twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Jacqueline Fernandez కోర్టులో జాక్వలైన్‌కు చేదు అనుభవం..200 కోట్ల కుంభకోణం కేసులో..

    |

    బడా పారిశ్రామికవేత్తలను, వ్యాపారస్థులను బెదిరించి బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న సుకేష్ చంద్రశేఖర్ కేసుకు సంబంధించిన వ్యవహారంలో జాక్వలైన్‌కు ఊరట లభించింది. ఈ కేసులో అరెస్ట్‌ కాకుండా ముందస్తు బెయిల్‌ను కోరిన జాక్వలైన్‌కు కోర్టు సానుకూలంగా స్పందించింది. ఈ కేసుకు సంబంధించి బెయిల్ కోసం కోర్టుకు వెళ్లిన జాక్వలైన్ ఫెర్నాండేజ్‌కు చేదు అనుభవం ఎదురైంది. 200 కోట్ల కుంభకోణానికి సంబంధించిన వివరాలు, జాక్వలైన్‌కు సంబంధాల గురించిన వివరాల్లోకి వెళితే..

     తీహార్ జైలు నుంచి సుకేష్ చంద్రశేఖర్

    తీహార్ జైలు నుంచి సుకేష్ చంద్రశేఖర్

    దేశంలోని ప్రముఖ ఫార్మా కంపెనీ అధినేతలను బెదిరించి బలవంతంగా వసూళ్లకు పాల్పడటంపై సుకేష్ చంద్రశేఖర్‌ను అరెస్ట్ చేసి.. తీహార్ జైల్లో పెట్టారు. అయితే తీహార్ జైలు నుంచి ఫోన్ ద్వారా బెదిరింపులకు పాల్పడటం.. దందా చేయడం విషయం వెలుగులోకి వచ్చింది. దాంతో విచారణ జరుపగా అమిత్ షా పీఏను అంటూ బెదిరించారనే విషయం బయటపడింది.

    సుకేష్‌తో జాక్వలైన్‌కు సన్నిహిత సంబంధాలు

    సుకేష్‌తో జాక్వలైన్‌కు సన్నిహిత సంబంధాలు

    అలాగే సుకేష్ చంద్రశేఖర్‌కు జాక్వలైన్ ఫెర్నాండేజ్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే విషయం ఈడీ, ఇతర దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఆ తర్వాత పలుమార్లు ఆమెను ఈడీ విచారించింది. విచారణలో జాక్వలైన్ బ్యాంకు అకౌంట్‌కు భారీగా డబ్బు ట్రాన్స్‌ఫర్ అయినట్టు ఆధారాలు లభించాయి. ఆ తర్వాత చంద్రశేఖర్ అనుచరురాలు పింకీ ఇరానీ, జాక్వలైన్‌పై ఈడీ సప్లిమెంటర్లీ చార్జీషీట్ దాఖలు చేసింది.

    జాక్వలైన్ అకౌంట్ సీజ్

    జాక్వలైన్ అకౌంట్ సీజ్

    జాక్వలైన్ ఫెర్నాండేజ్‌ను విచారిస్తున్న సమయంలోనే సుకేష్ చంద్రశేఖర్ నుంచి ఆమెకు అక్రమంగా డబ్బు ట్రాన్స్‌ఫర్ అయినట్టు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా జాక్వలైన్ అకౌంట్‌లోని 7.2 కోట్ల మొత్తాన్ని సీజ్ చేశారు. ఇంకా విలాసవంతమైన గిఫ్టులు, ఆస్తులు కూడా ఆమెకు సుకేష్ చంద్రశేఖర్ గిఫ్టుగా ఇచ్చినట్టు స్పష్టమైంది.

     అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి

    అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి

    సుకేష్ చంద్రశేఖర్ కేసులో అరెస్ట్ తప్పించుకోవడానికి జాక్వలైన్ కోర్టును ఆశ్రయించింది. ఈ కేసును విచారించిన న్యాయమూర్తి శైలెందర్ మాలిక్ ముందస్తు బెయిల్ మంజూరు చేశారు. దాంతో జాక్వలైన్‌కు ఈ కేసులో ఊరట లభించింది. అయితే కోర్టు ప్రాంగణంలో జాక్వలైన్ కనిపించగానే.. అడ్వకేట్లు, సాధారణ జనం మూకుమ్మడిగా మీదపడిపోయారు.

    కోర్టు బయట జాక్వలైన్ మీద పడ్డ జనం

    జాక్వలైన్ కోర్టు హాలు నుంచి తన లాయర్లతో కలిసి బయటకు వస్తుండగా ఒక్కసారిగా మీడియా, సాధారణ జనం, లాయర్లు ఆమెను మూకుమ్మడిగా చుట్టుముట్టారు. ఈ సందర్భంగా జాక్వలైన్ ఇబ్బంది పడటమే కాకుండా గందరగోళానికి గురయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తూ.. మీరు తప్పు చేశారు.. కెమెరాలను ఆమె ముఖంపైకి తోయాల్సి ఉందని అన్నారు.

    English summary
    Bollywood Actres sJacqueline Fernandez surrounded heavy mob at Court. Actress gets Bail in Sukesh ChandraSekhar case which 200 crores scam.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X