లిప్‌లాక్‌తో రెచ్చిపోయిన కాజల్ అగర్వాల్... భర్తతో రొమాంటిక్ మూడ్‌లో హీరోయిన్

ఉత్తరాది నుంచి టాలీవుడ్‌కు దిగుమతి అయి ఇక్కడ స్టార్ హీరోయిన్ అనిపించుకున్న ముద్దుగుమ్మలు చాలా మందే ఉన్నారు. వీరిలో కలువ కళ్ల కాజల్ కూడా ఒకరు. స్టార్ హీరోయిన్‌గా టాలీవుడ్, కోలీవుడ్‌లను దున్నేసిన ఈ చందమామ... దక్షిణాదిలోని అందరు టాప్ హీరోలతో నటించింది. కొన్నేళ్ల పాటు ఏ సినిమా చూసినా హీరోలు మారేవారు తప్పించి, హీరోయిన్‌గా కాజల్ ప్లేస్ మారలేదంటే ఆమె హవా అర్ధం చేసుకోవచ్చు. ఇటీవలే 40 ప్లస్‌ క్రాస్ చేసిన కాజల్ అగర్వాల్... ఈ వయసులోనూ చెక్కుచెదరని గ్లామర్‌తో కుర్ర హీరోయిన్లకు పోటీ ఇస్తున్నారు.

లక్ష్మీ కళ్యాణంతో టాలీవుడ్ ఎంట్రీ
2004లో క్యా హో గయా నా అనే హిందీ సినిమాలో చిన్న పాత్రతో వెండి తెర మీద అడుగుపెట్టారు కాజల్. ఈ దశలో దర్శకుడు తేజ కళ్లలో పడటం ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన లక్ష్మీ కళ్యాణం సినిమాతో కాజల్ తెలుగు వారిని పలకరించారు. తొలి సినిమాతోనే తన అందంతో కుర్రాళ్లకు గిలిగింతలు పెట్టిన కాజల్‌కు ఆ తర్వాత వరుసగా అవకాశాలు వచ్చాయి.

Kajal Aggarwal s liplock with husband Gautam Kitchlu while celebrates Karwa Chauth

చందమామతో తొలి బ్రేక్
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్వకత్వంలో తెరకెక్కిన చందమామతో తొలి బ్రేక్ అందుకున్నారు కాజల్ అగర్వాల్. ఈ దశలో దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి విజువల్ వండర్ మగధీరతో ఆమె స్టార్ హీరోయిన్‌గా నిలిచారు. పునర్జన్మలు, రివెంజ్, లవ్ స్టోరీ కాన్సెప్ట్‌తో వచ్చిన మగధీరలో యువరాణి మిత్రవిందగా రాయల్ లుక్‌లో కనిపించారు కాజల్. తర్వాత ఆర్య 2, డార్లింగ్, బిజినెస్‌మెన్, బృందావనం, మిస్టర్ పర్ఫెక్ట్, ఖైదీ నెంబర్ 150, భగవంత్ కేసరి, నేనే రాజు నేనే మంత్రి, ఆచార్య తదితర చిత్రాలలో కాజల్ నటించారు.

20 ఇయర్స్ ఇండస్ట్రీ
సినీరంగంలో 20 ఏళ్ల కెరీర్ పూర్తి చేసుకున్న అతికొద్ది మంది హీరోయిన్లలో ఒకరిగా కాజల్ నిలిచారు. తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషలలో 60కి పైగా సినిమాలలో నటించి భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణుల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు కాజల్ అగర్వాల్. తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లూని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఓ బాబు నీల్ సంతానం. తను హీరోయిన్‌గా స్థిరపడటమే కాకుండా చెల్లెలు నిషా అగర్వాల్‌ను కూడా పరిశ్రమకు పరిచయం చేశారు.

భర్తకు ఘాటు లిప్‌లాక్
పెళ్లి తర్వాత రీ ఎంట్రీలోనూ కాజల్ నటిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ది ఇండియా స్టోరీ, ఇండియన్ 3, రామాయణ పార్ట్ 1, పార్ట్ 2లో ఆమె నటిస్తున్నారు. సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ కుటుంబానికి సమయాన్ని కేటాయిస్తున్నారు చందమామ. భర్త, కొడుకుతో పాటు తన చెల్లెలు నిషా అగర్వాల్, తల్లిదండ్రులతో ఆమె గడుపుతుంటారు. తాజాగా కార్వా చౌత్ పర్వదినాన్ని కాజల్ తన కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకున్నారు. ఎరుపు రంగు చీరలో మెరిసిపోతున్న కాజల్... జల్లెడలో నుంచి భర్తను చూస్తూ ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. ఇక భర్త గౌతమ్‌కి లిప్‌లాక్ పెట్టి రెచ్చిపోయారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా... 40 ప్లస్‌లోనూ కాజల్ ఏమాత్రం తగ్గడం లేదని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X