For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకొన్నా.. దీపిక పదుకోన్ షాకింగ్ కామెంట్

  |

  బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్, కన్నడ భామ దీపిక పదుకోన్ పెళ్లి తర్వాత కెరీర్‌ను రాకెట్ స్పీడ్‌తో ముందుకు తీసుకెళ్తున్నది. అయితే పెళ్లికి ముందు మానసిక రుగ్మతతో బాధపడటం తెలిసిందే. తీవ్రమైన డిప్రెషన్‌కు గురైన ఆమె చాలా కాలం మానసిక వేధనకు గురైంది. అయితే కొద్ది రోజులు ట్రీట్‌మెంట్ తీసుకోవడం మళ్లీ ఆమె సాధారణ స్థితికి చేరుకోవడం జరిగింది. అయితే తాజాగా డిప్రెషన్ సమయంలో తన పరిస్థితి గురించి చెప్పిన విషయాలు షాకింగ్‌గా ఉన్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

  Recommended Video

  Bumper Offer జస్ట్ నిద్రపొతే బోలెడంత జీతం... పోటీపడి దరఖాస్తులు *Trending | Telugu OneIndia
  నిర్మాతగా, నటిగా

  నిర్మాతగా, నటిగా

  లాక్‌డౌన్ తర్వాత దీపిక పదుకోన్‌ నిర్మాతగాను, నటిగాను మరో లెవెల్‌‌కు చేరుకొన్నట్టు కనిపిస్తున్నది. నిర్మాతగా కొన్ని సినిమాలను పట్టాలెక్కించే ప్రయత్నం జరుగుతున్నది. అంతేకాకుండా ప్రపంచస్థాయిలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ప్రాజెక్ట్K చిత్రంలో నటిస్తున్నది. అయితే ఈ సినిమా షూటింగులో దీపిక తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో ఆమె హెల్త్‌పై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి.

  ప్రాజెక్ట్ K చిత్ర షూటింగులో

  ప్రాజెక్ట్ K చిత్ర షూటింగులో

  హైదరాబాద్‌లో కొన్ని రోజుల క్రితం ప్రాజెక్ట్ K సినిమా షూటింగులో దీపిక పదుకోన్ ఉన్నట్టుండి పడిపోవడంతో ఆమెను వెంటనే హాస్పిటల్‌కు తరలించి చికిత్సను అందించారు. అయితే డిప్రెషన్ కోసం వాడుతున్న మెడిసిన్ మోతాదు పెరగడం, అయితే పని ఒత్తిడి కారణం ఆమె అస్వస్థతకు గురయ్యారు అనే విషయాన్ని యూనిట్ వెల్లడించింది.

  డిప్రెషన్‌కు గురై ఆత్మహత్యకు..

  డిప్రెషన్‌కు గురై ఆత్మహత్యకు..

  దీపిక పదుకోన్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. తీవ్రమైన డిప్రెషన్‌ గురై తాను ఆత్మహత్య చేసుకోవాలనే ఫీలింగ్ వచ్చేది. అలాంటి ప్రమాదాన్ని నా తల్లి పసిగట్టింది. ఆ లక్షణాలను గ్రహించి వెంటనే ట్రీట్‌మెంట్ చేయించింది. అలాంటి పరిస్థితిలో నాకు తోడుగా ఉండి నా ఆరోగ్యాన్ని చక్కదిద్దింది. నా తల్లి నా రోగ లక్షణాలను గ్రహించకపోతే నా పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారేది. అందుకు జీవితాంతం రుణపడి ఉంటాను అని చెప్పింది.

  ఎప్పుడూ నిద్రపోతూనే ఉండేదానిని

  ఎప్పుడూ నిద్రపోతూనే ఉండేదానిని

  అయితే డిప్రెషన్ గురికావడం నా జీవితంలో ఒక చేదు అనుభవం. నా కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడు నాకు అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలియదు. కొన్నిసార్లు నా పరిస్థితిని ఊహించుకోలేక దారుణంగా ఏడ్చేదానిని. నా పరిస్థితిని ప్రత్యక్షంగా చూసుకోలేక.. ఎప్పుడూ నిద్రపోతూనే ఉండేదానిని. కొన్ని సందర్బాల్లో సూసైడ్ చేసుకోవాలన్న ఆలోచనలు వచ్చేవి అని దీపిక పదుకోన్ చెప్పింది.

  లివ్ లాఫ్ లవ్ ఫౌండేషన్ గురించి

  లివ్ లాఫ్ లవ్ ఫౌండేషన్ గురించి

  క్లినికల్ డిప్రెషన్స్‌ బారిన పడిన వారికి అండగా నిలువాలనే ఉద్దేశంతోనే లివ్ లాఫ్ లవ్ ఫౌండేషన్‌ను స్థాపించాను. ఆ స్వచ్ఛంద సంస్థ ద్వారా మానసిక సమస్యలకు కౌన్సిలింగ్, ట్రీట్‌మెంట్ ఇప్పిస్తున్నాం. నా మాదిరిగా మరొకరు కష్టాల్లో పడకూడదని నేను భావిస్తున్నాను అని దీపిక పదుకోన్ చెప్పారు. డిప్రెషన్‌కు లోనైతే ఎవరూ కూడా ఆత్మహత్యలకు ప్రయత్నించవద్దు అని కోరారు.

  దీపిక పదుకోన్ కెరీర్ ఇలా..

  దీపిక పదుకోన్ కెరీర్ ఇలా..

  దీపిక పదుకోన్ కెరీర్ విషయానికి వస్తే.. ప్రాజెక్ట్K తోపాటు ప్రస్తుతం షారుక్ ఖాన్‌తో కలిసి పఠాన్ చిత్రంలో నటిస్తున్నది. ఇంటెర్న్ అనే హాలీవుడ్ సినిమాను స్వయంగా నిర్మించడమే కాకుండా అందులో కీలకపాత్రలో నటిస్తున్ారు. సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో హృతిక్ రోషన్‌తో ఫైటర్ సినిమాలో నటిస్తున్నది. ఫైటర్‌లో ద్రౌపది పాత్రలో కనిపించనున్నారు.

  English summary
  Actress Deepika Padukone has reveals about Live laugh love foundation to deal depression. Deepika said that she had suicidal feelings.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X