Don't Miss!
- News
‘భారత వ్యతిరేకి’ ఇల్హాన్ ఒమర్ శక్తివంతమైన యూఎస్ ఫారెన్ ఎఫైర్స్ ప్యానెల్ నుంచి ఔట్
- Lifestyle
లేడీస్ బి అలర్ట్! మీ బాయ్‌ఫ్రెండ్‌కు ఈ లక్షణాలు ఉంటే మీరు అతని పట్ల జాగ్రత్తగా ఉండాల్సిందే...!
- Finance
vodafone idea: బకాయిలను ఆ విధంగా కట్టమని వొడాఫోన్ ఐడియాకు ఆదేశం..
- Technology
ఒప్పో రెనో8 T 5G ఫస్ట్ లుక్: పవర్ ఫుల్ ఫీచర్లతో సెగ్మెంట్ లో బెస్ట్ ఫోన్
- Sports
విహారీ.. ఇది రివర్స్ స్వీప్ కాదు.. రివర్స్ స్లాప్: దినేశ్ కార్తీక్
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
కాజల్ అగర్వాల్ షాకింగ్ డెసీషన్: మరో సినిమా నుంచి ఔట్.. ప్రెగ్నెన్సీపై అలా క్లారిటీ
ఆకట్టుకునే అందం.. అద్భుతమైన నటన.. అదిరిపోయే హావభావాలతో హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకుంది టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్. చాలా కాలం క్రితమే సినిమాల్లోకి వచ్చిన ఈ బ్యూటీ.. అనతి కాలంలోనే అద్భుతమైన యాక్టింగ్, అదిరిపోయే అందంతో స్టార్ హీరోయిన్ అయిపోయింది. దీంతో చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయింది. అయితే, ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదు. దీనికి కారణం ఆమె పెద్దగా సినిమాలు చేయకపోవడమే. ఇలాంటి సమయంలో కాజల్ అగర్వాల్ తల్లి కాబోతుందంటూ ఓ న్యూస్ హాట్ టాపిక్ అవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ సినిమా నుంచి తప్పుకుందని తెలుస్తోంది. ఆ వివరాలు మీకోసం!

అలా వచ్చింది.. ఇలా ఫేమస్ అయింది
చదువు పూర్తైన వెంటనే మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించింది కాజల్ అగర్వాల్. ఈ క్రమంలోనే కల్యాణ్ రామ్ నటించిన 'లక్ష్మీ కల్యాణం'తో హీరోయిన్‌గా పరిచయం అయింది. ఆరంభంలోనే మెప్పించిన ఈ బ్యూటీ.. వరుసగా అవకాశాలను అందిపుచ్చుకుంది. ఫలితంగా ఎన్నో హిట్ చిత్రాల్లో భాగం అయింది. దీంతో లక్కీ హీరోయిన్‌గా పేరొంది రెమ్యూనరేషన్ కూడా బాగానే తీసుకుంది.
Bigg
Boss:
ఐదో
వారం
ఎలిమినేషన్లో
బిగ్
ట్విస్ట్..
తక్కువ
ఓట్లు
ఆమెకు..
బయటకు
వెళ్లేది
మాత్రం
అతడే!

అందరితోనూ ఆడిపాడిన ముద్దుగుమ్మ
ఆరంభంలోనే ఎన్నో హిట్లను అందుకోవడంతో కాజల్ పేరు టాలీవుడ్‌లో మారుమ్రోగిపోయింది. దీంతో ఆమెకు అవకాశాలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలను అందుకుంది. ఫలితంగా అప్పట్లో తన హవాను చూపించింది. ఇక, రోజులు గడిచిన కొద్దీ స్టార్లతోనే కాకుండా జూనియర్ హీరోల సినిమాల్లోనూ నటించింది. దీంతో ఆమె స్టార్ అయిపోయింది.

ఇప్పుడు స్పీడు తగ్గించేసిన హీరోయిన్
టాలీవుడ్‌లో కాజల్ అగర్వాల్ చాలా కాలం పాటు స్టార్‌డమ్‌ను కొనసాగించింది. ఇలా దాదాపు ఐదారేళ్ల పాటు చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా గడిపింది. ఈ క్రమంలోనే తెలుగుతో పాటు మరికొన్ని భాషల్లోనూ నటించింది. అయితే, ఇప్పుడు మాత్రం ఆమె సినిమాల వేగం తగ్గించేసింది. దీంతో పెళ్లి అయిన తర్వాత ఆమె కెరీర్ ముగిసిపోయిందన్న టాక్ గట్టిగా వినిపిస్తోంది.
బీచ్‌లో
లవర్‌తో
పాయల్
రాజ్‌పుత్
రచ్చ:
బికినీలో
అందాలన్నీ
చూపిస్తూ..
షాకిస్తోన్న
సెల్ఫీ
వీడియో

సీనియర్ హీరోలతో... దాని నుంచి ఔట్
ఒకప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలోని యంగ్ హీరోలతో ఆడిపాడిన కాజల్ అగర్వాల్ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 'ఆచార్య'లో హీరోయిన్‌గా చేస్తోంది. అలాగే, ప్రవీణ్ సత్తారు రూపొందిస్తోన్న 'ఘోస్ట్' మూవీలో అక్కినేని నాగార్జున నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అయితే, ఈ మూవీ నుంచి ఆమె తప్పుకున్నట్లు కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది.

కాజల్ అగర్వాల్ ప్రెగ్నెంట్.. అందుకే
ప్రియుడు గౌతమ్ కిచ్లుతో వివాహం జరిగిన తర్వాత కాజల్ అగర్వాల్ తల్లి కాబోతుందని కొద్ది నెలల క్రితం జోరుగా ప్రచారం జరిగింది. ఈ వార్తలపై ఆమె కుటుంబ సభ్యులు స్పందిస్తూ వాటిని కొట్టివేశారు. ఈ క్రమంలోనే ఇప్పుడు మరోసారి అలాంటి వార్తలే వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో నాగార్జున సినిమా నుంచి తప్పుకోవడంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరినట్లైంది.
హాట్ షో రెచ్చిపోయిన మోనాల్ గజ్జర్: గతంలో ఎన్నడూ చూడనంత ఘాటుగా.. ఆమెనిలా చూస్తే తట్టుకోలేరు!

కాజల్ షాకింగ్ డెసీషన్: మరో సినిమా
ఇప్పటికే నాగార్జున సినిమా నుంచి తప్పుకున్న కాజల్ అగర్వాల్.. ఇప్పుడు మరో చిత్రం నుంచి కూడా బయటకు వచ్చేసిందనే టాక్ వినిపిస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. తమిళంలో రూపొందుతోన్న 'రౌడీ బేబీ' నుంచి ఆమె తప్పుకుందట. ఈ చిత్రాన్ని శరవణన్ తెరకెక్కిస్తున్నాడు. దీని నుంచి కూడా తప్పుకోవడానికి కారణం ఆమె ప్రెగ్నెంట్ అవడమేనని అంటున్నారు.