‘శారీరక సుఖాలు తప్పుకాదు... వాళ్ల కోరికల్ని భరించాల్సిందే’
సినిమాలతో పాటు సీరియల్స్, వెబ్ సిరీస్‌లు ఇతర వినోద కార్యక్రమాల్లో ఇటీవలి కార్యక్రమాల్లో బూతు కంటెంట్ విస్తృతంగా చక్కర్లు కొడుతోంది. ఇలాంటి వాటి వల్ల పిల్లలు, యువత తప్పుదోవ పడతారని మేధావులు, సాంప్రదాయవాదులు మండిపడుతున్నారు. బిగ్‌బాస్ వంటి రియాలిటీ షోలను నిషేధించాలని ఇప్పటికే పెద్ద ఎత్తున వాదనలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇంటర్వ్యూలు, పాడ్‌కాస్ట్‌లలోనూ ఇదే తరహా కంటెంట్ వస్తుండటం ఆశ్చర్యపరుస్తోంది. బాలీవుడ్ సీనియర్ హీరోయిన్లు ట్వింకిల్ ఖన్నా, కాజోల్, కరణ్ జోహార్ నిర్వహిస్తోన్న టూ మచ్ అనే టాక్ షోలో కంటెంట్ వివాదాస్పదమవుతోంది. తాజాగా స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ ఈ కార్యక్రమానికి గెస్ట్‌గా హాజరవ్వగా.. ఆమెను ఈ ముగ్గురు సీనియర్లు అడిగిన ప్రశ్నలు దారుణంగా ఉన్నాయి. ఈ వివరాల్లోకి వెళితే..
జాన్వీకి వరుస ఫ్లాపులు
అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలిగా వెండితెరపై అడుగుపెట్టారు జాన్వీకపూర్. అయితే కెరీర్ విషయంలో ఈ ముద్దుగుమ్మ సరైన ప్లానింగ్‌తో వెళ్లడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఆమె ఎన్నో ఆశలు పెట్టుకుని నటించిన పరం సుందరి, సన్నీ సంస్కారి తులసి సినిమాలు నిరాశ పరిచాయి. టాలీవుడ్‌లో రామ్ చరణ్ తేజ్, జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోల సరసన నటించిన ఆమెకు.. బాలీవుడ్‌లో మాత్రం ఇంకా టైర్ 2 హీరోల సరసనే అవకాశాలు దక్కుతున్నాయి.

శిఖర్‌తో జాన్వీ కపూర్ డేటింగ్
నటన, అందం, డ్యాన్స్ ఇలా అన్ని విషయంలోనూ టాలెంటెడ్ అని నిరూపించుకున్న జాన్వీకి సరైన హిట్స్ పడటం లేదు. స్క్రిప్ట్ , పాత్రల ఎంపికలో జాన్వీ కపూర్ తప్పు చేస్తున్నారని విమర్శకులు చెబుతున్నారు. ప్రస్తుతం జాన్వీ చేతిలో బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పెద్ది తప్పించి మరో సినిమా లేదు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న దేవర 2 ఎప్పుడు మొదలవుతుందో తెలియదు. అయితే జాన్వీ కపూర్ ఎఫైర్లు, రిలేషన్‌లతోనూ వార్తల్లో నిలుస్తున్నారు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడు శిఖర్ పహారియాతో ఆమె డేటింగ్ చేస్తున్నారు. త్వరలోనే ఈ జంట పెళ్లి పీటల మీదకు ఎక్కుతుందని భావిస్తున్నారు.
ఏ చీటింగైనా తప్పేనన్న జాన్వీ
తాజాగా టూ మచ్ టాక్ షోకు జాన్వీ కపూర్ గెస్ట్‌గా వచ్చారు. ఈ సందర్భంగా ఆమెను కాజోల్, ట్వింకిల్, కరణ్‌లు రకరకాల ప్రశ్నలతో టార్గెట్ చేశారు. ఈ క్రమంలోనే శారీరక సంబంధం, ఎమోషనల్ సంబంధం అనే అంశంపై నలుగురు డిస్కస్ చేస్తూ ఎవరి అభిప్రాయాల్ని వారు చెప్పుకొచ్చారు. అయితే పార్ట్‌నర్ ఫిజికల్ చీటింగ్ కంటే ఎమోషనల్ చీటింగ్ చేయడాన్ని పెద్ద ద్రోహంగా కాజోల్, కరణ్ జోహార్, ట్వింకిల్ ఖన్నాలు అభిప్రాయపడ్డారు. అయితే జాన్వీ మాత్రం ఏ సమాధానం చెప్పుకోవాలో తెలియక ఆలోచనలో పడింది. కానీ తన దృష్టిలో రెండూ తప్పేనని తేల్చేసింది.
శారీరక సంబంధాలు తప్పుకాదట
ఈ ఆన్సర్‌ని మెచ్చుకోవాల్సిన పెద్ద వయస్కులైన ట్వింకిల్, కాజోల్, కరణ్‌లు ఆమెతో గొడవకు దిగారు. శారీరక సంబంధాలు పెద్ద తప్పేం కాదన్నట్లుగా వాదించారు. ఫిజికల్ చీటింగ్ కారణంగా బంధాలు నాశనం కావని కరణ్ అనగా.. జాన్వీ మాత్రం వేరే వారితో సంబంధాలు పెట్టుకుంటే బంధం నాశనం అవుతుందని చెప్పింది. ట్వింకిల్ మాట్లాడుతూ.. జాన్వీ ఇంకా చిన్న పిల్ల 30 క్రాస్ చేయలేదు కదా.. 50 ఏళ్లు వస్తే మనం ఎందుకు ఇలా చెప్పామో అర్ధమవుతుందని అంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు ట్వింకిల్, కాజోల్, కరణ్ జోహార్‌లపై మండిపడుతున్నారు. జీవిత భాగస్వామి లేదా ప్రియుడు మరొకరితో సంబంధాలు పెట్టుకోవడం కరెక్ట్ కాదని చెబుతున్నారు.
భర్తను వదిలేయాల్సిందేనన్న కాజోల్
అయితే ట్వింకిల్ భర్త అక్షయ్ కుమార్‌కు గతంలో రవీనా టాండన్‌తో ఎఫైర్ నడిచి ఇద్దరికీ ఎంగేజ్‌మెంట్ కూడా జరిగి మధ్యలోనే పెటాకులైంది. అలాగే శిల్పా శెట్టితోనే అక్షయ్ కుమార్ ప్రేమాయణం సాగించాడు. ఇక కాజోల్ విషయానికి వస్తే.. ఆమె భర్త అజయ్ దేవగణ్ తొలుత కరిష్మా కపూర్‌తో ప్రేమాయణం సాగించాడు. అయితే కాజోల్‌తో పెళ్లాయ్యాక ఇద్దరూ బాలీవుడ్‌లో స్టార్ కపుల్స్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే గతంలో ఓ ఇంటర్వ్యూలో భార్యాభర్తల రిలేషన్ గురించి కాజోల్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. భర్త చేసే కొన్ని పనులన్ని చూసీచూడనట్లుగా ఉండాలని కాజోల్ వ్యాఖ్యానించారు. దాని వల్లే తన వైవాహిక జీవితం సాఫీగా సాగిపోతోందని చెప్పారు. దాంతో అప్పట్లో కాజోల్‌పై నెటిజన్లు విరుచుకుపడ్డారు.


Click it and Unblock the Notifications











