For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  వాళ్ల దెబ్బకు బోల్డ్ క్యారెక్టర్లు చేయాలంటేనే భయపడిపోతున్న కాజల్

  By Manoj Kumar P
  |

  ఒకప్పుడు చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా గడిపింది టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్. వరుస విజయాలు సాధిస్తూ తెలుగు సినీ ఇండస్ట్రీలోని అందరు స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. ఈ క్రమంలోనే టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా వెలుగొందింది. అదే సమయంలో రెమ్యూనరేషన్ కూడా భారీగా తీసుకుంటూ రికార్డులు స‌ృష్టించింది. అయితే, ఇప్పుడు మాత్రం దానికి భిన్నమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఒకవైపు హిట్‌లు లేక మరోవైపు అవకాశాలు రాక ఇబ్బంది పడుతోంది. తాజాగా ఆమె మరో సంచలన నిర్ణయం తీసుకుందట. పూర్తి వివరాల్లోకి వెళితే..

  సూపర్ హిట్ సినిమా రీమేక్

  సూపర్ హిట్ సినిమా రీమేక్

  బాలీవుడ్‌లో కంగనా నటించిన ‘క్వీన్' ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ఈ సినిమాను అన్ని భాషల్లో రీమేక్ చేయడానికి ప్రయత్నాలు చేశారు. ఇందులో భాగంగానే ఈ సినిమా తెలుగులో తమన్నా హీరోయిన్‌గా ‘దటీజ్‌ మహాలక్ష్మి' పేరుతో తెరకెక్కింది. కన్నడంలో పరూల్‌మాధవ్‌ హీరోయిన్‌గా ‘బటర్‌ఫ్లై' పేరుతోనూ, మలయాళంలో మంజిమామోహన్‌ హీరోయిన్‌గా ‘జామ్‌జామ్‌' పేరుతో, తమిళంలో కాజల్ మెయిన్ లీడ్‌గా ‘ప్యారిస్ ప్యారిస్' టైటిల్‌తో తెరకెక్కింది.

  అన్ని భాషల్లో ఓకే కానీ..

  అన్ని భాషల్లో ఓకే కానీ..

  ఈ సినిమా దక్షిణాదిలోని నాలుగు భాషల్లో రూపొందింది. మీడియంట్‌ ఫిలిం పతాకంపై మనుకుమార్‌ వీటిని నిర్మించారు. త్వరలోనే విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలో తెలుగు, కన్నడం, మలయాళం వెర్షన్లకు సెన్సార్‌ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్లను ఇచ్చారు. కానీ, తమిళ వెర్షన్‌కు మాత్రం ‘ఏ' సర్టిఫికెట్ జారీ చేశారు. దీంతో అందరూ షాక్‌కు గురయ్యారు.

  కమిటీని సంప్రదించినా ఫలితం లేదు

  కమిటీని సంప్రదించినా ఫలితం లేదు

  కాజల్ చిత్రానికి ‘ఏ' సర్టిఫికెట్ అవ్వడంతో పాటు 25 వరకూ ఆడియో, వీడియో కట్స్‌ను ఇచ్చారు. దీంతో చిత్ర యూనిట్ రివైజింగ్‌ కమిటీకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయం మీడియాకు వెల్లడించారు. కమిటీ ఈ సినిమాను చూసిన తర్వాత కూడా తమ నిర్ణయంలో ఎటువంటి మార్పులు చేయలేదు. దీంతో ఈ సినిమా వివాదం అలాగే ఉండిపోయింది.

  ఆ సీన్లు ఉండడం వల్లేనా?

  ‘ప్యారిస్ ఫ్యారిస్'లో బోల్డ్ సీన్స్, డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉన్నాయని టీజర్ చూస్తేనే అందరికీ అర్థం అయింది. అంతేకాదు, టీజర్‌లో కాజల్‌ బ్రెస్ట్‌ని మరో నటి ప్రెస్ చేయడం అప్పట్లో సంచలనమైంది. ఇందులో అలాంటి సీన్స్ ఇంకా ఉన్నాయని కూడా ప్రచారం జరిగింది. ఇప్పుడు కట్స్ రావడంతో ఇది నిజమేనన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దీంతో ఈ సినిమా విడుదలపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

  కాజల్ వివరణ ఇచ్చిందిలా

  కాజల్ వివరణ ఇచ్చిందిలా

  ఈ సినిమా వివాదంపై కొద్ది రోజుల క్రితం ఓ చానెల్ ఆమెను ప్రశ్నించగా.. ‘మా ‘ప్యారిస్ ప్యారిస్'కు సెన్సార్ సమస్యలు వచ్చాయని తెలిసి ఆశ్యర్యపోయా. ‘క్వీన్' ఎలా ఉందో తమిళంలో కూడా అలాగే తెరకెక్కించాం. అదనంగా ఏమి లేదు. మరి ప్రాబ్లెమ్ ఎక్కడ వచ్చిందో తెలియదు. నిర్మాతలు ఈ విషయమై రివైజింగ్ కమిటీకి వెళ్లారు. వాళ్లు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి' అంటూ చెప్పుకొచ్చింది.

  #CineBox : Mahesh Babu Sarileru Neekevvaru Movie Updates !
  సంచలన నిర్ణయం తీసుకున్న చందమామ

  సంచలన నిర్ణయం తీసుకున్న చందమామ

  గతంలో ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ ‘పారిస్ పారిస్' విషయంలో జరిగిన వివాదంతో కాజల్ అగర్వాల్ అసంతృప్తిగా ఉందని తాజాగా ఓ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. అంతేకాదు, ఇకపై బోల్డ్ క్యారెక్టర్లు చేయకూడదని ఆమె నిర్ణయించుకుందని తెలుస్తోంది. రెమ్యూనరేషన్ కోసం చూసుకుంటే సినిమా వివాదాస్పదం అవడం ఎక్కువ డ్యామేజ్ చేస్తుందని ఆమె ఫీలైపోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై ఆమె ఫ్యాన్స్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

  English summary
  Kajal Aggarwal’s upcoming film Paris Paris has run into trouble with the Censor Board. The board asked the makers to make many visual and audio cuts and blurs for many scenes.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X