twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దీపిక పదుకోన్ సంచలన నిర్ణయం.. ఇక నా వల్ల కాదంటూ గుడ్ బై!

    |

    బాలీవుడ్ హీరోయిన్ దీపిక పదుకోన్ సంచలన నిర్ణయం తీసుకొన్నారు. ముంబై అకాడమీ ఆఫ్ ది మూవింగ్ ఇమేజ్ (మామి) చైర్ పర్సన్ పదవికి రాజీనామా చేస్తూ తన నిర్ణయాన్ని ప్రకటించారు. రాజీనామా పత్రాన్ని సమర్పించగానే ఆమె స్థానంలో కిరణ్ రావును మామీ చైర్‌పర్సన్‌గా నియమించారు. మామి సంస్థకు రాజీనామా చేసిన విషయాన్ని దీపిక తన ఇన్స్‌టాగ్రామ్‌ ద్వారా తెలియజేశారు. నా కెరీర్, ఇతర పనులు ఒత్తిడి కారణంగా మామీ వ్యవహారాలపై దృష్టి పెట్టలేకపోతున్నానని తన ఇన్స్‌టాగ్రామ్‌లో పేర్కొన్నారు.

    మామీ బోర్డులో కీలక పొజిషన్‌లో బాధ్యతలను చెప్పడం గొప్ప అనుభవం. గత కొద్దికాలంగా చాలా విషయాలను నేర్చుకొన్నాను. ముంబైలోని టాలెంట్‌ను ప్రపంచానికి తెలియజేసే ప్రక్రియలో, సినిమాను మరొ రేంజ్‌కు తీసుకెళ్లడంలో అద్భుతమైన అనుభూతిని పొందాను అని దీపికా పేర్కొన్నారు.

    Deepika Padukone resigns MAMI chairperson post

    మామీ సంస్థ విషయానికివస్తే.. ముంబైలో ఏడాదికోసారి అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తునంది. దానినే ముంబై ఫిల్మ్ ఫెస్టివల్ అంటారు. ఈ సంస్థకు చైర్ పర్సన్‌గా దీపిక పదుకోన్ వ్యవహరించారు.

    దీపిక పదుకోన్ కెరీర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం సిద్దాంత్ చతుర్వేది, అనన్యపాండే కలిసి షకుణ్ బాత్రా దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు. అంతేకాకుండా సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో షారుక్ ఖాన్‌, జాన్ అబ్రహంతో కలిసి పఠాన్ చిత్రంలో నటిస్తున్నారు.

    English summary
    Bollwood actress Deepika Padukone resigns MAMI chairperson post.She wrote in her instagram that, Being on the board of MAMI and serving as Chairperson has been a deeply enriching experience. As an artist, it was invigorating to bring together cinema and talent from all over the world to Mumbai, my second home.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X