For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Kareen Kapoor top controversies.. ఎవరితో అఫైర్, ఎవరితో డేటింగ్.. సైఫ్‌‌తో పెళ్లి తర్వాత ఆస్తి ఎంతంటే?

  |

  బాలీవుడ్ అగ్రతార కరీనాకపూర్ మరోసారి వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. తన రెండో కుమారుడికి జహంగీర్ అనే పేరు పెట్టుకోవడంపై దేశవ్యాప్తంగా నెటిజన్లు భగ్గుమంటున్నారు. తన మొదటి కుమారుడికి తైమూర్ అని పేరు పెట్టుకొన్న నేపథ్యంలో కూడా ఆమె వివాదంలో చిక్కుకున్నారు. అయితే గతంలోని కరీనా కపూర్ వివాదాలు ఏమిటి?, అలాగే సైఫ్ ఆలీ ఖాన్‌ను పెళ్లి చేసుకొన్న తర్వాత ఆమె ఆస్తుల వివరాలు ఎంతనే వివరాల్లోకి వెళితే..

  Kareena Kapoor Khan రెండో కొడుకు పేరు వివాదంగా.. ఏం పేరు పెట్టారు? ఎందుకు ట్రెండ్ అవుతున్నదంటే?

  షాహీద్ కపూర్‌తో అఫైర్

  షాహీద్ కపూర్‌తో అఫైర్

  బాలీవుడ్‌లో కెరీర్ ఆరంభించిన సమయంలో హీరో షాహీద్ కపూర్‌తో కరీనా కపూర్ అఫైర్ ప్రధానంగా వినిపించింది. వారిద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయి డేటింగ్ చేశారు. అయితే పెళ్లి చేసుకొనేంత వరకు వెళ్లిన వీరిద్దరి రిలేషన్ మధ్యలోనే బ్రేక్ అయింది. అయితే ఆ సమయంలో కరీనా, షాహిద్‌ కపూర్‌కు సంబంధించిన ఎంఎంఎస్ వీడియో వైరల్ కావడం వివాదంగా మారింది. వారిద్దరూ గాఢంగా, అతి సన్నిహితంగా లిప్‌లాక్ చేసుకోవడం చర్చనీయాంశమైంది.

   హృతిక్ రోషన్‌తో డేటింగ్

  హృతిక్ రోషన్‌తో డేటింగ్

  షాహీద్ కపూర్ తర్వాత బాలీవుడ్ కండల వీరుడు హృతిక్ రోషన్‌తో సన్నిహితంగా ఉండటం, డేటింగ్ చేస్తున్నారనే విషయం మీడియాలో హైలెట్ అయింది. వారిద్దరూ కభీ కుషీ కభీ ఘమ్ సినిమా సందర్భంగా ఒకరికొకరు చేరువయ్యారనే విషయం మీడియాలో చర్చనీయాంశమైంది. అయితే హృతిక్‌తో అఫైర్ అంటూ వచ్చిన వార్తలను కరీనా ఖండించింది. తాను పెళ్లి అయిన వ్యక్తిని వివాహం చేసుకొనని క్లారిటీ ఇచ్చింది. చివరకు అప్పటికే వివాహమైన సైఫ్ ఆలీ ఖాన్‌ను పెళ్లి చేసుకోవడం తెలిసిందే.

   ప్రియాంక, బిపాసాతో గొడవలు

  ప్రియాంక, బిపాసాతో గొడవలు

  ఇక బాలీవుడ్‌లో తోటి హీరోయిన్లతో కరీనా కపూర్ గొడవలు పడటం మరో వివాదంగా మారింది. ప్రియాంక చోప్రా, బిపాసా బసుతో గొడవలు మీడియాలో పతాక శీర్షికలను ఆకర్షించాయి. కాఫీ విత్ కరణ్ షోలో ప్రియాంక మాట్లాడే తీరు, భాష గురించి కామెంట్ చేసింది. దాంతో కరీనా వ్యాఖ్యలు తీసుకొన్న ప్రియాంక.. నేను, సైఫ్ ఒకే ప్రాంతం నుంచి వచ్చామని ఘాటుగా జవాబిచ్చింది. ఇక బిపాసా బసుతో అజ్నబీ సినిమా షూటింగ్‌లో కరీనాకపూర్‌కు వాగ్వాదం జరిగింది. బిపాసా శరీర రంగును టార్గెట్ చేస్తూ.. నల్ల పిల్లి అంటూ కామెంట్ చేసింది. బిపాసా, కరీనా మధ్య భారీగా వాగ్వాదం చోటుకోవడం తెలిసిందే.

  కొడుకుకు తైమూర్‌ పేరుతో వివాదంలోకి

  కొడుకుకు తైమూర్‌ పేరుతో వివాదంలోకి

  అలాగే చోటా నవాబ్ సైఫ్ ఆలీ ఖాన్‌‌ను వివాహం చేసుకోవడం ఓ వివాదంగా మారితే.. ఆ తర్వాత తన కుమారుడికి తైమూర్ అని పేరు పెట్టుకోవడం మరో వివాదంగా మారింది. అయితే దేశంపై దండెత్తిన ముస్లిం రాజు తైమూర్‌ పేరు పెట్టుకోవడం ఏమిటనే ప్రశ్న వినిపించింది. అయితే తైమూర్ వివాదం కొనసాగుతుంటే వారిద్దరూ పెద్దగా స్పందించకపోవడంతో అంతటితో ఆ వివాదం సద్దుమణిగించింది.

  ప్రెగ్నెన్సీ బైబిల్ పుస్తకంపై మైనారిటీల కన్నెర్ర

  ప్రెగ్నెన్సీ బైబిల్ పుస్తకంపై మైనారిటీల కన్నెర్ర

  సైఫ్ ఆలీ ఖాన్‌తో రెండో బిడ్డను కన్న తర్వాత తన ప్రెగ్నెన్సీ సమయంలో అనుభవించిన క్షణాలను పుస్తకంగా తీసుకొచ్చింది. కరీనా కపూర్ ఖాన్స్ పెగ్రెన్సీ బైబిల్ అని పేరుతో మార్కెట్‌లోకి పుస్తకాన్ని రిలీజ్ చేసింది. ఆ పుస్తకాన్ని మూడో బిడ్డగా అభివర్ణించింది. అయితే ఆ పుస్తకానికి బైబిల్ అని పేరు పెట్టడంపై ఆల్ ఇండియా మైనారిటీ బోర్డు అభ్యంతరం తెలియజేయడమే కాకుండా నిరసన తెలిపింది. పవిత్ర బైబిల్‌ను అపవిత్రంగా వాడిందనే ఆరోపణలు చేస్తూ.. ఆమెపై కేసు నమోదు చేశారు.

  రెండో కుమారుడికి జహంగీర్ అని పేరు

  రెండో కుమారుడికి జహంగీర్ అని పేరు

  తాజాగా తన రెండో కుమారుడికి జెహ్ అనే పేరు పెట్టామని ముందుగా తెలియజేశారు. కానీ తీరా చూస్తే చిన్నారికి జహంగీర్ అని పేరు పెట్టినట్టు బయటపడింది. దాంతో దేశంపై దండయాత్ర చేసిన రాజుల పేర్లు పెట్టుకోవడం భారతీయ సంస్కృతికి విరుద్ధం. సిక్కు మతస్తుల ఐదో గురువు గురు అర్జున్‌ను చంపిన జహంగీర్ చక్రవర్తి పేరును కరీనా తన రెండో కొడుకుకు పెట్టుకోవడం ఏమిటి? మొదటి బిడ్డకు తైమూర్ అని పేరు పెట్టుకొని వివాదంగా మలిచిన కరీనా.. తన రెండో కొడుకుకు అలాంటి పేరే పెట్టారు అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. జహంగీర్‌ను కేవలం చంపడమే కాదు... మనదేశాన్ని దోచుకొన్నారు. మన పూర్వీకులను దారుణంగా వధించాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

  Prabhas ఫేవరెట్ డైరెక్టర్ ఆయనే.. ఆ సినిమాలు 20 సార్లు చూసాడట!! || Filmibeat Telugu
   కరీనా కపూర్ ఆస్తి విలువు 44ే కోట్లకుపైనే

  కరీనా కపూర్ ఆస్తి విలువు 44ే కోట్లకుపైనే

  కరీనా కపూర్ వ్యక్తిగత, ఆస్తుల వివరాలకు వస్తే.. ప్రముఖ నటుడు రాజ్ కపూర్ మనవరాలిగా, బాలీవుడ్ తారలు రణధీర్ కపూర్, బబితా దంపతుల కుమార్తెగా సుపరిచితులు. కపూర్ ఫ్యామిలీలో 4వ తరం అమ్మాయి. ప్రస్తుతం కరీనా కపూర్ నికర ఆస్తిని రూ.440 కోట్లుగా అంచనా వేశారు. ఆమె నెల సంపాదన కోటి రూపాయలు, ప్రతీ సినిమాకు 10 కోట్ల రెమ్యునరేషన్ తీసుకొంటారని లెక్క కట్టారు. ఇక రాజకుటుంబం పటౌడీ కుటుంబానికి చెందిన సైఫ్ ఆలీ ఖాన్ ఆస్తి విలువ రూ.750 కోట్లుగా అంచనా వేశారు. ఇద్దరి ఆస్తులు కలిపితే 100 మిలియన్లకుపైగానే ఉంటుందనేది తాజా అంచనాగా పేర్కొంటున్నారు.

  English summary
  Bollywood Actress Kareena Kapoor Khan landed in another contraversy. Here is Kareena's top Controversies and Net Worth.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X