దక్కించుకొన్నది.

బిగ్‌బాస్ నుంచి వివాదాస్పదంగా అవుట్
బిగ్‌బాస్ తెలుగు 6లో టాప్ 2 కంటెస్టెంట్‌గా భావిస్తున్న నేపథ్యంలో ఇనయా సుల్తానాను షో నుంచి ఎలిమినేట్ చేయడంపై భారీగా నిరసన వ్యక్తమైంది. Inaya Unfair Elimination అనే హ్యాష్ ట్యాగ్‌తో భారీగా ట్రెండింగ్ అయింది. ఆమె షోలో నుంచి బయటకు వచ్చి విజేతగా నిలువకపోయినా వీక్షకుల హృదయాల్లో విజేతగా నిలిచింది అంటూ నైతికంగా మద్దతు ఇచ్చారు.

ప్రముఖ హీరో సినిమాలో ఆఫర్
అయితే బిగ్‌బాస్ తెలుగు 6 నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇనయా సుల్తానా టాలీవుడ్‌లో ఎదురైన అనుభవాలను బయటపెట్టింది. ఓ ప్రముఖ నటుడి సినిమాలో వేషం కోసం నన్ను ఆడిషన్ చేశారు. సెలక్షన్ చేసే సమయంలో వారి ప్రవర్తన అనుమానాస్పదంగా మారింది. వారి మాటలు కూడా నాకు పలు రకాల అనుమానాలు రేకెత్తించాయి. దాంతో నాలో చాలా ఆందోళన కలిగింది.

కమిట్‌మెంట్ ఇస్తావా? ఆఫర్ ఇస్తాం అంటూ
అయితే ఆడిషన్ సమయంలో నిర్మాతకు సంబంధించిన కొందరు నాతో వ్యవహరించిన తీరుతో నేను ఒపెన్ అయ్యాను. మీరు కమిట్‌మెంట్ ఇస్తేనే.. ఆఫర్ ఇస్తారా అని అడిగితే.. అవును అని సమాధానం చెప్పారు. దాంతో వారి ఆఫర్‌ను రిజెక్ట్ చేసి ఆ సినిమా అవకాశాన్ని వదులుకొన్నాను. కమిట్‌మెంట్ మిగితా వారికి సాధారణమే కావొచ్చు. నాకు మాత్రం అది నార్మల్ కాదు అని ఇనయా సుల్తానా చెప్పారు.

పడక గదిలోకి వస్తావా? అంటూ
టాలీవుడ్‌లో నాకు మరోసారి అదే అవమానం ఎదురైంది. మరో సినిమా ఆఫర్ కోసం వెళితే.. అక్కడ కూడా అదే తీరు. అయితే పడకగదిలోకి వస్తే.. ఆఫర్ ఇస్తామని చెప్పడంతో నేను ఆ సినిమాను కూడా వదులుకొన్నాను. అలా నా కెరీర్‌లో రెండో అవకాశం కూడా చేజారింది అని ఇనయా సుల్తానా అన్నారు.

అడ్డదార్లు తొక్కి సంపాదించను
సినిమా పరిశ్రమలో చాలా మంది పబ్‌లు, బార్లు, రెస్టారెంట్లో జరిగే సోషల్ మీటింగ్‌తోనే అవకాశాలు సంపాదించుకొంటారు. కానీ నేను అలాంటి వాటికి వ్యతిరేకం. నా ప్రతిభను చూసి అవకాశం ఇస్తే.. అది నాకు గొప్పగా భావిస్తాను. అడ్డదార్లు తొక్కి ఆఫర్లు సంపాదించడం నా వల్ల కాదు అని ఇనయా సుల్తానా చెప్పారు.