Just In
- 49 min ago
ఈవెంట్‌కు వెళ్లి బలయ్యా.. హోటల్ గదిలో వాళ్లు నరకం చూపించారు: లక్ష్మీ రాయ్ షాకింగ్ కామెంట్స్
- 1 hr ago
బిగ్ బాస్ రహస్యాలు లీక్ చేసిన హిమజ: షోలోకి వెళ్లాలంటే దానికి ఒప్పుకోవాల్సిందేనంటూ ఘాటుగా!
- 11 hrs ago
అందుకే ఆ టైటిల్ పెట్టాం.. ‘చెప్పినా ఎవరూ నమ్మరు’పై హీరో కమ్ డైరెక్టర్ కామెంట్స్
- 12 hrs ago
పబ్లిక్ ప్లేస్‌లో ఘాటు ముద్దులు.. లిప్ కిస్‌తో భర్తతో శ్రియ రచ్చ
Don't Miss!
- News
నిమ్మగడ్డ ఆగ్రహానికి గురైన ఆ ఇద్దరు ఐఎఎస్ అధికారులకు కొత్త పోస్టింగులు: కీలక స్థానాల్లో
- Finance
బడ్జెట్, ఇన్వెస్టర్ల ఆందోళన: 4 రోజుల్లో 2400 పాయింట్లు, రూ.8 లక్షల కోట్లు ఆవిరి
- Lifestyle
గురువారం దినఫలాలు : డబ్బు విషయంలో ఆశించిన ఫలితాన్ని పొందుతారు...!
- Sports
ఆ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.. కమిన్స్‌ను మూడు ఫార్మాట్లకు కెప్టెన్‌ను చేయండి: క్లార్క్
- Automobiles
స్విఫ్ట్, బాలెనో, ఐ20 వంటి మోడళ్లకు వణుకు పుట్టిస్తున్న టాటా ఆల్ట్రోజ్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఆ హీరో నమ్మించి మోసం చేశాడు.. అందుకే బ్రేకప్ జరిగింది.. టాలీవుడ్‌లో ‘అఫైర్’పై ఇలియానా
అందాల భామ ఇలియానా డీక్రజ్ దేవదాస్ చిత్రంతో టాలీవుడ్‌లో అడుగుపెట్టి అగ్రతార ఎదిగింది. ఆ తర్వాత స్టార్ హీరోలతో జతకట్టి సూపర్‌స్టార్ హోదాను దక్కించుకొన్నది. ఆ తర్వాత దక్షిణాదిలోని దాదాపు అన్ని భాషల్లో నటించి మెప్పించింది. అయితే ఓ హీరోతో అఫైర్ కారణంగానే తాను దక్షిణాదికి గుడ్‌బై చెప్పానని ఆ మధ్య ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించింది. ప్రస్తుతం ఇలియానా ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ హీరోతో అఫైర్ ఎలా బ్రేకప్ అయిందంటే..

నా సహ నటుడితో అఫైర్
దక్షిణాదిలో నా సహ నటుడితో నేను ప్రేమలో పడ్డాను. పీకల్లోతు అఫైర్‌లో మునిగిపోయాను. జీవితంలో అతడిని నమ్మినంతా ఎవరినీ నమ్మలేదు. కానీ తాను నా నమ్మకాన్ని వమ్ము చేశాడు. దాంతో మా అఫైర్ బ్రేకప్ జరిగింది. నా జీవితంలో కోలుకోలేని దెబ్బ పడింది అని ఇలియానా తెలిపారు.

అతడిని పూర్తిగా నమ్మాను
నా జీవితంలో ఆయనను నమ్మినంతగా మరొకరిని నమ్మలేదు. ఒక్కసారి కాదు పలుమార్లు నా నమ్మకాన్ని దెబ్బ తీశాడు. దాంతో నేను ఇచ్చే విలువకు, నా జీవితానికి సరైన వ్యక్తి కాదని భావించాను. అతని మోసం నుంచి త్వరగా బయటపడ్డాను. జీవితంలో ఓ మంచి గుణపాఠం నేర్చుకొన్నాను అని ఇలియానా పేర్కొన్నది.

టాలీవుడ్ హీరో అనే రూమర్
దక్షిణాదికి చెందిన ఆ హీరో టాలీవుడ్‌కు చెందిన వారేననే రూమర్ మీడియాలో అప్పట్లో వైరల్ అయింది. అతడి పేరును చెప్పడానికి ఇలియానా అంగీకరించలేదు. ఆ సందర్భంగా మాట్లాడుతూ.. మగవారిని అంతగా తేలిగ్గా నమ్మకూడదనే విషయాన్ని అతడిని చూసి నేర్చుకొన్నాను అని ఇలియానా అభిప్రాయపడ్డారు.

మానసికంగా, శారీరకంగా
ఆ హీరోతో బ్రేకప్ తర్వాత మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా కుంగిపోయాను. కానీ తొందరగానే బయటపడి మానసికంగా బలంగా తయారయ్యాను. ఆ బాధ నుంచి త్వరగా కోలుకోవాలని, ఆ విషయాన్ని పీడకలలా మరిచిపోవాలని అనుకొన్నాను. నా నిర్ణయం నన్ను మరింత ధృడంగా మార్చింది అని ఇలియానా ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

బాలీవుడ్‌కే పరిమితం
దక్షిణాది సినీ రంగానికి దూరమైన ఇలియానా ప్రస్తుతం బాలీవుడ్‌పైనే ఆశలు పెంచుకొన్నది. కాగా, ఇటీవల వకీల్ సాబ్ చిత్రంలో పవన్ కల్యాణ్ సరసన నటించే అవకాశం వచ్చిందనే వార్త మీడియాలో ప్రచారం జరుగుతున్నది. అయితే అధికారికంగా ఇంకా ధృవీకరణ జరుగలేదు.

ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫర్‌తో
ఇక టాలీవుడ్‌కు దూరమైన తర్వాత 2014 నుంచి ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్ అండ్రూ నీబోన్‌తో డేటింగ్ చేస్తున్నది. ప్రస్తుతానికి అతడితోనే సహజీవనం చేస్తున్నదనే వార్తలు కూడా వచ్చాయి. వారిద్దరు కలిసి పలు పార్టీలలో చెట్టాపట్టాల్ వేసుకొని బహిరంగంగానే కనిపించారు. ఈ మధ్యలో తన భర్త అనే కామెంట్‌ను తన ఇన్స్‌టాగ్రామ్‌లో పేర్కొన్నది.