తల్లి కాబోతున్న బాలీవుడ్ హీరోయిన్.. ప్రెగ్నెన్సీని అనౌన్స్ చేసిన అందాల భామ

బాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా తాజాగా శుభవార్త చెప్పింది. పెళ్లైన రెండేళ్లకు తనకు తల్లిని కాబోతున్నానంటూ ప్రకటించింది. దీంతో అభిమానులు, సినీ పరిశ్రమలోని పరిణీతి చోప్రా క్లోజ్ ఫ్రెండ్స్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక ఆమె ఇన్ స్టా వేదికన ఈ విషయాన్ని పంచుకోవడంతో లైక్స్, కామెంట్లతో నెట్టింట వైరల్ చేస్తున్నారు. 14 ఏళ్లుగా పరిణీతి చోప్రా హీరోయిన్ గా నార్త్ ఆడియెన్స్ ను అలరిస్తూ వస్తోంది. ఇక రెండేళ్ల కిందనే పెళ్లి చేసుకొని వివాహ బంధంలోకి అడుగు పెట్టింది. తాజాగా తన ప్రెగ్నెన్సీతో గుడ్ న్యూస్ చెప్పింది.

హర్యానాకు చెందిన పరిణీతి చోప్రా హర్యానా రాష్ట్రంలోని అంబాలలో పుట్టి పెరిగింది. 1988 అక్టోబర్ 22న పవన్ చోప్రా, రీనా చోప్రాల దంపతులకు జన్మించింది. చోప్రా ఫ్యామిలీకి చెందిన పరిణీతి చిన్నప్పటి నుంచే రిచ్ లైఫ్ ను చూస్తూ వస్తోంది. ఇక ఈమె తండ్రి పవన్ చోప్రా అంబాల కంటోన్మెంట్ లోని ఇండియన్ ఆర్మీకి సప్లయర్ గా పనిచేశారు. మరోవైపు ఆయన వ్యాపారవేత్త కూడానూ. తల్లి హౌజ్ వైఫ్. పరిణీతి చోప్రాకు ఇద్దరు తోబుట్టువులు శివంగ్, సహజ్ లు ఉన్నారు. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా, మీరా చోప్రా, మన్నరా చోప్రాలు ఆమెకు అక్కాచెళ్లులు కావడం విశేషం.

Bollywood Actress Parineeti Chopra Announced her first Pregnancy

పంజాబీ హిందూ ఫ్యామిలీకి చెందిన పరిణీతి చోప్రా పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఎంపీ రాఘవ్ చద్దాను ప్రేమించి పెళ్లి చేసుకుంది. కొన్నాళ్లుగా డేటింగ్ సాగించిన వీరు 2023 మే 13న ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. ఇక అదే ఏడాది సెప్టెంబర్ 14న రాజాస్థాన్ లోని ఉదయ్ పూర్ లోని ది లీలా ప్యాలస్ లో వీరి వివాహా మహోత్సవం గ్రాండ్ గా జరిగింది. వచ్చే నెల 14తో వీరి 2వ వార్షికోత్సవం జరగనుంది. ఇక ఈలోగానే పరిణీతి చోప్రా తను తల్లి కాబోతున్నట్టుగా ప్రకటించింది. ఈ శుభవార్తను తానే స్వయం ఇన్ స్టా గ్రామ్ వేదికన తన అధికారిక అకౌంట్ ద్వారా వెల్లడించింది.

1+1=3 అంటూ పోస్ట్ పెట్టింది. ఇకపై తాము ఇద్దరం కాదని ముగ్గురమని తన ప్రెగ్నెన్నీని అనౌన్స్ చేయడం విశేషం. అలాగే వారి చిన్నారి ప్రపంచం వస్తోందని, లెక్కకు మించిన ఆశీస్సులు దక్కాయని వెల్లడించింది. దీంతో ఆమె అభిమానులు, బాలీవుడ్ స్టార్స్, తోటీ నటీనటులు పరిణీతి చోప్రాకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ పోస్ట్ తో పాటు పరిణీతి చోప్రా తన భర్తతో పాటు ప్రకృతిలో నడుచుకుంటూ వెళ్తున్న ఒక వీడియోను కూడా పంచుకుంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది.

ఇక పరిణీతి చోప్రా 2011 నుంచి బాలీవుడ్ లో హీరోయిన్ గా అలరిస్తూ వస్తోంది. సుశాంత్ రాజ్ పుత్ సరసన ఆమె నటించిన శుధ్ దేశి రొమాన్స్ చిత్రంతో బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకుంది. అప్పటి నుంచి బ్యాక్ టు బ్యాక్ స్టార్ హీరోలతో నటిస్తూ వస్తోంది. డిష్యూమ్, గోల్ మాల్ అగైన్, కేసరి, సైనా, మిషన్ మంగల్, అమర్ సింగ్ చాంకీలా వంటి చిత్రాలతో అలరించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X