‘నా కంటే వయసులో చిన్నవాడైనా సరే.. దానికి నేను రెడీ’
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అమీశా పటేల్ నార్త్ ఇండియాలో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. 25 ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ వస్తోంది. బాలీవుడ్ తో పాటు టాలీవుడ్, కోలీవుడ్ చిత్రాల్లో నటించి మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. స్టార్ హీరోయిన్ గా తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది. తెలుగులో తొలుత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసర బద్రి చిత్రంలో నటించి మెప్పించింది. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది.
అంతకంటే ముందే అమీశా పటేల్ 2000లో రొమాంటిక్ థ్రిల్లర్ కహో నా ప్యార్ హైతో హీరోయిన్ గా చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా కూడా భారీ విజయాన్ని అందించింది. అలా తన ఎంట్రీలోనే దుమ్ములేపింది. ఇక తన కెరీర్ లో 40 చిత్రాల్లో నటించింది. కాగా అమీశా పటేల్ గుజరాతీ ఫ్యామిలీలో పుట్టి పెరిగింది. 1975 జూన్ 9న పుట్టిన అమీశా పటేల్ తన 25వ ఏటా హీరోయిన్ గా ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. అప్పటి నుంచి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూనే వస్తోంది.

ఇక అమీశా పటేల్ తన మొదటి చిత్రం దర్శకుడితోనే డేటింగ్ ప్రారంభించినట్టు ప్రచారం జరిగింది. ఆ తర్వాత తన సొంత తండ్రిపైనా కూడా కేసు ఫైల్ చేసి వార్తల్లో నిలిచింది. ఇలా పలు సందర్భాల్లో అమీశా పటేల్ ఏదో రకంగా హెడ్ లైన్స్ లో ఉంటూనే ఉంది. ఇక తాజాగా యంగ్ ఏజ్ వారితో డేటింగ్ పై ఆసక్తికరంగా స్పందించింది. రీసెంట్ ఇంటర్వ్యూలో తన గురించి పీపుల్ ఎలా ఆలోచిస్తున్నారో తెలియజేసే ప్రయత్నం చేసింది.
తను మాట్లాడుతూ.. 'నా వయస్సులో సగం ఉన్న వ్యక్తులు కూడా నాతో డేటింగ్ వెళ్లాలని ఆశిస్తున్నారు. ఈ విషయంలో నేను సిద్ధంగానే ఉంటానని చెబుతాను. ఎందుకంటే అలాంటి పురుషులు మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉంటారు.' అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఆమె కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె చెప్పినట్లు తెలుస్తోంది. మొత్తానికి ఆమె కామెంట్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఇక అమీశా పటేల్ ప్రస్తుతం బ్యాచిలర్ గానే లైఫ్ ను లీడ్ చేస్తోంది. తన వయస్సు 50 ఏళ్లకు దాటినా ఒంటరి జీవితాన్నే గడిపేస్తోంది. కెరీర్ లో మాత్రం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది. చివరిగా గదర్ 2 బాలీవుడ్ చిత్రంతో భారీ విజయాన్ని అందుకుంది. తెలుగులో అమీశా పటేల్ బద్రి, సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన నాని చిత్రం, నందమూరి బాలకృష్ణ సరసన నర్సింహుడు అనే చిత్రంలో నటించి మెప్పించింది. తెలుగు ప్రేక్షకులకు మరింతగా దగ్గరైంది.


Click it and Unblock the Notifications











