Don't Miss!
- News
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు సంచలన తీర్పు..!!
- Finance
Telangana Budget: కీలక రంగాలకు కేటాయింపులు ఇలా.. జర్నలిస్టుల సంక్షేమానికి కూడా..
- Sports
INDvsAUS : స్పిన్ పిచ్‌లతో భారత్‌కూ సమస్యే?.. రికార్డులు చూస్తే తెలిసిపోతోంది!
- Travel
ప్రపంచ స్థాయి పర్యాటక గ్రామం.. పోచంపల్లి విశేషాలు!
- Technology
బెట్టింగులు, లోన్లు అంటూ ప్రజలను వేధిస్తున్న 230 యాప్ లు బ్యాన్!
- Lifestyle
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఈ పనులు చేసిన తర్వాత తప్పనిసరిగా స్నానం చేయాలి
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
అవన్నీ చూసే ధైర్యం లేదు..ఇక వదిలేస్తున్నా..ఛార్మీ సంచలన పోస్ట్!
ఒకప్పుడు టాలీవుడ్ లో హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన ఛార్మి ఆ తర్వాత అవకాశాలు తగ్గిపోవడంతో పూరి జగన్నాథ్ తో కలిసి నిర్మాతగా మారారు. పూరి జగన్నాథ్ చేస్తున్న అన్ని సినిమాలు నిర్మించే బాధ్యత తలకెత్తుకున్న చార్మి, పూరి కనెక్ట్స్ అనే బ్యానర్ వ్యవహారాలన్నీ తానే చూస్తున్నారు. పూరి జగన్నాథ్ కు ఆమెకు మధ్య ఏదో ఉంది అంటూ రకరకాల ప్రచారాలు జరుగుతున్నా అవేవి పట్టించుకోకుండా ఆమె సినిమాలు నిర్మించే పనిలో నిమగ్నమై ఉన్నారు. అయితే తాజాగా ఆమె సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక పోస్ట్ వైరల్ గా మారింది. కరోనా నేపథ్యంలో ఆమె కొద్ది రోజుల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నానని ప్రకటించింది.
వెండితెరపై లిప్‌లాక్స్.. శృంగార సన్నివేశాల్లో మునిగి తేలిన తారలు

రోజురోజుకు దారుణంగా మారుతోన్న మహమ్మారి
ఈ కరోనా మహమ్మారి రోజురోజుకు దారుణంగా మారుతోందని, ఈ భయంకరమైన విషయాలు తెలుసుకుని దాన్ని తట్టుకునే బలం తనకు లేదని ఛార్మీ చెప్పుకొచ్చింది. అందుకే వీటన్నిటిని చూసే కంటే కొద్దిరోజుల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉంటేనే మంచిదని భావిస్తున్నాను అని అందుకే కొద్దిరోజుల పాటు సోషల్ మీడియా కి బ్రేక్ తీసుకుంటున్నా అని ఆమె పేర్కొంది. అందరూ ఇళ్లలోనే ఉండి మీరు ప్రేమించే వారి కోసం జాగ్రత్తగా ఉండాలని, వారిని శ్రద్ధగా చూసుకోవాలని చార్మి పేర్కొంది. ప్రతి ఒక్కరిని ఎంతో ధైర్యంగా ఉంచడానికి తాను ప్రయత్నించానని కానీ ఇప్పుడు తాను ఏమీ చేయలేకపోతున్నానని ఛార్మి పేర్కొంది. మన దేశం ప్రస్తుతం బాధాకరమైన పరిస్థితుల్లో ఉందని ఆమె రాసుకొచ్చింది.
అర్ధనగ్నంగా హాట్ హీరోయిన్.. బికినీలో దారుణంగా స్కిన్ షో

మహా కర్ఫ్యూ పేరిట ఆంక్షలు
ప్రస్తుతానికి చార్మి పూరి జగన్నాథ్ చేస్తున్న లైగర్ అనే సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. గత ఏడాది ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతున్న నేపథ్యంలో షూటింగ్ కు బ్రేక్ పడటంతో పూరి జగన్నాథ్, చార్మి ఇద్దరూ ముంబైలోనే ఉండిపోయారు. ఇక ఇప్పుడు కూడా లైగర్ సినిమా షూటింగ్ కు మళ్ళీ బ్రేక్ లు పడ్డాయి. అదీకాక ముఖ్యంగా వీరిద్దరూ ఉంటున్న మహారాష్ట్రలోని ముంబై పరిస్థితి దారుణంగా మారింది. అక్కడ మహా కర్ఫ్యూ పేరిట ఆంక్షలు విధించింది మహారాష్ట్ర సర్కార్.
సముద్ర తీరంలో సానియా గ్లామర్ డోస్.. యువ హీరోయిన్ గ్లామర్ జోరు

పరిస్థితులను చూసి చలించిపోయిన చార్మి
తన చుట్టూ జరుగుతున్న పరిస్థితులను చూసి చార్మి చలించిపోయి ఈ నిర్ణయానికి వచ్చిందేమో అనే అంచనాలు వినిపిస్తున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా కలకలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలామంది కరోనా బారిన పడి మరణిస్తున్నారు. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సైతం కరోనా సోకడం చర్చనీయాంశంగా మారింది.. ఇక తాజాగా హైకోర్టు ఆదేశాల ప్రకారం తెలంగాణలో నైట్ కి కూడా విధిస్తున్నట్లు ఆదేశాలు వెలువడ్డాయి.
రాత్రి 9 గంటల లోపు ఏవైనా ఉంటే చక్కబెట్టుకోవాలనే 9 గంటల తరువాత ఎవరూ రోడ్ల మీదకు రాకూడదని సర్కారు ఆదేశాల్లో పేర్కొంది. కేవలం అత్యవసర విభాగాల వారు మాత్రమే 9 తర్వాత రోడ్డెక్కినా అనుమతులు ఉంటాయని, మిగతా వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని సర్కారు చెబుతోంది.
మాస్టర్ హీరోయిన్ క్లీవేజ్ షో.. చీరకట్టులో సరికొత్త అందాలు

ఛార్మి నిర్ణయం మీద మిశ్రమ స్పందన
అయితే ఛార్మి తీసుకున్న నిర్ణయం మీద మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు ఛార్మి ధైర్యంగా ఉండాలని ఆమెకు ధైర్యం చెబుతుంటే మరికొందరు మాత్రం ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం పిరికిపంద చర్యగా అభివర్ణిస్తున్నారు. సోనూసూద్ లాంటి వ్యక్తులు సోషల్ మీడియా వేదికగా కరోనా బాధితులకు ఎంతో సేవ చేస్తూ ఉంటే అదే సోషల్ మీడియా నుంచి ఇలా పారిపోవడం ఏమాత్రం బాలేదని ఒక నెటిజన్ కామెంట్ చేశారు.
ఇక చాలా మంది ఇది ఆమెకు కరోనా సోకింది ఏమో నన్న అనుమానంతో త్వరగా కోలుకోవాలని కామెంట్లు పెట్టడం ఆసక్తికరంగా మారింది. షూటింగ్ లు మళ్లీ ఆగిపోయిన నేపథ్యంలో లైగర్ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. విజయ్ దేవరకొండ హీరోగా అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని ఏకకాలంలో తెలుగు హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నారు.