ఆ ఐపీఎస్‌ను సస్పెండ్ చేయండి.. ఆమె చర్యలు సిగ్గుచేటు.. కంగన రనౌత్ ఫైర్
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగన రనౌత్ ఓ పోలీసు ఉన్నతాధికారిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దీపావళీ పండుగ నేపథ్యంలో పటాసులు కాల్చడంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఐపీఎస్ అధికారి రూపా మౌద్గిల్‌ను తప్పపట్టారు. అలాంటి అధికారిణి ఉన్నతమైన పోలీస్ ఫోర్స్‌లో ఉండటం సిగ్గుచేటు అంటూ కంగన రనౌత్ మాటల బాణాలు సంధించారు.
దీపావళి పండుగ నేపథ్యం, ఎక్కడ పుట్టిందనే విషయంపై ఇటీవల ఓ సంస్థకు చెందిన ట్విట్టర్ హ్యాండిల్‌కు, రూపా మౌద్దిల్ మధ్య జరిగిన ట్విట్టర్ వార్‌లో కంగన జోక్యం చేసుకొంటూ ఆగ్రహంతో ఓ ట్వీట్ చేశారు. దీపావళి పండుగ సందర్భంగా టపాసులను కాల్చడం హిందూ సంప్రదాయం కాదు. అలాంటి ఆచారాలు, సంప్రదాయాలు పాటించాలని ఎలాంటి మత గ్రంథాల్లో పేర్కొన్నలేదు అంటూ ట్వీట్ చేశారు. అయితే హిందూ మనోభవాలు దెబ్బ తీసే విధంగా కామెంట్స్ చేశారంటూ ఓ సంస్థ అభ్యంతరం తెలుపుతూ రూపాను నిలదీసింది. అయితే తన వ్యాఖ్యలకు బలం చేకూర్చేలా ఆధారాలు చూపడంలో విఫలం కావడంతో నెటిజన్లు విరుచుపడ్డారు.

ఈ క్రమంలో కంగన రనౌత్ పోలీస్ బెంగళూరుకు చెందిన అధికారిణి రూపాపై మండిపడుతూ.. ఇలాంటి ఆఫీసర్‌ను వెంటనే సస్పెండ్ చేయాలి. ప్రజల మనోభావాలు పరిరక్షించకపోవడం కాకుండా.. వారి మనోభావాలను దెబ్బ తీసే విధంగా మాట్లాడారు అంటూ కంగన ట్వీట్‌లో పేర్కొన్నారు.
ప్రజలు కట్టే పన్నులతో జీవితం చేసే అధికారులు సాధారణ ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. పనివేళలో ట్రోలింగ్ చేసే విధంగా ట్వీట్లు చేయడం ఎంత వరకు సమంజసం. యువతను బెదిరించే విధంగా వ్యవహరించడం సరైనదేనా అంటూ కంగన తన ట్వీట్‌లో మండిపడ్డారు. రిజర్వేషన్ల సైడ్ ఎఫెక్ట్స్ ఇలానే ఉంటాయి. నాకు వారి వ్యక్తిగత జీవితం గురించి నాకు అవసరం లేదు. కానీ అసమర్ధత కారణంగా ఆందోళనలో ఉన్నారనే విషయం స్పష్టమవుతున్నది అంటూ కంగన రనౌత్ తన ట్వీట్ ద్వారా విరుచుకుపడ్డారు.


Click it and Unblock the Notifications











