ఆ డైరెక్టర్‌తో ఇలియానాకు చేదు అనుభవం.. స్టార్ హీరోయిన్ భర్త జోక్యంతో.. !
సినిమా తారలకు తమ కెరీర్‌లో కొన్నిసార్లు ఊహించిన సంఘటనలు ఎదురవుతుంటాయి. డైరెక్టర్లు, తోటి యాక్టర్లు, తన హీరోతో ఏదో ఒక విషయంలో అభిప్రాయ బేధాలు తలెత్తుతుంటాయి. అలాంటి మానసికంగా తీవ్ర ప్రభావం చూపుతుంటాయి. కొన్నిసార్లు కెరీర్‌ను డిసైడ్ చేసేవి అయితే.. మరొకొన్ని వ్యక్తిగతంగా డిస్ట్రబ్ చేస్తుంటాయి. ఇలాంటి ఒక చేదు అనుభవం ఇలియానాకు ఎదురైందట. ఇటీవల ఆమె జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ..
తన తొలి చిత్రం దేవదాస్ మూవీతో హిట్టు కొట్టేసిన ఇలియానా డిసౌజా పోకిరి సినిమా తర్వాత స్టార్ హీరోయిన్‌గా మారిపోయారు. స్టార్ హీరోలు, అగ్ర హీరోలందరితో కలిసి నటించారు. అయితే టాలీవుడ్‌లో తన కెరీర్ గ్రాఫ్ దూసుకెళ్తున్న సమయంలోనే ఆమె బాలీవుడ్‌పై కన్నేసింది. ఆ క్రమంలోనే ఆమె బర్ఫీ అనే చిత్రంలో నటించింది. రణ్‌బీర్ కపూర్ నటించిన ఆ చిత్రానికి అనురాగ్ బసు దర్శకత్వం వహించగా.. విద్యా బాలన్ భర్త, ప్రొడ్యూసర్ సిద్దార్థ్ రాయ్ కపూర్ నిర్మించారు.

బర్ఫీ షూటింగులో తనకు ఎదురైన చేదు సంఘటనను వెల్లడిస్తూ.. షూటింగ్ జోరుగా సాగుతున్న సమయం అది. అందరూ మంచి మూడ్‌లో ఉన్నాం. నేను కూడా చిల్ అవుతూ గుడ్ వైబ్‌తో ఉండి షూటింగ్‌కు వెళ్లాను. దర్శకుడు అనురాగ్ బసు సెట్లో ఉండగా.. ఎలా ఉన్నారు? షూటింగ్ ఎలా సాగుతుంది అంటూ క్యాజువల్‌గా పలకరించాను. దాంతో నాపై గొంతేసుకొని గట్టిగా అరిచారు. దాంతో అందరూ నైపు చూడటంతో నాకు చాలా బాధేసింది. ఆయన మూడ్ సరిగా లేదనుకొని ఏదో సర్ది చెప్పేందుకు ట్రై చేశాను. కానీ ఆయన రియాక్షన్ సరిగా లేకపోయిందనే విషయం అర్ధమైంది.
దాంతో అనురాగ్ బసుతో మాట్లాడుతూ.. నేను ఈ సినిమాలోని పాత్రకు కరెక్ట్ కాను అనుకొంటే.. నాకు చెప్పండి.. లేదంటే నన్ను తీసేయండి. నేను పెద్దగా పట్టించుకోను. మీరు అనుకొన్నట్టు పెర్ఫార్మెన్స్ ఇవ్వకపోతే నేనే ఈ సినిమాను వదులుకొంటాను. మిమ్మల్ని ఏ విధంగా కూడా బద్నాం చేయను. ఈ సినిమా కథ నచ్చి నేను ఒప్పుకొన్నాను. ఈ మూవీ చేసేటప్పుడు నేను సంతోషంగా లేకపోతే.. ఈ రోల్ చేయడంలో అర్దం లేదు అని చెప్పాను. అయితే నా మాటలకు సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు అని ఇలియానా తెలిపారు.
ఆ తర్వాత నిర్మాత సిద్దార్థ్ రాయ్ కపూర్‌కు వెంటనే ఫోన్ చేసి.. బర్ఫీ మూవీ నుంచి తప్పుకొంటున్నాను అని చెప్పాను. దాంతో ఏం జరిగిందంటూ నన్ను అడిగి.. నేను వచ్చే వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకు. నేను వెంటనే వస్తున్నానని చెప్పి అక్కడికి వచ్చాడు. నాతో మాట్లాడి మీకు ఎలాంటి సమస్య ఉండుదు. మీరు షూటింగ్ చేయండి అంటూ నాకు చెప్పారు. దాంతో నేను నా మనసు మార్చుకొని బర్ఫీ షూటింగ్‌లో పాల్గొన్నాను. లేకపోతే ఆ సినిమా నుంచి తప్పుకొనే దానిని. దాదాపు నేను అలా డిసైడ్ అయ్యాను అని ఇలియానా చెప్పారు.
ఇలియానా కెరీర్ విషయానికి వస్తే.. పెళ్లి తర్వాత ఆమె సినిమాలకు దూరంగా ఉంటున్నారు. 2024 సంవత్సరంలో తేరా క్యా హోగా లవ్లీ, దో ఔర్ దో ప్యార్ అనే సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. 2025లో ఆమె నటించిన సినిమాలు ఇంకా ప్రేక్షకుల ముందుకు రాలేదు. కొన్ని సినిమాల గురించి చర్చ జరుగుతున్నదని తెలిసింది.


Click it and Unblock the Notifications











