Nusrat Jahan భర్తకు విడాకులు... ప్రియుడితో హీరోయిన్ డేటింగ్.. గర్బం దాల్చిన యువ ఎంపీ!

బెంగాలీ స్టార్ హీరోయిన్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్ కొద్ది రోజులుగా జాతీయ మీడియాలో పతాక శీర్షికలను ఆకర్షిస్తూ వస్తున్నది. తన భర్తతో విడిపోయినట్టు ఆమె వెల్లడించిన వార్తలు మీడియాలో సంచలనంగా మారాయి. అయితే ఇలాంటి వార్తలు సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న క్రమంలో నుస్రత్ గురించి మరో బాంబు పేలింది. ఆమె గర్బవతి అంటూ జాతీయ మీడియాలో రూమర్లు వైరల్ అవుతున్నాయి. ఈ రూమర్ల వివరాల్లోకి వెళితే...

చిన్న వయసులోనే ఎంపీగా

చిన్న వయసులోనే ఎంపీగా

బెంగాల్‌లో టాప్ హీరోయిన్‌గా రాణిస్తున్న సమయంలో 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బసిర్హత్ నియోజకవర్గం నుంచి అతి చిన్న వయసులో ఎంపిగా ఎన్నికయ్యారు. ఎంపీగా ఎన్నికైన కొద్ది రోజులకే ఆమె టర్కీ వివాహ చట్టాల ప్రకారం పారిశ్రామిక వేత్త నిఖిల్ జైన్‌ను వివాహం చేసుకొన్నారు. వ్యక్తిగత అభిప్రాయ బేధాలు రావడంతో నవంబర్ 2020లో విడిపోయినట్టు నుస్రత్ వెల్లడించారు.

భర్తతో తెగతెంపులు

భర్తతో తెగతెంపులు

నిఖిల్ జైన్‌తో తెగ తెంపులు చేసుకొన్నట్టు మీడియాకు వెల్లడించిన తర్వాత మాజీ భర్త నిఖిల్ జైన్ ఫోటోలను తన ఇన్స్‌టాగ్రామ్ నుంచి డిలీట్ చేశారు. నిఖిల్‌తో రిలేషన్‌షిప్‌కు సంబంధించిన ఎలాంటి ఆధారం లేకుండా వీడియోలను, ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ల నుంచి పూర్తిగా తొలగించారు. హానీమూన్ సమయంలో నిఖిల్ తీసిన కొన్ని ఫోటోలు ఇన్స్‌టాగ్రామ్లో దాచుకొన్నారు.

యష్ దాస్ గుప్తాతో డేటింగ్

యష్ దాస్ గుప్తాతో డేటింగ్

అయితే నుస్రత్ జహాన్ విడిపోవడానికి యువ రాజకీయ వేత్త, సినీ నటుడు యష్ దాస్ గుప్తాతో డేటింగ్ వ్యవహారమే అసలు కారణం అని రూమర్లు గుప్పుమన్నాయి. కొద్ది రోజులుగా నుస్రత్, యష్ దాస్ గుప్తా సన్నిహితంగా ఉంటూ వస్తున్నారనే విషయం మీడియాలో స్పష్టమైంది. తమ రిలేషన్‌షిప్ గురించి వస్తున్న వార్తలపై దాస్ కూడా పరోక్షంగా అవునంటూ క్లారిటీ ఇచ్చారు.

నుస్రత్ జహాన్ గర్బవతి అంటూ

నుస్రత్ జహాన్ గర్బవతి అంటూ

ఇదిలా ఉండగా, భర్తతో విడిపోయిన తర్వాత నుస్రత్ జహాన్ గర్భవతి అంటూ జాతీయ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. తన స్నేహితురాళ్లు, సహ నటులు స్రబంతీ చటర్జీ, ఇతరులతో దిగిన ఫోటోల్లో గర్భం స్పష్టంగా కనిపించడం అనేక అనుమానాలకు తెర దించింది. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్‌గా మారింది.

నుస్రత్‌తో యష్ దాస్ గుప్తా అఫైర్ అలా

నుస్రత్‌తో యష్ దాస్ గుప్తా అఫైర్ అలా


యష్ దాస్ గుప్తా వ్యక్తిగత, ప్రొఫెషనల్ విషయానికి వస్తే.. హిందీ టెలివిజన్ రంగంలో బెంగాలీ సినీ పరిశ్రమలోకి నటుడిగా రాణించారు. విదేశాల్లో పెరిగి.. ఉన్నత విద్యను అభ్యసించిన ఆయన సినీ బెంగాల్ సినీ పరిశ్రమలో గుర్తింపు పొందారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలకు ముందు మోదీ పాలన, విధానాలకు ఆకర్షితుడై బీజేపీలో చేరారు. ఎస్ఓఎస్ కోల్‌కతా సినిమాలో నుస్రత్‌తో కలిసి నటించాడు.. ఆ సందర్భంగా వారిద్దరూ లవ్‌లో పడ్డారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X