For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నాకు నేనే నచ్చలేదు.. అద్దం ముందు నిలబడి కన్నీళ్లు పెట్టుకున్నా: అవికా గోర్

  |

  సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా సక్సెస్ అవ్వడం అనేది చాలా ఈజీ అని అనుకుంటారు. అందం ఉంటే చాలు ఆపై గ్లామర్ డోస్ పెంచితే అవకాశాలు వస్తాయనే కామెంట్స్ కూడా బాగానే వినిపిస్తుంటాయి. కానీ అది అంత ఈజీ కాదు. అందాన్ని కాపాడుకోవడానికి జాగ్రత్తలు తీసుకోకపోతే మొదటికే మోసం వస్తుంది. ఇక ఒకనొక సమయంలో కొన్ని పొరపాట్ల వలన లావుగా మారిన అవికా గోర్ ఆ బాధను అనుభవించిందట. చాలా సందర్భాల్లో కన్నీళ్లు కూడా వచ్చాయట.

   తనకు సెట్టయ్యే కథలను మాత్రమే ఎంచుకుంటూ..

  తనకు సెట్టయ్యే కథలను మాత్రమే ఎంచుకుంటూ..

  చిన్నారి పెళ్లి కూతురు సిరియల్ ద్వారా అటు నార్త్ లోనే కాకుండా సౌత్ లో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న అవికా గోర్ ప్రస్తుతం హీరోయిన్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఉయ్యాల జంపాల సినిమాతో వెండితెరపై హీరోయిన్ గా మెరిసి ఓ వర్గం ఆడియెన్స్ ని బాగానే ఎట్రాక్ట్ చేసింది. ఆ తరువాత చాలా ఆఫర్స్ వచ్చినప్పటికీ తనకి సెట్టయ్యే కథలను మాత్రమే ఎంచుకుంది.

   ఆ సమయంలో కన్నీళ్లు ఆగలేదు

  ఆ సమయంలో కన్నీళ్లు ఆగలేదు

  అసలు మ్యాటర్ లోకి వస్తే ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ బ్యూటీ బరువు వల్ల పడిన బాధ గురించి వివరణ ఇచ్చింది. అవికా మాట్లాడుతూ.. గత ఏడాది ఒకసారి అద్దంలో నన్ను నేను చూసుకోగానే కన్నీళ్లు ఆగలేదు. ఎడ్చేశాను. ఆ క్షణాలను నేను ఇప్పటికి మరచిపోలేను. చేతులు కళ్ళు బొద్దుగా, పొట్ట కూడా ఎక్కువగా ఉన్నట్లు అనిపించింది. నిజంగా ఆ రోజు నాకు నేను కొంచెం కూడా నచ్చలేదు..అని తెలిపింది.

  గౌరవం ఇవ్వలేదని కూడా అనిపించింది.

  గౌరవం ఇవ్వలేదని కూడా అనిపించింది.

  లావుగా అనిపించడంతో ఇతర అనారోగ్య కారణాల వల్ల అలా అయితే పెద్దగా పట్టించుకునే దాన్ని కాదేమో. కానీ నేను పొరపాట్లు చేశాను. ఇష్టం వచ్చినట్లు తినడం సమయానికి వ్యయామం కూడా చేయకపోవడం వల్లే బరువు పెరిగానని తెలుసుకున్నాను. నిజంగా నా శరీరానికి సరైన గౌరవం ఇవ్వలేదని కూడా అనిపించింది. శరీరాకృతి మారడంతో ఎంతో ఇష్టమైన డ్యాన్స్ ని కూడా పక్కన పెట్టాల్సి వచ్చింది.. అంటూ అవికా మాట్లాడింది.

  Raju Garu Gadhi 3 Trailer launch
   దాని ఫలితమే ఈ రోజు దక్కింది

  దాని ఫలితమే ఈ రోజు దక్కింది

  నా పొరపాటు తెలుసుకొని వెంటనే వర్కౌట్స్ చేయడం స్టార్ట్ చేశాను. నా గురించి ఎవరు ఏమన్నా కూడా పెద్దగా పట్టించుకోను. అయినా ఒక రాత్రిలో ఏది మారదు అనుకున్నా. వెంటనే తగిన ఆహారం తీసుకుంటూ డైట్ ఫాలో అయ్యాను. వర్కౌట్స్ కూడా చేశాను. దాని ఫలితమే ఈ రోజు మళ్ళీ నాజుగ్గ మారగలిగాను..అని అవికా వివరణ ఇచ్చింది. ఇక ఇటీవల అవికా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొన్ని ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

  English summary
  Young actors Raj Tarun and Avika Gor had made their Tollywood debut with the 2013 blockbuster romantic drama, Uyyala Jampala. The duo followed it up with yet another hit with the 2015 romantic entertainer, Cinema Choopista Maava. Now, Raj and Avika are all set to share screen space for their hat-trick film.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X