For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  కొడుకుని పరిచయం చేసిన కాజల్ అగర్వాల్.. ఎంత క్యూట్ గా ఉన్నాడో చూశారా?

  |

  లక్ష్మీ కళ్యాణం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ చాలాకాలంపాటు తెలుగులో బడా హీరోయిన్ గా అనేక సినిమాలు చేసిన కాజల్ అగర్వాల్ కాస్త అవకాశాలు తగ్గాయి అనుకుంటున్న సమయంలో కరోనా ఎంట్రీ ఇచ్చింది. ఆ సమయంలో ఒంటరి జీవితం గడిపి పెళ్లి మీద మక్కువ కలిగిందో లేక సినిమా అవకాశాలు తగ్గాయి కాబట్టి ఫ్యామిలీ ప్లానింగ్ మీద దృష్టి పెట్టాలని అనుకుందో తెలియదు కానీ వెంటనే తన చిరకాల ప్రియుడు గౌతమ్ ను వివాహం చేసుకుంది. ఈ మధ్య ఒక పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఆమె తాజాగా ఆ బుడతడి ఫోటో షేర్ చేసింది. ఆ వివరాల్లోకి వెళితే

  లక్ష్మీ కళ్యాణంతో

  లక్ష్మీ కళ్యాణంతో


  ముంబైలో సెటిలైన పంజాబీ సాంప్రదాయ కుటుంబంలో పుట్టి పెరిగిన కాజల్ అగర్వాల్ చిన్ననాటి నుంచి సినీ పరిశ్రమ మీద ఆసక్తి పెంచుకుంది. ఆమె తల్లిదండ్రులు టెక్స్టైల్ బిజినెస్ చేస్తూ ఉండేవారు. మాస్ మీడియాలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న కాజల్ తర్వాత ఎంబీఏ కూడా చదివింది. తర్వాత సినీ పరిశ్రమ మీద ఆమె ఏర్పరుచుకున్న ఇష్టం కారణంగా ఒక బాలీవుడ్ సినిమా ద్వారా ఆమె సినీరంగ ప్రవేశం చేసింది. ఆ సినిమా పెద్దగా కలిసి రాలేదు కానీ తెలుగులో లక్ష్మీ కళ్యాణం అనే సినిమా ద్వారా ఆమెకు మరో అవకాశం మాత్రం దక్కేలా చేసింది.

  మగధీరతో స్టార్ హీరోయిన్

  మగధీరతో స్టార్ హీరోయిన్

  ఆమెకు తెలుగులో మొదటి సినిమా కలిసి రాకపోయినా చేసిన రెండో సినిమానే సూపర్ హిట్ కావడంతో ఆమె దశ తిరిగిపోయింది. కృష్ణవంశీ దర్శకత్వంలో చేసిన చందమామ అనే సినిమా సూపర్ హిట్ కావడంతో తర్వాత ఏడాది ఆమెకు వరుస అవకాశాలు వచ్చిపడ్డాయి. అయితే ఆ సినిమాలేవీ ఆమెతో కలిసి రాలేదు. కానీ మగధీరతో స్టార్ హీరోయిన్ అనిపించుకుంది.

  కరోనా సమయంలో

  కరోనా సమయంలో

  ఆ తర్వాత ఆర్య 2, డార్లింగ్, బృందావనం, మిస్టర్ పర్ఫెక్ట్, బిజినెస్ మాన్, తుపాకి, నాయక్, జిల్లా, టెంపర్, జనతా గ్యారేజ్, ఖైదీ నెంబర్ 150, నేనే రాజు నేనే మంత్రి సినిమాలు ఆమెకు మంచి హిట్స్ గా నిలిచాయి. అయితే కరోనా కంటే ముందు ఏడాది మూడు సినిమాలు చేస్తే మూడు సినిమాలు కూడా డిజాస్టర్ రిజల్స్ వచ్చాయి. దీంతో ఆమె ఏమనుకుందో ఏమో కానీ కరోనా సమయంలో తన చిరకాల ప్రియుడు గౌతమ్ ను వివాహమాడింది.

  Recommended Video

  కరోనా భారిన సోనియా - Get Well Soon
  ముఖం ఒక్కటే కనిపించకుండా

  ముఖం ఒక్కటే కనిపించకుండా


  సైలెంట్ గా వివాహం చేసుకుని షాకిచ్చిన ఆమె తర్వాత తాను గర్భవతిని అని ప్రకటించి కూడా అందరికీ ఒక్కసారిగా షాక్ ఇచ్చింది. ఈ మధ్యనే ఒక బాబుకి జన్మనిచ్చిన ఆమె ఇప్పటి వరకు అతనితోనే టైం గడుపుతూ వచ్చింది. ఇప్పటివరకు కొడుకు ఫోటోలను బహిర్గతంగా షేర్ చేయకుండా జాగ్రత్త పడిన ఆమె తాజాగా మాత్రం ముఖం ఒక్కటే కనిపించకుండా మిగతా భాగం కనిపించేలా ఫోటో షేర్ చేసింది.

  బుడతడి ఫోటో చూసి ఆనందం

  కేవలం కళ్ళు భాగాన్ని మూసేసిన కాజల్ ముఖం మొత్తం కనిపించకుండా తన కొడుకుతో ముద్దులాడుతున్న ఫోటో షేర్ చేయడంతో ఆమె అభిమానులు అందరూ బాబు భలే క్యూట్ గా ఉన్నాడు కదా అంటూ కామెంట్లు పెడుతున్నారు. అన్నట్టు ఆ బుడతడి కి నీల్ అంటూ పేరు కూడా పెట్టిన సంగతి తెలిసిందే. బుడ్డోడి ఫోటోలు బయటకు రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్న ఆమె ఎప్పటికైనా షేర్ చేయాల్సిందే కదా అనుకుందో ఏమో కానీ తాజాగా ఒక ఫోటో షేర్ చేసింది. దీంతో ఆమె అభిమానులు అందరూ బుడతడి ఫోటో చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

  English summary
  Kajal Aggarwal shared her son neel kichlu's photo for the first time through her social media.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X