Janhvi Kapoor: ఇక దాచేది ఏదీ లేదు.. ప్లాస్టిక్ సర్జరీపై జాన్వీ క్లారిటీ !
బాలీవుడ్ స్టార్ కిడ్స్‌లో జాన్వీ కపూర్ (Janhvi Kapoor) ఒకరు. దివంగత స్టార్ హీరోయిన్ శ్రీదేవి వారసురాలిగా తెరపైకి వచ్చిన ఈ యువ నటి తన గ్లామర్‌తో, నటనతో, స్టైల్‌తో అభిమానులను ఆకట్టుకుంటోంది. తరుచు ఎప్పుడూ వార్తల్లో ఉంటూనే ఉంటుంది. అయితే ఆమె రూపం, లుక్స్, సర్జరీ రూమర్స్ పై సోషల్ మీడియాలో తరచూ చర్చ జరుగుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో తాజాగా జాన్వీ కపూర్ స్వయంగా తన ప్లాస్టిక్ సర్జరీ విషయంపై స్పందించి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇంతకీ ఏమన్నారంటే?
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ తాజాగా కాజోల్ - ట్వింకిల్ హోస్ట్ చేస్తున్న టాక్ షో 'టూ మచ్ విత్ కాజోల్ అండ్ ట్వింకిల్'(Two Much with Kajol & Twinkle) లో పాల్గొంది. ఈ షోలో ఆమె తన రూపం, బ్యూటీ స్టాండర్డ్స్, సర్జరీలపై మొదటిసారిగా ఓపెన్‌గా మాట్లాడింది. ఆమె చెప్పిన మాటలు ప్రస్తుతం బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.

జాన్వీ కపూర్ మాట్లాడుతూ, "కాస్మెటిక్ వీడియోలు చూసి యువత తప్పు నిర్ణయాలు తీసుకోవద్దు. సోషల్ మీడియాలో కొందరు తప్పుడు సలహాలు ఇస్తారు. ఎవరో డాక్టర్‌లుగా నటిస్తూ, ఒక నటికి చేసిన సర్జరీల లిస్ట్ చూపిస్తూ వీడియోలు చేస్తారు. అలా నా ఫోటో పెట్టి 'బఫెలో ప్లాస్టీ' చేసుకుందట అని చెప్పారు. నేను చూసి షాక్ అయ్యా. అలాంటి తప్పుడు సమాచారం విని ఎవరైనా యువతి ప్రయత్నించి ఏదైనా తప్పు జరిగితే, అది భయంకరమైన విషయం. అందుకే పారదర్శకత చాలా ముఖ్యం"అని అన్నారు.
ఈ సందర్భంగా జాన్వీ కపూర్ యువత ఒక సందేశం ఇచ్చారు. "యువతులు తమ శరీరాన్ని ప్రేమించాలి. మనం మనల్ని అంగీకరించడం సిగ్గు కాదు. సోషల్ మీడియాలో వచ్చే విమర్శలు మన మనసును ప్రభావితం చేయొద్దు. ప్రతి ఒక్కరికీ అందం అంటే వేరు. ఎవరు చెప్పిన స్టాండర్డ్స్‌కి లోబడవద్దు" అని చెప్పింది. అలాగే జాన్వీ కపూర్ యువ నటీమణులకు సలహా ఇచ్చింది. "దేవుడు మనల్ని సృష్టించాడు. మనకు నచ్చని చిన్న చిన్న విషయాలను మేకప్‌తో మార్చుకోవచ్చు. కానీ సర్జరీ చేయాలా వద్దా అనేది మన వ్యక్తిగత నిర్ణయం కావాలి, ఒత్తిడితో కాదు"అని పేర్కొన్నారు.
జాన్వీ కెరీర్ అప్‌డేట్
జాన్వీ కపూర్ ఇటీవల "సన్నీ సంస్కారి కి తుల్సి కుమారి" (Sunny Sanskari Ki Tulsi Kumari), "హోంబౌండ్" (Homebound) చిత్రాల్లో కనిపించింది. ప్రస్తుతం మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ సరసన నటిస్తున్న పెద్ది (Peddi)సినిమాలో నటిస్తోంది. ప్రస్తుతం జాన్వీ కపూర్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఫేక్ రూమర్స్‌కి గుడ్‌బై చెబుతూ "నిజం చెప్పడమే అందం" అని చెప్పిన జాన్వీ ఈ తరం యువతులకు స్ఫూర్తిగా నిలిచింది.


Click it and Unblock the Notifications











