రంగస్థలం, యూ టర్న్ పోల్చి చూస్తే.. సమంతపై కవిత ఆసక్తికర వ్యాఖ్యలు!
ఈ ఏడాది సమంత విభిన్న చిత్రాలతో దూసుకుపోతోంది. వైవిధ్య భరితమైన పాత్రల ఎంచుకుంటూ విజయాలు అందుకుంటోంది. సమంత నటించిన తాజా చిత్రం యూ టర్న్. సస్పెన్స్ థ్రిల్లర్ గా విడుదలైన ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. తాజగా ఈ చిత్ర సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ కవిత ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
కవిత మాట్లాడుతూ సమంత మోడ్రన్ మహిళలకు ఆదర్శం అని ప్రశంసించారు. విభిన్నమైన పాత్రలు చేయడానికి సమంత భయపడదని కవిత అన్నారు. రంగస్థలం చిత్రంలో సమంత చాలా బాగా నటించింది. ఆ చిత్రాన్ని, యూ టర్న్ చిత్రాన్ని పోల్చి చూసుకుంటే ఏమాత్రం పోలిక లేదని అన్నారు.

సమంత మంచి నటిగా మాత్రమే కాక సమజైక కార్యక్రమాలు చేయడంలో కూడా ముందుంటుందని కవిత అన్నారు. ప్రత్యూష పౌండేషన్ ద్వారా సేవాకార్యక్రమాలు చేస్తోందని, తెలంగాణ చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ వ్యవహరిస్తోందని కవిత గుర్తు చేశారు.


Click it and Unblock the Notifications











