Don't Miss!
- News
అటెన్షన్ అమరావతి: అందరి చూపూ అటు వైపే..!!
- Sports
పాపం సర్ఫరాజ్‌ఖాన్.. సెలెక్టర్ల బాక్స్ బద్దలు కొట్టినా ఎంపికవ్వలేదు: రవిచంద్రన్ అశ్విన్
- Lifestyle
సంబంధంలో సాన్నిహిత్యం, నమ్మకాన్ని పెంపొందించడానికి చిట్కాలు
- Finance
household income: భారతీయ కుటుంబాలపై సర్వే.. ఆదాయం, పొదుపులు ఎంతో తెలుసా ?
- Technology
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
- Automobiles
భారతీయ మార్కెట్లో Hero XOOM ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల: ప్రైస్, వేరియంట్స్ & కలర్ ఆప్సన్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
కాజల్ పర్సనల్ ఫొటో షేర్ చేసిన భర్త: ప్రెగ్నెంట్ అయ్యాక ఇలా కనిపించడం ఇదే తొలిసారి
తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లుగా వస్తున్నాయి. అయితే, అందులో చాలా అంటే చాలా తక్కువ మంది మాత్రమే స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుంటున్నారు. అలాంటి వారిలో చందమామ కాజల్ అగర్వాల్ ఒకరు. అందానికి అందం.. అభినయానికి అభినయం.. అప్పుడప్పుడూ గ్లామర్ ట్రీట్‌తో ప్రేక్షకులును మాయ చేసిందామె. అందుకే చాలా తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపుతో పాటు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను, వరుసగా ఆఫర్లను చేజిక్కించుకుంది.
ఫలితంగా చాలా కాలంగా స్టార్‌డమ్‌ను అనుభవిస్తోంది. ఇక, కాజల్ ప్రస్తుతం గర్భవతిగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె భర్త గౌతమ్ కిచ్లూ ఓ పర్సనల్ ఫొటోను షేర్ చేశాడు. దానిని మీరూ చూసేయండి మరి!

అలా వచ్చి.. ఇలా పాపులారిటీ
సినిమాల్లోకి అడుగు పెట్టాలన్న ఉద్దేశంతోనే కాజల్ అగర్వాల్ మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. అందులో తన అందచందాలతో అందరి దృష్టినీ ఆకట్టుకున్న తర్వాత 'లక్ష్మీ కల్యాణం' అనే సినిమాతో హీరోయిన్‌గా వచ్చింది. ఆరంభంలోనే తన నటనతో మెప్పించిన ఈమె.. తర్వాత వరుసగా అవకాశాలను అందిపుచ్చుకుంది. ఫలితంగా ఎనలేని పాపులారిటీని అందుకుంది.
Rashmika Mandanna: గ్లామర్ కంచె తెంచేసిన శ్రీవల్లి.. బౌండరీ దాటేసి మరీ ఘాటుగా!

టాలీవుడ్‌లో స్టార్.. వాటిలోనూ
గ్లామర్‌తో పాటు యాక్టింగ్‌తో తక్కువ టైంలోనే ఎన్నో సక్సెస్‌లను అందుకున్న కాజల్ టాలీవుడ్‌లో స్టార్ అయింది. దీంతో ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే బడా హీరోల సినిమాల్లో అవకాశాలను దక్కించుకుంది. ఫలితంగా అప్పట్లో హవాను చూపించింది. ఆ తర్వాత కుర్ర హీరోలతోనూ నటించింది. అలాగే, వేరే భాషల చిత్రాల్లోనూ కనిపించి అందరినీ మాయ చేసేసింది.

వివాహం తర్వాత తగ్గిన స్పీడ్
సుదీర్ఘ కాలం పాటు టాలీవుడ్‌లో కాజల్ అగర్వాల్ వరుస సినిమాలతో సందడి చేసింది. ఈ క్రమంలోనే కొన్నేళ్ల క్రితం తన ప్రియుడు గౌతమ్ కిచ్లూను ఈ ముద్దుగుమ్మ వివాహం చేసుకుంది. ఇక అప్పటి నుంచి ఈ స్టార్ హీరోయిన్ సినిమాల వేగాన్ని పూర్తిగా తగ్గించేసింది. అలాగే, ఆఫర్లు కూడా ఆమెకు సన్నగిల్లాయనే చెప్పుకోవాలి. దీంతో ఆమె అభిమానులు ఎంతో నిరాశగా ఉన్నారు.
బ్రాతో యాంకర్ వర్షిణి అందాల విందు: ఆమెను ఈ ఘాటు ఫోజుల్లో చూశారంటే!

పెగ్నెంట్ అవడంతో దూరం
వివాహం చేసుకున్న తర్వాత కూడా కెరీర్‌ను కొనసాగించాలని డిసైడ్ అయింది. ఇందులో భాగంగానే ఇప్పటికే పలు చిత్రాల్లోనూ నటించింది. అలాగే, మరొకొన్నింటిని ఒప్పుకుంది. అయితే, ప్రెగ్నెన్సీ కారణంగా నాగార్జున 'ఘోస్ట్', తమిళ చిత్రం 'రౌడీ బేబీ' నుంచి కూడా బయటకు వచ్చేసింది. వీటితో పాటు మరిన్ని చిత్రాల నుంచి కూడా ఆమె తప్పుకున్న విషయం తెలిసిందే.

భర్తతో కలిసి యమ ఎంజాయ్
చాలా కాలం పాటు వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నా.. ఇప్పుడు వివాహం తర్వాత ఖాళీగానే ఉంటోన్న కాజల్ అగర్వాల్ తన పర్సనల్ లైఫ్‌ను బాగా ఎంజాయ్ చేస్తోంది. ఫ్యామిలీకి టైమ్ కేటాయించే అవకాశం ఉండడంతో ఎక్కువగా భర్తతో కలిసి కనిపిస్తోంది. ఇందులో భాగంగానే తీసుకున్న ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ.. తన ఆనందాన్ని ఫ్యాన్స్‌తో కూడా పంచుకుంటోంది.
Bigg Boss Non Stop: అతడిపై ఎదురు తిరిగిన కంటెస్టెంట్లు.. కంప్లైంట్ చేయడంతో ఇంట్లో నుంచి ఔట్

పర్సనల్ ఫొటో వదిలిన భర్త
కాజల్ అగర్వాల్ లాగే భర్త గౌతమ్ కిచ్లూ కూడా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటాడు. ఇందులో భాగంగానే తరచూ తన పర్సనల్ ఫొటోల కంటే ఆమె తీసుకున్న పిక్‌లనే షేర్ చేస్తుంటాడు. ఈ క్రమంలోనే తాజాగా కాజల్‌తో కలిసి తీసుకున్న ఓ ఫొటోను గౌతమ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు. పర్సనల్‌గా తీసుకున్న పిక్ కావడంతో ఇది హైలైట్ అవుతోంది.

తొలిసారి ఇలా.. భారీ రెస్పాన్స్
కాజల్ అగర్వాల్ గర్భం దాల్చి చాలా రోజులే అవుతోంది. కానీ, ఆమె ప్రెగ్నెన్సీతో తీసుకున్న ఫొటోలు మాత్రం పెద్దగా బయటకు రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లు ఇప్పుడు గౌతమ్ కిచ్లూ ఏకంగా వీళ్లిద్దరూ కలిసున్న పిక్‌ను షేర్ చేశాడు. ఇందులో కాజల్ తన గర్భాన్ని పట్టుకుని మురిసిపోతుండగా.. గౌతమ్ ఆమెనే చూస్తూ ఆశ్చర్యపోతున్నాడు. దీంతో ఈ ఫొటోకు భారీ స్పందన వస్తోంది.