Sai Pallavi పెళ్లి చేసుకోబోతున్న సాయిపల్లవి.. సినిమాలకు దూరంగా అందాల భామ

మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్ సాయిపల్లవి సినిమాల ఎంపికలో ఆచీతూచి వ్యవహరిస్తుంటారు. తనకు స్క్రిప్ట్ నచ్చితే గానీ.. సినిమాకు ఒకే చెప్పదనేది ఇండస్ట్రీలో టాక్. డబ్బు కోసం సినిమా చేయదనేది సాయిపల్లవి నైజం అనేది ఇండస్ట్రీలో ప్రతీ ఒక్కరికి తెలుసు. భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసినా సాయిపల్లవి అగ్రహీరోల సినిమాలను కూడా నిరాకరించిన సందర్భాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం సాయిపల్లవి సినిమాలు ఒప్పుకోకుండా ఉండటం ఇప్పుడు దక్షిణాది సినిమా పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే సాయిపల్లవి సినిమాలు ఒప్పుకోకపోవడం వెనుక అసలు కారణం ఇదే అంటూ మీడియాలో రూమర్లు వస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

ఇటీవల సాయిపల్లవి నటించిన శ్యామ్ సింగరాయ్ రిలీజ్ అయినప్పటి నుంచి ఆమె మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సమాచారం లేదు. భారీ ఆఫర్లు ఆమెను పలకరిస్తున్నా ఆమె నిరాకరిస్తుండటం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ విషయం వెనుక కారణం ఆమె పెళ్లికి సిద్దమవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

Is Sai Pallavi getting ready for the Marriage, Reason is here

అయితే రెండు, మూడు సంవత్సరాలుగా సాయిపల్లవి తన పెళ్లి గురించి ఆలోచిస్తున్నారు. NGK మూవీ సమయంలో తనకు పెళ్లి చేసుకోవడం ఇప్పుడే ఇష్టం లేదు. ఒకవేళ నేను పెళ్లి చేసుకొంటే కేవలం భర్త కోసమే జీవించే సమయం ఉంటే.. అప్పుడు పెళ్లి చేసుకొంటాను అని చెప్పింది.

అయితే ప్రస్తుతం సాయిపల్లవి పెళ్లి చేసుకొనే ఆలోచనల్లో ఉన్నారు. ఆమె తల్లిదండ్రులు వరుడి కోసం వెతుకుతున్నారు. త్వరలోనే ఆమె పెళ్లి చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. అందుకే సాయిపల్లవి సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకొన్నారు అనే వార్తలు మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి. అయితే ఈ విషయంపై సాయిపల్లవి క్లారిటీ రాలేదు. ఒకవేళ ఈ విషయంపై సాయిపల్లవి స్పందిస్తే తప్ప.. ఈ రూమర్లుకు తెరపడదు.

Is Sai Pallavi getting ready for the Marriage, Reason is here

ఇక సాయిపల్లవి సినిమాల విషయానికి వస్తే.. ఆమె నటించిన విరాటపర్వం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రంలో రానా దగ్గుబాటి, ప్రియమణి తదితరులు నటించారు. వేణు ఊడుగుల సినిమాకు దర్శకత్వం వహించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X