Don't Miss!
- News
షార్ట్‌కట్స్ వద్దు! ‘యావరేజ్’ అద్భుతాలు సృష్టిస్తుంది: పరీక్షాపే చర్చలో ప్రధాని మోడీ
- Automobiles
బెంగళూరులో కనిపించిన కొత్త వెహికల్: ఇలాంటి వెహికల్ మీకెప్పుడైనా కనిపించిందా..
- Finance
Ticket Refund: విమాన ప్రయాణికులకు ఊరట.. DGCA తాజా నియమాల ప్రకారం..
- Sports
Team India : నువ్వు చెప్పింది ఎందుకు చేయాలి?.. కోచ్‌ను సూటిగా అడిగేసిన టీమిండియా ప్లేయర్!
- Lifestyle
పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? అయితే వీటిని క్షుణ్ణంగా పరిశీలించండి, లేకపోతే సమస్యలే!
- Technology
మీ కంప్యూటర్ లలో ఈ బ్రౌజర్ వాడుతున్నారా? జాగ్రత్త ...గవర్నమెంట్ వార్నింగ్ ఇచ్చింది!
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
Kajal Aggarwal: భర్తతో కాజల్ అగర్వాల్ రొమాన్స్.. ఏకంగా పెదాలను లాక్ చేసి మరీ!
టాలీవుడ్‌లోకి ఎంతో మంది భామలు హీరోయిన్లుగా ప్రవేశిస్తున్నారు. కానీ, అందులో చాలా తక్కువ మంది మాత్రమే సుదీర్ఘ కాలం పాటు స్టార్‌డమ్‌తో సత్తా చాటుతోన్నారు. అలాంటి వారిలో చందమామ కాజల్ అగర్వాల్ ఒకరు. సాదాసీదాగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది.. తక్కువ సమయంలోనే తనదైన అందం, అభినయంతో ఆకట్టుకుంది. అయితే, అప్పట్లో మాదిరిగి ఇప్పుడు మూవీస్ చేయడం లేదు. ఫలితంగా ఫ్యామిలీతోనే ఎక్కువగా సమయాన్ని గడుపుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా భర్తకు లిప్ కిస్ పెట్టిన ఓ పిక్‌ను కాజల్ వదిలింది. దాన్ని మీరే చూడండి!

అలా వచ్చి.. ఇలా పాపులర్
సినిమాల్లోకి అడుగు పెట్టడానికి ముందే కాజల్ అగర్వాల్ మోడలింగ్ రంగంలో సందడి చేసింది. ఈ క్రమంలోనే 'లక్ష్మీ కల్యాణం' అనే తెలుగు సినిమాతో హీరోయిన్‌గా ప్రవేశించింది. అలా ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించిన ఈ భామ.. తర్వాత వరుసగా అవకాశాలను అందుకుని హవాను చూపింది. ఫలితంగా ఎన్నో హిట్ చిత్రాల్లో భాగమై టాలీవుడ్‌లో స్టార్ అయిపోయింది.
Bigg Boss 7: బిగ్ బాస్‌కు బాలయ్య షాకింగ్ కండీషన్స్.. నాగార్జునకు మరో దెబ్బ.. ఇండస్ట్రీలో కలకలం

స్టార్ హీరోలతో రచ్చ చేస్తూ
హీరోయిన్‌గా పరిచయం అయిన తర్వాత తక్కువ సమయంలోనే కాజల్ అగర్వాల్ ఎన్నో సినిమాలు చేసింది. ఈ క్రమంలోనే ఎంతో మంది స్టార్ హీరోలతో స్క్రీన్‌ను పంచుకుంది. అలాగే, కొందరు జూనియర్లతోనూ హీరోయిన్‌గా చేసింది. అంతేకాదు, కాజల్ అగర్వాల్ తెలుగులోనే కాకుండా.. పలు భాషల్లోనూ సినిమాలు చేసింది. తద్వారా నేషనల్ రేంజ్‌లో క్రేజ్‌ను అందుకుంది.

లవ్ మ్యారేజ్... కెరీర్ స్లోగా
స్టార్ హీరోయిన్‌గా సుదీర్ఘ కాలం పాటు వరుస సినిమాలతో సందడి చేసిన కాజల్ అగర్వాల్.. గౌతమ్ కిచ్లూ అనే బిజినెస్‌మ్యాన్‌తో సీక్రెట్‌గా లవ్ ట్రాకును నడిపించింది. ఇలా ఏళ్ల పాటు అతడితో ప్రేమలో విహరించిన తర్వాత రెండేళ్ల క్రితమే వివాహం చేసుకుంది. అప్పటి నుంచి ఈ చిన్నది సినిమాల వేగాన్ని కూడా అమాంతం తగ్గించేసింది. అలాగే, ఆఫర్లు కూడా సన్నగిల్లిపోయాయి.
గృహలక్ష్మి లాస్య ఓవర్ డోస్ హాట్ షో: ఎద అందాలు చూపిస్తూ ఘోరంగా!

ఫ్యామిలీతోనే ఎక్కువగా
గౌతమ్ కిచ్లూను పెళ్లాడిన తర్వాత కాజల్ అగర్వాల్ ప్రెగ్నెంట్ అయింది. దీంతో ఈ బ్యూటీ నాగార్జున 'ది ఘోస్ట్' సహా పలు చిత్రాల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే ఆమె ఏప్రిల్ 19వ తేదీన ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. కాజల్ దంపతులు తమ బిడ్డకు 'నీల్ కిచ్లూ' అని పేరు పెట్టారు. ఇక, ఇప్పుడు ఈ హీరోయిన్ ఫ్యామిలీతోనే ఎక్కువగా సమయం గడుపుతోంది.

సోషల్ మీడియాలో బిజీ
స్టార్ హీరోయిన్‌గా చాలా ఏళ్ల పాటు సినిమాల మీద సినిమాలు చేసినా.. ఈ మధ్య కాలంలో వెండితెరపై పెద్దగా సందడి చేయకున్నా.. కాజల్ అగర్వాల్ మాత్రం తన అభిమానులను ఏమత్రం నిరాశ పరచుకుండా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగా తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను పంచుకుంటూనే ఉంటోంది.
యాంకర్ రష్మీ గుట్టురట్టు చేసిన కమెడియన్: ఆ పని చేసి డబ్బు సంపాదిస్తుందంటూ షాకింగ్‌గా!

భర్తతో రొమాంటిక్ పిక్స్
సోషల్ మీడియాలో తన ఫొటోలు, వీడియోలను వదులుతూ ఫ్యాన్స్‌కు మజాను పంచుతోన్న స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్.. ఈ మధ్య కాలంలో తన హాట్ హాట్ పిక్‌లను కూడా షేర్ చేస్తోంది. మరీ ముఖ్యంగా భర్త గౌతమ్ కిచ్లూతో కలిసి తీసుకున్న రొమాంటిక్ ఫొటోలను కూడా వదులుతోంది. తద్వారా ఈ అమ్మడు తరచూ వార్తల్లో నిలవడంతో పాటు తెగ హైలైట్ అయిపోతోంది.

లిప్ కిస్ పెట్టేసిన కాజల్
కాజల్ అగర్వాల్ తాజాగా తన భర్త గౌతమ్ కిచ్లూతో కలిసి తీసుకున్న ఓ రొమాంటిక్ పిక్‌ను షేర్ చేసింది. ఇందులో ఆమె అతడికి ఏకంగా లిప్ కిస్ ఇచ్చేసింది. అలాగే, ఎంతో క్లోజ్‌గా ఉన్న మరో ఫొటోను కూడా వదిలింది. దీంతో ఈ పిక్‌లకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. ఫలితంగా ఇవి చాలా తక్కువ సమయంలోనే విపరీతంగా వైరల్ అయిపోతోన్నాయి.