‘టాప్ డైరెక్టర్ కమిట్‌మెంట్ అడిగాడు.. చెంపలు వాయించేశా’

సినిమా ఇండస్ట్రీ అనగానే గ్లామర్, స్టార్‌డమ్, ఫేమ్ గుర్తుకు వస్తాయి. ఈ రంగుల ప్రపంచంలో హీరోయిన్ గా నిలదొక్కుకోవడం మామూలు విషయం కాదు. స్టార్‌డమ్ కోసం ఎంతోమంది యంగ్ హీరోయిస్ పోటీపడుతున్నారు. తెలుగు సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో దుమ్మురేపుతున్న ఈ కాలంలో సినిమా ఆఫర్ రావడమంటే చాలా కష్టమే. ఈ తరుణంలో కాస్టింగ్ కౌచ్ అనే మాట తరుచుగా వినిపిస్తున్నాయి. ప్రతీ విషయంలో ఈ సమస్య చర్చనీయాంశమవుతోంది. తాజాగా ఓ బజర్దస్త్ బ్యూటీ.. సినిమా ఆఫర్ అడిగితే.. కమిట్మెంట్ అడిగారంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇంతకీ ఆ స్టోరీ ఏంటీ? ఆ బాధితురాలు ఏవరు?

గత కొన్ని సంవత్సరాల ఇండస్ట్రీలో క్యాషింగ్ కౌచ్, కమిట్మెంట్ అనే పదాలు హాట్ టాపిక్‌గా మారాయి. ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చే హీరోయిన్స్‌కు మంచి అవకాశాలు వస్తాయని నమ్మబలికి, మాయమాటలతో లోబరుచుకోవడం. ఆఫర్ల కోసం బలవంతం చేయడం. ఏ హీరో, ఏ డైరెక్టర్‌ అడిగితే కమిట్‌మెంట్ ఇవ్వాలి, దానికి ఎంత రెమ్యూనరేషన్ వస్తుందో ముందే చెప్పి వారిని ఒప్పించడం. చివరికి ఆ డబ్బులను, ఆ కాంటాక్టులను తానే లాక్కోవడం వంటి ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి జబర్థస్త్ బ్యూటీ ఐశ్వర్య షాకింగ్ కామెంట్స్ చేసింది.

Jabardasth Aishwarya Shocking Comments on Casting Couch and Film Offers

'జబర్దస్త్', 'ఎక్స్‌ట్రా జబర్దస్త్', 'శ్రీదేవి డ్రామా కంపెనీ'లాంటి కామెడీ షోలు అనేక మంది ఆర్టిస్టుల కెరీర్‌ను మార్చేశాయి. మొదట్లో ఎక్కువగా మేల్ కమెడియన్స్ మాత్రమే మెరిపించినా, ఇప్పుడు లేడీస్ కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. రోహిణి, రీతూ చౌదరి, వర్ష, ఐశ్వర్య లాంటి టాలెంటెడ్ ఆర్టిస్టులు తమ కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ, ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ఇందులో ఐశ్వర్య ఒకరు, ఇటీవల జబర్థస్త్ నటి ఐశ్వర్య ఓ ఇంటర్యూలో మాట్లాడుతూ సినిమా ఆఫర్లపై షాకింగ్ కామెంట్స్ చేసింది.

ఇండస్ట్రీలో ఎప్పుడైనా కమిట్మెంట్ కాస్టింగ్ కౌచ్ ఇలాంటి అనుభవాలను ఎదుర్కొన్నారా? అని ప్రశ్నించగా.. 'కెరీర్ ప్రారంభంలో కథలను తరచుగా వినే దాన్ని, తర్వాత కాల్ చేసి మాట్లాడతామని వారు చెప్పేవారు. అగ్రిమెంట్ ముందు రోజు కాల్ చేసి, నువ్వంటే క్రష్ ఉందట డైరెక్టర్ కు, హీరోకు అంటూ కాల్స్ చేసేవాళ్లు. అలాంటి కాల్స్ ను వెంటనే రిజెక్ట్ చేసేవాన్ని. వాస్తవానికి ఇండస్ట్రీలోకి వచ్చిన తొలిరోజుల్లో కమిట్మెంట్ అంటే సరైన అర్థం తెలియక ఇబ్బంది పడ్డ. మూవీ మేకర్స్ కమిట్మెంట్ గా ఉండాలంటే.. నేను చాలా కమిట్మెంట్ గా ఉంటాను హార్డ్ వర్క్ చేస్తాను అంటూ చెప్పేదాన్ని. తీరా అసలు విషయం చెప్పేసరికి షాక్ అయినా ఘటనలు ఉన్నాయంటూ ఎమోషనల్ అయ్యింది.

'కమిట్మెంట్ అంటే హార్డ్ వర్క్ అనుకునేదాన్ని. ఒకసారి ఇలానే జరిగితే డైరెక్టర్ ను కొట్టి మరి అక్కడి నుండి వచ్చేసా' అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. కానీ ఆ డైరెక్టర్ ఎవరు? అనే విషయాన్ని మాత్రం బయట పెట్టలేదు జబర్దస్త్ ఐశ్వర్య. ఆ తర్వాత తన వ్యక్తిగత విషయాలను చెబుతూ తన జీవితంలో లవ్ ఫెయిల్యూర్ చాలా ఇబ్బంది పెట్టిందని, ప్రేమ పెళ్లి అనే విషయాలను చాలా దూరం పెట్టానని, ఫ్యూచర్ లో కూడా సింగిల్ గా ఉండడానికి ట్రై చేస్తాను అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. మొత్తానికి జబర్దస్త్ ఐశ్వర్య చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారుతున్నాయి. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు అంటూ నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు ఆఫర్లు కావాలంటే కమిట్మెంట్స్ కామన్ అయిపోయింది అంటూ వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X