Don't Miss!
- News
ఆర్థిక వ్యవస్థ గుట్టుమట్లు బహిర్గతం- కీలక సర్వే: ఇంకొన్ని గంటల్లో..!!
- Sports
INDvsNZ: టీమిండియాకు సంప్రదాయ వెల్ కమ్.. వీడియో షేర్ చేసిన బీసీసీఐ
- Finance
it news: TCS రికార్డుల మోత.. 22 కంపెనీలను వెనక్కి నెట్టి అగ్రస్థానం కైవసం
- Automobiles
ఎట్టకేలకు హైరైడర్ CNG విడుదల చేసిన టయోటా.. ధర ఎంతంటే?
- Lifestyle
Vastu Tips: లక్ష్మీదేవి లాంటి చీపురు ఎప్పుడు కొనాలి, ఇంట్లో ఎక్కడ పెట్టాలో తెలుసా?
- Technology
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్లోని ఈ సరస్సులు!
డ్రగ్స్ కేసులో రకుల్ కి టెన్షన్.. రాలేనంటూ ఈడీ అధికారులకి లేఖ.. షాకిచ్చిన అధికారులు?
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. గతంలో ఎక్సైజ్ శాఖ విచారణ జరిపిన సమయంలో నోటీసులు అందుకోని రకుల్ ప్రీత్ సింగ్ ఈసారి ఈడీ విచారణ చేస్తున్న సమయంలో నోటీసులు అందుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆమె ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులకు ఒక లేఖ రాయగా దానికి ఆమెకు షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.

PMLA act కింద సమన్లు
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న 12 మందికి PMLA act కింద సమన్లు జారీ చేసినట్లు చెబుతున్నారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అసిస్టెంట్ డైరెక్టర్ పేరుతో 12 మందికి నోటీసులు ఇచ్చారు. ఇప్పటికే పూరి జగన్నాథ్ విచారణ పూర్తి చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఈరోజు 5 గంటల నుంచి ఛార్మి కౌర్ ను విచారణ చేస్తోంది.

వాటి ఆధారంగా కేసు
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసు , ఎక్స్ సైజ్ సిట్ కేస్ ల ఛార్జ్ షీట్స్ ఆధారంగా ED ECIR నమోదు చేసిందని అంటున్నారు. ఇక డ్రగ్స్ పెడ్లర్ కెల్విన్ మూడు అకౌంట్ లను ఫ్రిజ్ చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 2017 ముందు కెల్విన్ తో టచ్ లో ఉన్న ప్రతి ఒక్కరి బ్యాంకు వివరాలు తీసుకుని వాటి ఆధారంగా విచారణ చేస్తోంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్.

రకుల్ ప్రీత్ సింగ్ మీద సందిగ్ధతనె
అయితే ఈ కేసు విచారణలో రకుల్ ప్రీత్ సింగ్ హాజరు విషయం మీద సందిగ్ధత నెలకొంది. దానికి కారణం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులకు రకుల్ ప్రీత్ సింగ్ లేఖ రాయడమే. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఇచ్చిన నోటీసులు ప్రకారం ఈనెల ఆరో తేదీన రకుల్ ప్రీత్ సింగ్ విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే ఆ రోజున కొన్ని అనివార్య కారణాల వల్ల విచారణకు హాజరు కాలేను అంటూ వీడియో అధికారులకు రకుల్ ప్రీత్ సింగ్ కు లేఖ రాసినట్లు చెబుతున్నారు.

పనులున్నాయి రాలేనంటూ
తనకు ఆ రోజు కొన్ని అనివార్య పనులు ఉండటంతో మరో తారీకు ఇస్తే తాను ఆ రోజు హాజరవుతానని ఈడీ అధికారులు కోరగా ఈడీ అధికారులు మాత్రం రకుల్ ప్రీత్ సింగ్ రిక్వెస్ట్ ను రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది, ఎట్టి పరిస్థితుల్లోనూ ముందుగా చెప్పిన తేదీ కచ్చితంగా హాజరు కావాల్సిందేనని వారు పేర్కొన్నట్లు తెలుస్తోంది. నిజానికి ఎక్సైజ్ శాఖ విచారణ జరిపిన సమయంలో రకుల్ ప్రీత్ సింగ్ పేరు ఈ కేసులో వినపడ లేదు కానీ అనూహ్యంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగిన ఆమె పేరు కూడా లిస్ట్ లో చేర్చబడింది.
Recommended Video

నాకు తెలియదన్న ఛార్మి
ఇక డ్రగ్స్ కేసులో ఈరోజు ఈడీ విచారణ కొనసాగుతోంది. ఛార్మికి చెందిన రెండు బ్యాంక్ ఖాతా లావాదేవీలను పరిశీలిస్తున్న ఈడి, 2016 లో కెల్విన్ తో మాట్లాడిన కాల్ డేటా , వాట్సప్ చాట్ ను ఛార్మీ కి చూపెట్టి మరీ విచారణ చేస్తున్నట్టు చెబుతున్నారు.
దాదా పేరుతో ట్రాన్స్ఫర్ అయిన లక్షల రూపాయల లావాదేవీలపై ఈడీ విచారించగా కెల్విన్ తనకు తెలిదంటు ఈడి అధికారులకు ఛార్మి సమాధానం ఇస్తున్నట్టు చెబుతున్నారు. ఇక కెల్విన్ తో పాటు మరో ముగ్గురు ఫోటోలు ఛార్మి కి ఈడి అధికారులు చూపించగా వారు ముగ్గురూ తనకు తెలియదని ఆమె పేర్కొన్నారని తెలుస్తోంది.