For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  కాజల్ ‘బూతు’ సినిమా రెడీ: అవి టచ్ చేస్తూ సీన్స్.. అప్పుడు ఆగిపోయింది.. ఇప్పుడిలా వస్తోంది!

  |

  దాదాపు పదిహేనేళ్లుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది చందమామ కాజల్ అగర్వాల్. ఆరంభంలోనే భారీ హిట్లను సొంతం చేసుకున్న ఈ బ్యూటీ.. అనతి కాలంలోనే ఊహించని రీతిలో గుర్తింపును అందుకుంది. తద్వారా వరుస సినిమాలు చేసుకుంటూ హవాను చూపించింది. ఈ క్రమంలోనే కొన్నేళ్ల క్రితం తమిళంలో ఓ సినిమాలో నటించిందామె. అయితే, అందులో అసభ్యకర సన్నివేశాలు ఉండడంతో సినిమా విడుదల ఆగిపోయింది. అయితే, ఇప్పుడు దీని విషయంలో కాజల్ అగర్వాల్ అండ్ టీమ్ కీలక నిర్ణయం తీసుకుందట. ఆ వివరాలు మీకోసం!

  టిక్ టాక్ బ్యూటీ సోఫియా అన్సారీ హాట్ షో మామూలుగా లేదుగా.. ప్యాంట్ వేసుకోకుండానే అందాల ఆరబోత!

  అప్పటి నుంచి.. దాదాపు అందరితో

  అప్పటి నుంచి.. దాదాపు అందరితో

  ‘లక్ష్మీ కల్యాణం' అనే సినిమాతో కాజల్ అగర్వాల్ తెలుగు సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి పదుల సంఖ్యలో సినిమాలు చేసి సత్తా చాటిందామె. ఈ క్రమంలోనే తెలుగులో ఉన్న దాదాపు అందరు హీరోలతోనూ ఆడిపాడింది. అదే సమయంలో ఎన్నో విజయాలను అందుకుంది. అలాగే, రెమ్యూనరేషన్ కూడా భారీగానే తీసుకుంటూ రికార్డు క్రియేట్ చేసింది.

  జిమ్‌లో భార్యతో కలిసి సోను సూద్.. సమాజ సేవకు సహకరిస్తున్న ఆయన సతీమణి ఫోటోలు వైరల్

  కాజల్ ప్రేమ పెళ్లి.. కెరీర్‌ను ఆపలేదు

  కాజల్ ప్రేమ పెళ్లి.. కెరీర్‌ను ఆపలేదు

  కెరీర్ పరంగా ఫుల్ ఫామ్‌లో ఉన్నప్పుడే కాజల్ అగర్వాల్.. ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లు‌తో ప్రేమాయణం సాగించింది. ఇలా చాలా కాలం పాటు రహస్యంగా అతడితో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన తర్వాత 2020 అక్టోబర్ 30న అతడిని వివాహం చేసుకుంది. అయితే, చాలా మందిలా పెళ్లి తర్వాత బ్రేక్ తీసుకోకుండా.. తన కెరీర్‌ను కొనసాగిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోంది.

  నిధి అగర్వాల్ అందాల విందు..ఎద అందాలతో రెచ్చగొడుతూ చంపేస్తోందిగా!

  ఇద్దరు సీనియర్ హీరోలతో రొమాన్స్

  ఇద్దరు సీనియర్ హీరోలతో రొమాన్స్

  వివాహం తర్వాత కాజల్ తెలుగులో ‘మోసగాళ్లు' అనే సినిమా చేసింది. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ చిత్రం డిజాస్టర్ అయింది. ఇందులో ఆమె మంచు విష్ణుకు సోదరిగా నటించింది. ఇక, ప్రస్తుతం కాజల్.. మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న ‘ఆచార్య'లో హీరోయిన్‌గా చేస్తోంది. అలాగే, ప్రవీణ్ సత్తారు రూపొందిస్తోన్న చిత్రంలో అక్కినేని నాగార్జున సరసన నటించేందుకు పచ్చజెండా ఊపేసింది.

  బికినీలో బతుకు బస్టాండ్ హీరోయిన్.. వైరల్‌గా జెన్నిఫర్ పిసినాటో అర్ధనగ్న ఫోటోలు!

  బాలీవుడ్ మూవీ రీమేక్‌లో కాజల్

  బాలీవుడ్ మూవీ రీమేక్‌లో కాజల్

  బాలీవుడ్‌లో సూపర్ డూపర్ హిట్ అయిన చిత్రం ‘క్వీన్'. దీన్ని చాలా భాషల్లో రీమేక్ చేశారు. తమిళంలో ‘ప్యారిస్ ప్యారిస్' అనే టైటిల్‌తో వచ్చిన ఈ మూవీలో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ నటించింది. ఈ సినిమాను మీడియంట్‌ ఫిలిం పతాకంపై మనుకుమార్‌ నిర్మించారు. రమేష్ అరవింద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ కూడా గతంలో విడుదలైంది.

  మరోసారి హీటెక్కించిన అప్సర రాణి.. కళ్లతోనే కసికసిగా చూస్తూ..

  అన్ని భాషల్లో లేదు.. అక్కడే చిక్కు

  అన్ని భాషల్లో లేదు.. అక్కడే చిక్కు

  సందేశాత్మక కథతో వచ్చిన సినిమా కావడంతో ‘క్వీన్'ను దక్షిణాదిలోని అన్ని భాషల్లో తెరకెక్కించారు. తెలుగులో తమన్నా హీరోయిన్‌గా ‘దటీజ్‌ మహాలక్ష్మి', కన్నడంలో పరూల్‌మాధవ్‌ హీరోయిన్‌గా ‘బటర్‌ఫ్లై', మలయాళంలో మంజిమామోహన్‌ హీరోయిన్‌గా ‘జామ్‌జామ్‌' పేరుతో రూపొందింది. ఈ మూడు చోట్లా క్లియరెన్స్ రాగా.. కాజల్ సినిమా మాత్రం సెన్సార్ దగ్గర ఆగింది.

  ఆదా శర్మ హాట్ ఫిక్స్.. హార్ట్ ఎటాక్ పిల్ల మాములుగా లేదు

  ‘బూతు' సినిమాపై కీలక నిర్ణయం

  ‘బూతు' సినిమాపై కీలక నిర్ణయం

  నిజానికి ‘క్వీన్' మూవీ ఏమంత బోల్డుగా ఉండదు. కానీ, కాజల్ నటించిన ‘ప్యారిస్ ప్యారిస్'లో మాత్రం కొన్ని అసభ్యకర సీన్స్, డబుల్ మీనింగ్ డైలాగుల వల్ల ఇది ‘బూతు' సినిమా అని ముద్ర పడింది. సెన్సార్ బోర్డు చెప్పినట్లు సీన్స్ కట్ చేయడానికి ఒప్పుకోలేదు. ఈ కారణంగానే సినిమా విడుదల కాలేదు. ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై చిత్ర యూనిట్ ఓ కీలక నిర్ణయం తీసుకుందట.

  ఇప్పుడిలా వస్తోన్న ప్యారిస్ ప్యారిస్

  ఇప్పుడిలా వస్తోన్న ప్యారిస్ ప్యారిస్

  ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఓటీటీల హవా కనిపిస్తోంది. ఎలాంటి సినిమానైనా కట్స్ లేకుండా ఇందులో విడుదల చేయడానికి వీలు ఉంది. అందుకే ‘ప్యారిస్ ప్యారిస్'ను నేరుగా ఓటీటీలో విడుదల చేయబోతున్నారట. ఇందుకోసం పలు సంస్థలతో సంప్రదింపులు కూడా జరుపుతుందట చిత్ర యూనిట్. అయితే, ఇది ఈ చిత్రానికే పరిమితమా.. మిగిలినవి కూడా రిలీజ్ చేస్తారా చూడాలి.

  English summary
  Tollywood Star Heroine Kajal Aggarwal Few Days Back Completed Paris Paris Movie. This Film has run into trouble with the Censor Board. Now Movie Unit Decieded to Release The Movie on OTT.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X