గ్రేట్ సినిమా కాదు కాని బానే ఉంటుంది.. చూడండని కలర్స్ స్వాతి సూచన
కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు లాక్ డౌన్ విధించారు. దీంతో ప్రజలంతా ఇంటి పట్టునే ఉంటున్నారు. కాలక్షేపానికి టీవీ, స్మార్ట్ ఫోన్ వంటివి ఎలాగూ ఉన్నాయి. కొందరు నాటి తరంలోకి వెళ్లి, మేటి చిత్రాలను చూసి సంబరపడిపోతూ ఉంటే.. నేటి యువత స్మార్ట్ ఫోన్ పట్టుకుని ఆటల్లో మునిగిపోతోంది. కొందరు మాత్రం ఈ లాక్ డౌన్ సమయాన్ని తెలివిగా ఉపయోగించుకుంటూ సద్వినియోగం చేసుకుంటున్నారు.
అయితే ఈ క్వారంటైన్ సమయంలో మీకో మంచి సినిమాను సూచిస్తోంది కలర్స్ స్వాతి. తాను నటించిన ఓ చిత్రం గురించి చెబుతూ ఓ పోస్ట్ చేసింది. 'ఇప్పుడు క్వారంటీన్ లో అందరు సినిమాలు చూస్తున్నారు కదా అని ఈ బుజ్జి సినిమా గుర్తు చేస్తున్నా. లండన్ బాబులు రీమేక్ అయినా, నిజాయ్‌తిగా, ఎక్సట్రాలు లేకుండా ఉండేలా చేసాం.

ఈ ఆదివారం ( ప్రతిరోజు ఆదివారమేలే ) ఇంట్లో పనులు నుంచి బ్రేకు ఓకవేల తీసుకున్నట్టైతే, ఓక వెమ్మదిగా కథ ఉన్న సినిమా కావాలి అంటే చూడండి. కోంచం ఓపికగా చూడాలిసిన సినిమా ఇది. అనవసరమైన స్టైలిష్ ఐ కాండి లేయర్లు ఏమి లేవు. పైగా ఏ సీన్ మిస్ అయినా లాజిక్ పోతుంది. ఇప్పుడు అందరికి కంగారు ఏమి లేదు కదా. పోని ఇప్పుడైనా ఇలాంటి సినిమాలు చూడొచ్చేమో అని. పర్ఫెక్ట్ గ్రేట్ సినిమా కాదు కాని బానే ఉంటుంద'ని పోస్ట్ చేసింది.


Click it and Unblock the Notifications











